Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని చంపాలని ప్రయత్నించిన సుభాష్! మహా, విహారి క్రిష్‌ని కాపాడుకున్నారా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 3rd: క్రిష్‌ని చంపాలని సుభాష్ డాక్టర్‌గా వెళ్లడం మహా చూసి అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(అక్టోబరు 3న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిష్‌కి రక్తం ఇచ్చిన విహారి..
విహారి హాస్పిటల్‌కి వెళ్లడం క్రిష్‌కి ట్రీట్మెంట్ చేయించడం చకచకా జరిగిపోతాయి. బాబుకి బ్లడ్ కావాలని డాక్టర్ చెప్పడంతో మహా ఇస్తా అంటే విహారి వద్దని తాను ఇస్తాడు. మరోవైపు సుభాష్ కూడా క్రిష్‌ని చంపాలని హాస్పిటల్‌కి చేరుకుంటాడు. క్రిష్ గురించి వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఐసీయూ ముందు మహాని చూసి షాక్ అయిపోతాడు. తర్వాత విహారిని కూడా చూసి ఇద్దరూ ఇక్కడే ఉన్నారా.. వీళ్లు ఉంటే బాబుని చంపడం కష్టం అని అనుకుంటాడు. డాక్టర్ వచ్చి విహారి వాళ్లతో బాబు గురించి ఇక టెన్షన్ పడొద్దు బాబుకి ఇక ఏ ప్రాబ్లమ్ లేదు అని అంటారు.
ఇంజక్షన్ మార్చేస్తా..
విహారి మందులు తీసుకురావడానికి వెళ్తాడు. మహా కూడా పక్కకి వెళ్తుంది. ఇంతలో ఒక నర్సు వచ్చి ఓ ఇంజక్షన్ మర్చిపోయా అని మందులు ఇంజక్షన్‌లు అక్కడ పెట్టి మరో వెళ్తుంది. అది చూసిన సుభాష్ ఐసీయోలో వేరే పేషెంట్ ఇంజక్షన్ క్రిష్‌కి వేసేస్తే అది వికటించి క్రిష్ చనిపోతాడు అని అనుకుంటాడు. వెంటనే ముఖానికి మాస్క్ వేసుకొని డాక్టర్‌లా నటిస్తూ క్రిష్ గదిలోకి వెళ్తాడు. సరిగ్గా గదిలోకి వెళ్లే టైంకి మహా వచ్చి ఎవరు మీరు.. మా డాక్టర్‌కి ట్రీట్మెంట్ చేసేది మీరు కాదు కదా అని మహా అడిగితే ఆ డాక్టర్ వేరే ఎమర్జన్సీ కోసం వెళ్లారు అందుకే నేను వచ్చా అని సుభాష్ అనడంతో మహా సరే అని సుభాష్‌ని పంపిస్తుంది.
మిమల్ని చంపాలి అనుకున్నారు..
సుభాష్ లోపలికి వెళ్లి క్రిష్‌కి ఇంజక్షన్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఇంతలో నర్సు వచ్చి ఆ పేషెంట్ ఇంజక్షన్ ఎక్కడ అని అనుకుంటుంది. అది విన్న మహా ఏంటి ఏమైంది అని అడిగితే రెండో పేషెంట్‌కి ఇవ్వాల్సిన ఇంజక్షన్ కనిపించడం లేదు అని అంటే మహాకి డౌట్ వచ్చి పరుగు క్రిష్ గదికి వెళ్లి సుభాష్ ఇంజక్షన్ వేయకుండా ఆపుతుంది. సుభాష్ మహా మీద కత్తెరతో దాడి చేసి క్రిష్‌కి ఇంజక్షన్ వేయబోతాడు. ఇంతో విహారి వచ్చి సుభాష్‌ని నాలుగు కొడతాడు. ముఖం మీద మాస్క్ తీసే టైం సుభాష్ పారిపోతాడు. పిల్లాడిని చంపాలి అనుకోవడం ఏంటి., మనకి తెలీకుండా మన వెనక ఇంకేదో జరుగుతుంది అని విహారి అంటాడు. ఇక డాక్టర్ వచ్చి క్రిష్‌కి మెలకువ వచ్చిందని అంటాడు.
మిమల్ని చంపాలి అనుకున్నారు..
మహా, విహారి క్రిష్ దగ్గరకు వెళ్తారు. క్రిష్‌తో ఇంటి నుంచి ఎందుకు వచ్చేశావ్ అంటే క్రిష్ విషయం చెప్తాడు. తర్వాత క్రిష్ కొంత మంది మిమల్ని చంపాలి అని రోడ్డు మీద మాట్లాడుకున్నారు అది వినడంతో నన్ను చంపాలని ఫాలో అయి గుద్దేశారు అని చెప్తారు. ఆ రౌడీలను గుర్తు పడతావా అని మహా అడిగితే గుర్తు పడతా అని మహా అంటుంది. ఇక క్రిష్‌ని రేపు ఇంటికి తీసుకెళ్లమని డాక్టర్ చెప్తారు. విహారి మనసులో అంతా ఏదో జరుగుతుంది. ముందు ఆ పేషెంట్‌ని బతికించాలని అనుకుంటాడు. ఇక సుభాష్ అంబికను కలిసి క్రిష్‌ని చంపలేకపోయా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు






















