Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కార్మికుల నేతలు విహారితో అంబికనే ఛైర్మన్‌గా కావాలని కోరుతారు. అంబిక లోలోపల గెంతేస్తూ పైకి మాత్రం ఇష్టం లేదని చెప్తుంది. దాంతో విహారి అంబికను ఒప్పించి.. తాను రిజైన్ చేసి అంబికను ఛైర్మన్ చేస్తాడు. ప్రెస్ మీట్ పెట్టి అంబిక కొత్త ఛైర్మన్ అని చెప్పగానే ధర్నాకి దిగిన అందరూ వెళ్లిపోతారు. దాంతో లక్ష్మీకి అనుమానం వస్తుంది. అంబికతో మాట్లాడుతుంది. యమునమ్మని మీరు కాపాడటం.. మీరు చెప్పగానే కార్మికులు ధర్నా ఆపేయడం అన్నీ నా అనుమానాలు అని అంటుంది. నీ అనుమానాలు ఏంటే అని అంబిక లక్ష్మీ మెడ పట్టుకుంటే లక్ష్మీ రివర్స్‌లో అంబిక గొంతు నులుపేసి అన్నీ బయటకు లాగుతా మళ్లీ విహారి గారు ఛైర్మన్ సీట్‌లో కూర్చొనే వరకు వదలను అని వార్నింగ్ ఇస్తుంది. ఇవి నిన్నటి హైలెట్స్. ఈ రోజు ఏం జరిగింది అంటే..

విహారికి లాయర్‌ కాల్ చేసి విహారి గారు మీకు ఓ బ్యాడ్‌ నూస్. కార్మికులు వాళ్ల ఫ్యామిలీలు నెగోజేషన్‌కి ఒప్పుకోలేదు.. కోర్టులో కేసు పెట్టారు. రేపు కోర్టుకి రావాలి అని చెప్తాడు. విహారి సరే అని వాళ్ల చావుకి నాదే బాధ్యత నేనే వస్తాను అంటాడు. ఇంట్లో విషయం తెలియగానే అందరూ షాక్ అవుతారు. ఇక రేపే కోర్టుకి వెళ్లాలి అనగానే సహస్ర తల్లితో ఇంకా ఇంకా పెద్ద లాయర్‌ని పెట్టి బావకి ఏం కాకుండా చూసుకో అమ్మా అని చెప్తుంది. ఇప్పుడు చాలా పెద్ద లాయర్‌నే పెట్టాను ఆయన చూసుకుంటారని పద్మాక్షి అంటుంది.  ఇక యమున మనసులో రేపే ఈ కేసు అంటున్నారు.. విడాకుల కేసు రేపే ఉంది. అందరూ కోర్టుకి వస్తే లక్ష్మీ, విహారిల బంధం గురించి తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడుతుంది. 

లక్ష్మీ విహారి దగ్గరకు వెళ్లి రేపు డివోర్స్ కేసు కూడా ఉంది కదా.. ఆ కేసు వాయిదా వేద్దామా అందరికీ తెలిసిపోయేలా ఉంది అని లక్ష్మీ అంటే తెలియని.. నీకు విడాకులు వద్దు అంటే ఒప్పుకోవు కదా.. అంటాడు. కచ్చితంగా రేపు విడాకుల కేసుకు వస్తాను.. నిన్ను నన్ను కోర్టు ఎలా విడదీస్తుందో చూస్తా అని అంటాడు. యమున లాయర్‌కి ఫోన్ చేసి రేపే వేరే కేసు ఉంది.. వాయిదా వేస్తామా అంటే అలా కుదరదు.. విహారి గారి వైపు నుంచి ట్రై చేయండి అని అంటారు. 

లక్ష్మీని యమున చూసి పిలుస్తుంది. లక్ష్మీతో విడాకుల కేసు వాయిదా గురించి అడుగు అని అంటుంది. ఇప్పటికే అడిగాను ఆయన ఒప్పుకోవడం లేదు అని అంటుంది. ఎంత చెప్పినా విహారి ఒప్పుకోవడం లేదని కేసు జరగాల్సిందే అని ఒప్పుకుంటున్నారని అంటుంది. యమున చాలా టెన్షన్ అవుతుంది.  ఉదయం లక్ష్మీ అందరి కోసం టిఫెన్లు సర్దుతూ అందరికీ విషయం తెలిస్తే చాలా పెద్ద ప్రమాదం అయిపోతుందని అంటుంది. ఇంతలో యమున వచ్చి అందరూ కోర్టుకి బయల్దేరుతున్నారు ఈ గండం ఎలా దాటుతామో ఏంటో అని అంటుంది.

లాయర్ ఇంటికి రాగానే పద్మాక్షి, అంబికలు విహారిని కోర్టుకి వద్దని అంటారు. నువ్వు బోనులో నిల్చొవడం నాకు ఇష్టం లేదని పద్మాక్షి అంటుంది. అందరూ విహారికి వద్దని అంటారు. ఇంట్లో కూర్చొంటే నా ఓటమి ఒప్పుకోలేను.. ఈ రోజు నా జీవితానికి ముఖ్యమైన రోజు.. నా జీవితాన్ని కాపాడుకోవాలి.. అంటూ లక్ష్మీని చూస్తూ విడాకుల గురించి చెప్పి.. బిజినెస్ కూడా వదలను అని అంటాడు. లక్ష్మీతో లక్ష్మీ అన్ని ఫైల్స్ తీసుకురా నేను అన్నీ అక్కడే తేల్చుకుంటా అని అంటాడు. అంబిక, సహస్రలతో పాటు లక్ష్మీ, విహారిలు కోర్టుకి వెళ్తారు. 

అంబిక,సహస్రల్ని విహారి గంటలో హియరింగ్ ఉందని చెప్పి అంత వరకు కారులో ఉండమని చెప్తాడు. లక్ష్మీ, విహారిలు విడాకుల కేసు గురించి వెళ్తారు. అంబిక వాళ్లని చూసి వెళ్తుంటే సహస్ర ఆపాలని ప్రయత్నిస్తుంది. ఎంతకీ వినకుండా అంబిక వెళ్తుంది.  లక్ష్మీ, విహారిల కేసుని పర్సనల్‌గా విచారిస్తారని లాయర్ వాళ్లతో చెప్తాడు. ఇక అంబిక చూసి ఫ్యామిలీ కోర్టు వైపు వీళ్లకేంటి పని అని అనుకుంటుంది. లేడీ జడ్జి తన బంటుతో పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు కానీ ఇలా విడదీయాల్సి వస్తుంది వృత్తి ధర్మం తప్పదు కదా అని అనుకొని లక్ష్మీ, విహారిని పిలుస్తారు. 

లక్ష్మీతో ఎందుకు నీ భర్త నుంచి విడిపోయాలి అనుకుంటున్నావ్ అని అడుగుతారు. మా ఇద్దరి బంధం ఓ మోసం వల్ల ఏర్పడింది అని వాళ్ల పెళ్లి  మొత్తం చెప్తుంది. దానికి విహారి తను దూరం అయితే నేను సంతోషంగా ఉంటాను అనుకుంది. కానీ నేను తనతో ఉంటేనే సంతోషంగా ఉంటాను అని చెప్పి సహస్రను తాను పెళ్లి చేసుకోవాలని అందరికీ మాట ఇవ్వడం దగ్గర నుంచి సహస్రని హాస్పిటల్‌ బెడ్ మీద పెళ్లి చేసుకోవడం వరకు మొత్తం చెప్తాడు. రెండు పెళ్లిళ్లు చట్టపరంగా తప్పు కానీ నీ పరిస్థితి తప్పు కాదు అంటుంది. లక్ష్మీ తనకు ఎలా అయినా విడాకులు ఇవ్వమని అంటుంది. నాకు నువ్వు ఇష్టం అని విహారి అంటాడు. లక్ష్మీ విడాకులు కావాలి అంటే విహారి వద్దు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.