Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి రాత్రి ఆరుబయట తిరుగుతూ కలలో కూడా లక్ష్మీకి అన్యాయం చేయను అని విహారి అనుకుంటాడు. నేనే తప్పు చేయలేదు అని నిరూపించడం ఎలా.. అసలు కనకానికి ఈ విషయం తెలిసి ఏం అనుకుంటుంది. తనని ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటాడు. ఇంతలో లక్ష్మీ బయటకు వస్తుంది.
విహారి లక్ష్మీని చూస్తాడు. దగ్గరకు వెళ్లి మాట్లాడలేక వెళ్లితుంటే లక్ష్మీ పిలిచి విహారి గారు మీరు ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు.. ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని అంటుంది. తప్పు చేశానని మీరు బాధ పడుతున్నారేమో దీని వల్ల నాకు అన్యాయం జరిగింది అని మీరు బాధ పడుతున్నారేమో అలాంటిదేమీ పెట్టుకోవద్దు.. జరిగింది మీ మంచికే.. సహస్రమ్మ మీరు కలిసిపోవడం నాకు ఇష్టమే.. అని అంటుంది.
విహారి లక్ష్మీతో నేను తప్పు చేశానని అనుకోవడం లేదు లక్ష్మీ అంటే మీరు తప్పు చేశారు అని ఎవరూ అనుకోవడం లేదు.. ఇది మీ జీవితానికి కొత్త అడుగు.. ఇక నుంచి సహస్రమ్మతో సంతోషంగా ఉండండి అని అంటుంది. లక్ష్మీ గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని ఏడుస్తుంది. ఇన్ని రోజులు ఏది జరగాలో అది జరిగింది. సహస్రమ్మ విహారి గారు ఇకపై సంతోషంగా ఉండాలి.. బహుశా ఆ సంతోషం నేను చూడకూడదు అనేనేమో ఆ దేవుడు నాకు చూపు లేకుండా చేశాడు అని అనుకుంటుంది. నా బాధ విహారి గారికి తెలీకూడదు అని అనుకుంటుంది.
అంబిక ఆఫీస్‌కి కాల్ చేసి పెండింగ్ ఫైల్స్ తీసుకురమ్మని ఓ దివ్యకి చెప్తుంది. పద్మాక్షి కిందకి వస్తున్న లక్ష్మీని నీ అడ్డు పోయింది అని అనుకున్నా కానీ కళ్లు పోయావి అని మళ్లీ వచ్చావ్ నీ కళ్లు కాదే నువ్వే పోతే నా కూతురి కాపురం బాగుంటుంది అని అనుకుంటుంది. లక్ష్మీ కాళ్లకి అడ్డంగా పూసలు పడేస్తుంది. దాంతో మెట్ల మీద నుంచి వస్తున్న లక్ష్మీ కాలు జారి కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే విహారి వచ్చి లక్ష్మీని పట్టుకుంటాడు.
అంబిక వచ్చి సమయానికి వచ్చి లక్ష్మీని కాపాడావు విహారి లేదంటే ప్రమాదం జరిగేది అని అంటుంది. లక్ష్మీ నీ పక్కన ఎవరూ లేకుండా ఇలా రావడం ఏంటి ఎవరో ఒక్కర్ని పిలు నీఅంత నువ్వు రావొద్దు అని అంటుంది. దాహం వేసి వచ్చాను సారీ అమ్మా ఇక నుంచి ఇలా చేయను అని లక్ష్మీ అంటుంది. అదే నీకు మాకు మంచిది అని అంబిక అంటుంది. చాటుగా మాటలు విన్న పద్మాక్షి అంబిక మాటలకు షాక్ అయిపోతుంది.
అంబిక దగ్గరకు ఫైల్స్ తీసుకొని ఆఫీస్ నుంచి దివ్య వస్తుంది. అంబిక వాటిని చెక్ చేసి వాటిలో 200 ఎకరాలు రాయించుకునే పేపర్లు పెట్టి లక్ష్మీ సంతకం పెట్టించమని అంటుంది. లక్ష్మీ దగ్గరకు దివ్య వెళ్తుంది. లక్ష్మీ దివ్యతో విషయం తెలుసుకొని ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు అక్కడ పెడతా అంటుంది. దివ్య లక్ష్మీతో సంతకాలు పెట్టిస్తుంది. ఇంతలో విహారి వచ్చి ఆపుతాడు. పెండింగ్ ఫైల్స్ మీద సంతకం పెడుతున్నా అని లక్ష్మీ అంటే చూపులేని నువ్వు సంతకం పెడితే ఆ ఫైల్స్ లీగల్‌గా చెల్లవు.. నేనే సంతకాలు పెడతా అని విహారి సంతకం పెడతాడు. విహారి అన్నీ సంతకాలు పెట్టేస్తాడు. చిన్న ఫైల్ కూడా చూడకుండా సంతకం పెట్టని విహారి ఇంత ఫైల్ కనీసం చెక్ చేయకుండా సంతకం పెట్టాడు అంటే ఏదో డిస్ట్రబెన్స్‌లో ఉన్నాడు. దీన్ని అడ్డు పెట్టుకొని విహారిని బిజినెస్ నుంచి తప్పించాలని అనుకుంటుంది. వెంటనే ఆఫీస్‌కి కాల్ చేసి మనం రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వమని చెప్తుంది.
పద్మాక్షి డాక్టర్ దగ్గరకు వెళ్లి సహస్ర గర్భసంచి తీసేశారని చెప్తుంది. నా కూతురు అల్లుడికి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా అని అంటుంది.దాంతో డాక్టర్ మీ కూతురు అల్లుడు ఇద్దరినీ హాస్పిటల్‌కి తీసుకురమ్మని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.