Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమునని కాపాడుకోవడానికి విహారి కొండ మీద ఉన్న గుడికి బయల్దేరుతాడు. లక్ష్మీ కూడా అడవిలోకి వెళ్తుంది. లక్ష్మీ వచ్చిన విషయం విహారికి తెలీదు. లక్ష్మీ విహారిని చూసి పిలిచిన టైంకి లక్ష్మీని కొందరు కిడ్నాప్ చేస్తారు.
విహారి కొండ మీద శివలింగం కోసం వెతుకుతూ ఉంటాడు. సూర్యస్తమయం లోపు శివలింగం దగ్గర దీపం వెలిగించి నాగాంభరం మొక్క కనుక్కోవాలి అమ్మ ప్రాణాలు దక్కించుకోవాలని అనుకుంటాడు. ఓ చోట విహారికి కాగడా కనిపించడంతో రాళ్లతో నిప్పు పుట్టించి ఆ కాగడాని తీసుకొని అడవిలో వెళ్తాడు. మరోవైపు చీకటి కావడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. విహారి నిప్పు వెలిగించుకొని వెళ్తాడు.
విహారి ఇంకా రాలేదని సహస్ర టెన్షన్ పడుతుంది. అక్కడున్న ఆడవాళ్లు మీ అల్లుడు ఇంకా రాలేదు ఏమైనా అయిందా అని అంటారు. మా బావకి ఏం కాదు కచ్చితంగా వస్తారు అని అంటుంది సహస్ర. ఇక అందరూ సహస్రతో పెళ్లి అయి సంవత్సరం అయింది కదా ఇంకా పిల్లలు పుట్టలేదా.. పెళ్లయిన ఏడాదిలో పిల్లలు పుట్టకపోతే ఇక పుట్టరు.. పుల్లలు పుట్టి ఉంటే నీ వెనకే తిరిగేవాడు.. నీ భర్త నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాలి అంటే నీకు పిల్లలు పుట్టాలి.. రేపు ఉదయమే సంతానవ్రతం చేయ్ పిల్లలు పుడతారు అని అంటుంది. సహస్ర సంతోషంగా నేను ఆ పూజ చేస్తా అని అంటుంది. పద్మాక్షి మనసులో చాలా బాధ పడుతుంది.
విహారి శివలింగం కనిపెట్టేస్తాడు. శివలింగాన్ని మొక్కుకుంటాడు. దాంతో అఖండ దీపం వెలుగుతుంది. అందరూ కొండ మీద అఖండ దీపం వెలగడం చూసి దండం పెట్టుకుంటారు. విహారి నాగాంబరి మొక్క కోసం మొక్కుకోగానే ఓ చోట వెలుగులతో మొక్క కనిపిస్తుంది. విహారి దాన్ని తీసుకొని తల్లిని బతికించుకోవడానికి బయల్దేరుతాడు. సూర్యాస్తమయంలో విహారి కొండ దిగి రావాలని అప్పుడే యమున బతుకుతుందని పోచమ్మ చెప్తుంది. అందరూ టెన్షన్ పడుతుంటారు.
విహారి ఇక తిరిగిరాడు ఇప్పటి వరకు వెళ్లిన వాళ్లు రాలేదని విహారి కూడా తిరిగి రాడని వీర్రాజు అంటాడు. ఇక్కడ తల్లి పోతుంది అక్కడ కొడుకు పోతాడని వీర్రాజు అంటాడు. పద్మాక్షి వీర్రాజు మీద కోప్పడతుంది. సహస్ర టెన్షన్ పడితే పద్మాక్షి ఏం కాదని చెప్తుంది. ఇంతలో విహారి నాగాంబరి ఆకులు తీసుకొస్తాడు. పోచమ్మ వాటి పసరు చేసి యమునకు వైద్యం చేస్తుంది. దాంతో యమనకు నయం అయిపోతుంది. లేచి కూర్చొంటుంది. అందరూ చాలా సంతోషపడతారు. విహారి తల్లిని పట్టుకొని ఏడుస్తాడు. విహారి ప్రాణాలకు తెగించి కాపాడాడని వసుధ చెప్తుంది. పోచమ్మ వల్లే అంతా అని విహారి చెప్పడంతో యమున పోచమ్మకి దండం పెడుతుంది. ఇక యమున లక్ష్మీ గురించి అడుగుతుంది. మొత్తం చూస్తే లక్ష్మీ కనిపించదు.. పండు విహారితో లక్ష్మీ కూడా అడవికే వచ్చిందని అంటాడు. విహారి ఆలోచనలో పడతాడు. మీ వీరనారి ఏమైంది అని వీర్రాజు అడుగుతాడు. అందరూ లక్ష్మీ కోసం టెన్షన్ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.