Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఊరి ప్రజల అందరి పొలాలు లీజుకు తీసుకుంటానని చెప్తాడు. ఎవరి పొలాలు వాళ్ల దగ్గరే ఉంటాయి.. సేంద్రీయ వ్యవసాయం చేస్తామని మేమే మార్కెటింగ్ చేస్తామని.. పెట్టుబడి మాదే.. లాభనష్టాలతో కూడా మీకు ఏం సంబంధం లేదు.. నెలనెలా జీవితం ఇస్తాం.. సంవత్సరానికి లీజు డబ్బులు ఇస్తాం అని లక్ష్మీ, విహారి ఊరి వాళ్లకి బంపర్ ఆఫర్ ఇస్తారు. అంబిక, వీర్రాజుల ముఖం మాడిపోతుంది. 

Continues below advertisement

వీర్రాజు విహారితో మమల్ని మా పిల్లల్ని వాళ్ల పిల్లల్ని నువ్వు కష్టపడమంటావ్.. మా కష్టాన్ని నువ్వు దోచుకుంటావ్ అని అడుగుతాడు. విహారి మనల్ని నమ్మించి మోసం చేస్తాడని తర్వాత ఫ్యాక్టరీ వాళ్లు వెళ్లిపోతారని వచ్చి సంతకాలు పెట్టమని వీర్రాజు అంటాడు. కానీ ఊరి వారు మొత్తం విహారి వాళ్లని నమ్మి పొలాలు లీజుకి ఇస్తామని అంటాడు. ఇక విహారి మేనేజర్ మూర్తి అందరి దగ్గర సంతకాలు తీసుకొని డబ్బులు ఇస్తాడు. పార్థసారథి తాను తెచ్చిన డబ్బు తీసుకొని వెళ్లిపోతాడు.

పార్థసారథి అంబికను కలిసి ఏంటి ఇదంతా మీరు ఫెయిల్ అయిపోయారని అంటాడు. అప్పుడే అయిపోలేదు అని అంబిక అంటే నా పార్టనర్‌గా మీరు ఫెయిల్ అవ్వొద్దని అంటాడు. విహారి, లక్ష్మీలను ఏం చేయాలో నాకు తెలుసు అని మైనింగ్‌కి పర్మిషన్ తెచ్చుకోండి ఇక్కడ నేను అంతా సెట్ చేస్తా అని అంబిక అంటుంది. అంబిక ఇంటికి వెళ్లి విహారిని పిలుస్తుంది. విహారి నువ్వేం చేస్తున్నావ్.. నీకు నచ్చినట్లు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఇంక మేం ఎందుకు.. ఈ బిజినెస్‌ని ఇంత డెవలప్ చేసిన నాకు విలువ ఏంటి అని అంబిక అడుగుతుంది. నాకు కూడా చెప్పలేదు అని పద్మాక్షి అంటే మీరు నా మాట కాదు అనరు అని చెప్పా అని విహారి అంటాడు.

Continues below advertisement

అంబిక విహారితో వ్యవసాయం మీద ఖర్చు చేస్తే మనకు లాభాలు రావు అని అంటాడు. ఇక్కడ బిజినెస్ చేస్తే అక్కడ బిజినెస్‌లు ఏంటి అని అంబిక అడుగుతుంది. అక్కడ బిజినెస్‌లు చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా అమ్మ అని లక్ష్మీ అంటుంది. మీరు అక్కడ చూసుకుంటే మేం ఇక్కడ చూసుకుంటాం అని విహారి అంటాడు. దాంతో మనం ఇక్కడే ఉండిపోతామా అని సహస్ర అడుగుతుంది. ఏంటి విహారి నా కూతుర్ని ఇక్కడే ఉంచేయాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది పద్మాక్షి. వ్యవసాయం కష్టమే కానీ ఆర్గానిక్ వ్యవసాయం లాభమే అని అంటాడు. భక్తవత్సలం ఐడియా సూపర్ అంటాడు. విహారి ఐడియా నచ్చిన సహస్ర తన సపోర్ట్ బావకే అంటుంది. 

యమున బయట ఉన్న లక్ష్మీ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని ఏడుస్తుంది. నన్ను కాపాడటం కోసం నీ ఆశయాన్ని వదిలేయాలి అనుకున్నావా అని అడుగుతుంది. అమ్మ మీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు అమ్మా.. నా కంటూ అండగా ఉన్నది మీరే కదా అని అంటుంది. నేను అండగా మాత్రమే ఉన్నాను నువ్వు మాత్రం ఈ కుటుంబానికి అండగా ఉన్నావని అంటుంది యమున. యమున లక్ష్మీతో నన్ను కిడ్నాప్ చేసింది.. నిన్ను బెదిరించింది ఆ ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్న వాళ్లే కదా అని అంటుంది. అయ్యుండొచ్చు అమ్మా అని లక్ష్మీ అంటుంది. యమున  లక్ష్మీ జీవితం బాగుండాలని అనుకుంటుంది. 

వీర్రాజు తల మీద టవల్ వేసుకొని బాధ పడుతూ ఉంటాడు. పానకాలు వీర్రాజుని ఉడికించడానికి అనుకున్నదొకటి అయినది ఒకటి అని పాట పాడుతాడు. వీర్రాజు పానకాలుకి ఒక్కటిచ్చి ఈ వీర్రాజుని తక్కువ అంచనా వేస్తున్నావ్‌రా.. అని అంటాడు. విహారికి పంట వ్యవసాయం తెలీదు కదా.. వాడి పక్కన ఎమ్మెస్సీ వ్యవసాయం చదివిన నా కొడుకుని రంగంలోకి దింపుతా అని కొడుకు అమ్మిరాజుకి కాల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.