అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today June 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి ఐలవ్‌యూ చెప్పిన సూరజ్! నా అసలైన మనవరాలు దీపే.. డూప్లికేట్‌కి టైం దగ్గర పడిందా!

Karthika Deepam 2 Serial Today June 11th: జ్యోత్స్న సూరజ్‌ని కొట్టడం.. సూరజ్ జ్యోత్స్నకి ఐలవ్‌యూ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెద్దాయన జ్యోత్స్నను కుటుంబం నుంచి బహిష్కరించి, దీపను ఆదరించాడు.
  • సూరజ్ జ్యోత్స్నను హెచ్చరించి, అనూహ్యమైన ప్రేమాభిమానాలను వ్యక్తపరిచాడు.
  • దీప, కార్తీక్ జ్యోత్స్నను ఎగతాళి చేయగా, ఆమె ప్రతీకారం పన్నాలనుకుంది.
  • సుమిత్ర జ్యోత్స్న ప్రవర్తనకు బాధపడగా, దీప ఓదార్పునిచ్చింది.

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్ 11న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఇక నుంచి నా మనవరాలు దీపే..

తిన్నంటి వాసాలు లెక్కపెట్టిన జ్యోత్స్నని అందరూ తిడతారు. పెద్దాయన అయితే నిన్ను తిట్టడానికి నోరు రావడం లేదు.. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. అసలు ఓటింగ్ పద్ధతి రద్దు చేసి ఏకగ్రీవంగా దీపని సీఈఓ చేసుంటే అయిపోయేది.. అసలు ఈ రోజు నుంచి నా కుటుంబంలో నువ్వు ఉండవు.. నువ్వు ఉన్నావు అని ఎంత మంది అనుకుంటారో నాకు తెలీదు కానీ నేను మాత్రం నీ గురించి చెప్పాల్సి వస్తే ఇది వరకు ఒక మనవరాలు ఉండేది ఇప్పుడు ఆ మనవరాలిని దీపలో చూసుకుంటున్నా అని చెప్తా అంటారు. దీప, కార్తీక్, దశరథ్ చాలా సంతోషపడతారు. నీ లాంటి వాళ్లని క్షమించాలి అంటే క్షమించడం అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది.. నీలాంటి వాళ్లని మనుషుల జాబితా నుంచి తీసేయడమే బెటర్.. ఇప్పుడు నేను చేసేది ఇదే.. నా కుటుంబం అనే మనుషుల్లో ఇక మీద జ్యోత్స్నని గుర్తు పెట్టుకోకూడదు.. తను ఉన్నా లేనట్టే.. అని పెద్దాయన తీర్పు ఇచ్చేస్తారు.  

దీన్ని వదిలేయడమే సరైన శిక్ష..

సుమిత్ర భర్తతో మామయ్య గారు మంచి పని చేశారు.. దీన్ని ఇలా వదిలేయడమే సరైన శిక్ష అని అంటుంది. దశరథ్, పారులతో దీనితో మీరు ఇక మాట్లాడకండి.. ఇలా వదిలేయండి అని అంటుంది. అందరూ వెళ్లిపోతారు. 

బాధగా ఉందా.. ఇదే రిపీట్ అవుతుంది.. 

సూరజ్‌ని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. సూరజ్ దగ్గరకు వెళ్లి  బాధగా ఉందా.. మనసుని ఎవరో మెలిపెట్టినట్లు ఉందా.. మీరు ఉసిగొల్పిన కుక్కలు ప్రతీసారి ఎదుటి వాళ్లనే కరవవు.. కొన్ని సార్లు మిమల్ని కరుస్తాయి.. మీకు మాత్రం ఇక నుంచి ఇదే రిపీట్ అవుతుంది.. గుడ్ బాయ్ అని సూరజ్ చెప్పి వెళ్లిపోతాడు. వెళ్తున్న సూరజ్‌ని జ్యోత్స్న చిటెకె వేసి ఆపుతుంది.

నీ దెబ్బ అదిరిపోయిందిరా.. 

 తాత అన్న మాటలు గుర్తు చేసుకొని సూరజ్‌ని లాగి పెట్టి కొడుతుంది. ఏంట్రా కోపం రావడం లేదా.. నీ దెబ్బ అదిరిపోయిందిరా.. నిన్ను ఎక్కడో రోడ్డు మీద కొడితే నువ్వు పట్టపగలు నా ఇంట్లో నన్ను చేతకాన్ని దాన్ని చేసేశావ్.. రోజులు లెక్కపెట్టుకో.., నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు.. చావడానికి సిద్ధంగా ఉండు అని అంటుంది. నేను గమ్యంతో విసిరిన  బంతి లాంటి వాడిని నా గమ్యం వైపు వెళ్తూనే ఉంటా ఎవరు ఆపినా ఆగను అని అంటాడు. 

ఐలవ్‌యూ జ్యోత్స్న..

రేయ్ మామూలుగానే నేను పెద్ద కంత్రిని.. నాకు నచ్చిన బొమ్మ నువ్వు ఇవ్వను అంటేనే నిన్ను వదల్లేదు.. ఇప్పుడు నా వాళ్ల ముందు నన్ను ఫూల్‌ని చేస్తే వదులుతానా అని జ్యోత్స్న అంటుంది. దానికి సూరజ్ అయితే వదలకు గట్టిగా పట్టుకో అని అంటాడు. జోక్ చేస్తున్నా అనుకుంటున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. దానికి సూరజ్ నీకు సీరియస్‌గా ఓ విషయం చెప్పనా.. ఐలవ్‌యూ అని అంటాడు. ఏంట్రా అన్నావ్ అని జ్యోత్స్న అంటే థాంక్యూ అన్నాను అని అంటాడు. దానికి జ్యోత్స్న లేదు వేరే ఏదో అన్నావ్..  అని అంటుంది. నేను విన్నది కరెక్టేనా అని జ్యోత్స్న అంటే అది నాకు తెలీదు కానీ నేను అన్నది మాత్రం కరెక్టే.. నన్ను ఇంత ప్రేమగా టచ్ చేసిన మొదటి అమ్మాయివి నువ్వే.. నన్ను టచ్ చేసిన ఫస్ట్ అమ్మాయివి కూడా నువ్వే.. అందుకే థ్యాంక్స్ చెప్తున్నా.. అని చెప్పి వెళ్లిపోతాడు. 

తేడా గాళ్లు అంతా నీకే తగులుతారా.. 

ఏం అన్నాడే అని పారు జ్యోత్స్నని అడిగితే కొడితే థ్యాంక్స్ చెప్తున్నాడు అని జ్యో అంటుంది. దానికి పారు తేడా గాళ్లు అంతా నీకే తగులుతున్నారేంటే.. కార్తీక్ గాడు అనుకుంటే వీడు వచ్చాడు.. వీడు అయితే నిన్ను ఉతికి దండం మీద వేసేస్తున్నాడు అని అంటుంది. వీడిని బతకనివ్వను అని జ్యోత్స్న అంటే వాడి జోలికి వెళ్లొద్దు అని పారు అంటుంది. అందరూ నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదా నువ్వు వాళ్లతో వెళ్లిపో అని జ్యోత్స్న చెప్పి వెళ్లిపోతుంది. 

ఆ మాట మరోసారి చెప్పు బావ..

దీప జ్యూస్ తాగుతూ బావ అమ్మ చెప్పిన మాట మరోసారి చెప్పు అంటాడు. ఇప్పటికి 30 సార్లు చెప్పాను అని దీప అంటుంది. కార్తీక్ మళ్లీ చెప్తాడు. మా అమ్మతో ఏ మాట అనిపించుకోవాలి అనుకున్నానో ఆ మాట అనేసింది అంటుంది. ఇంతలో జ్యోత్స్న రావడంతో ఏయ్ డూప్లికేట్ అని దీప సెటైర్లు వేస్తుంది. ఇంట్లో నీ పరిస్థితి మర్చిపోయావ్ మేడం అని కార్తీక్ అంటే ఈ డూప్లికేట్‌తో మనకు ఏంటి బావ.. నాకు అయితే ఈ ఇంట్లో పూర్తిగా ఉండిపోవాలి అని ఉంది అని అంటుంది. ఇది నీ ఇల్లే కదా దీప అని కార్తీక్ అంటాడు. ఈ డూప్లికేట్‌ని అందరూ తరిమేశారు. టిఫెన్ కూడా పెట్టరు సిగ్గులేకుండా వచ్చి తింటే అందరూ అసహ్యించుకొని వెళ్లిపోతారు అని దీప జ్యోత్స్నని ఉడికిస్తుంది. ఈ డూప్లికేట్‌కి థ్యాంక్స్ చెప్పాలి అని ఇద్దరూ బుగ్గలు గిల్లేస్తారు. డూప్లికేట్‌కి పెళ్లి కల వచ్చేసింది బావ.. త్వరగా పెళ్లి చేసి రుణం తీర్చుకుందా.. లవ్ బుజ్జమ్మా అని దీప చెప్పి మా అమ్మ నా కూతురు నా కోసం ఎదురు చూస్తుంటారు వెళ్తా అని అంటుంది. 

వాడిని చంపేయండిరా.. 

జ్యోత్స్న రౌడీలకు కాల్ చేసి సూరజ్‌ని చంపేయమని అంటుంది. ఇంట్లో వాళ్లకి ఎలా దగ్గరవ్వాలో ఏంటో అందుకు దీప ఇక్కడ ఉండకూడదు అని జ్యోత్స్న అనుకుంటుంది. దీప గదిలోకి వెళ్లే సరికి సుమిత్ర పాపని పడుకోపెడుతుంది. నా కూతురు అదృష్టవంతురాలు అమ్మా అని దీప అంటే నీ కూతురు అదృష్టవంతురాలు కానీ నేనే దురదృష్టవంతురాలిని అని సుమిత్ర అంటుంది. మంచి భర్త, తండ్రి లాంటి మామయ్య.. మంచి కుటుంబం ఉంది కదా అని దీప అంటుంది. గౌరవం కాపాడలేని సంతానం ఉంటే ఎలా అదృష్టవంతురాలిని అవుతా అని సుమిత్ర బాధ పడుతుంది.

కన్న తల్లి లేకపోయినా నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నావ్ చూడు.. నీ తల్లి చేసుకున్న అదృష్టం నేను ఎందుకు చేసుకోలేదు అని బాధగా ఉంది.. నా కూతురి చేసిన తప్పులకు నన్ను క్షమించు దీప అని సుమిత్ర అంటుంది. నా కూతురు కూడా నీలా ఉంటే ఎంత బాగుంటుందో అని సుమిత్ర అంటే మీరు కోరుకున్న రోజులు త్వరలోనే వస్తాయి అని దీప అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

  ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది?  ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

జ్యోత్స్న పట్ల పెద్దాయన వైఖరి ఏమిటి?

పెద్దాయన జ్యోత్స్న చేసిన పనులకు అసహ్యించుకుని, ఆమెను తన కుటుంబం నుండి తీసివేశారు. దీపను తన మనవరాలిగా చూసుకుంటానని చెప్పారు.

జ్యోత్స్న సూరజ్‌ని చంపమని ఎవరికి చెప్పింది?

జ్యోత్స్న రౌడీలకు కాల్ చేసి సూరజ్‌ని చంపమని చెప్పింది. ఇంట్లో వాళ్లకు దగ్గరవాలంటే దీప ఇక్కడ ఉండకూడదని కూడా ఆమె అనుకుంది.

పెద్దాయన దీప గురించి ఏమన్నారు?

పెద్దాయన దీపను తన మనవరాలిగా చూసుకుంటానని చెప్పారు. ఓటింగ్ రద్దు చేసి దీపను సీఈఓ చేస్తే బాగుండేదని కూడా అన్నారు.

సూరజ్ జ్యోత్స్నతో ఎలా ప్రవర్తించాడు?

సూరజ్ జ్యోత్స్నను హెచ్చరించాడు. తర్వాత ఆమె కొట్టినప్పుడు, 'ఐ లవ్ యూ' అని చెప్పి, ఆమె తనను టచ్ చేసిన మొదటి అమ్మాయి అని థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌కి 7 ఏళ్ల జైలు శిక్ష..! కానీ.. అమూల్య అలా చెప్పిందేంటి? పగ పట్టేసిన వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌కి 7 ఏళ్ల జైలు శిక్ష..! కానీ.. అమూల్య అలా చెప్పిందేంటి? పగ పట్టేసిన వల్లీ!
Gundeninda Gudigantalu July10th Episode:మనోజ్ తిక్క కుదిర్చేందుకు బాలు చేసిన పనేంటి...? గుడ్డివాడిగా ఇంట్లో తిప్పలు పడుతున్న మనోజ్‌
గుండెనిండా గుడిగంటలు: మనోజ్ తిక్క కుదిర్చేందుకు బాలు చేసిన పనేంటి...? గుడ్డివాడిగా ఇంట్లో తిప్పలు పడుతున్న మనోజ్‌
Brahmamudi Serial Today July 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన నందు – లక్కీని ఓదార్చిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన నందు – లక్కీని ఓదార్చిన రాజు  
Nindu Manasulu Serial Today July 10th: నిండు మనసులు: ఇందిర బతకడం కష్టమేనా! గణని రాజశేఖరం ఎందుకు బతిమాలాడు!
నిండు మనసులు: ఇందిర బతకడం కష్టమేనా! గణని రాజశేఖరం ఎందుకు బతిమాలాడు!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget