Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి మందు బాటిల్ విసిరేసి క్షణికావేశంలో జరిగిన తప్పునకు అందరూ నన్ను నిందిస్తున్నారు. నేను తప్పు చేయలేదు అని అందర్ని ఎలా నమ్మించాలి అని అనుకుంటాడు. పండు విహారి దగ్గరకు వచ్చి మీతో ఒక మాట చెప్పాలి అని అంటాడు.
పండు విహారితో టెండర్ ఆఫీస్ దగ్గరే కాదు బాబు దారిలో కూడా లక్ష్మీమ్మ మీద దాడి చేశారు అని జరిగింది అంతా చెప్తాడు. విహారి షాక్ అయిపోతాడు. మన వెనక మనకు తెలీకుండా చాలా జరుగుతుందిరా అది మనం తెలుసుకోవాలిరా అని అంటాడు. ఈ సమస్యల నుంచి బయట పడి లక్ష్మీని సంతోషంగా ఉంచాలిరా అని పండుతో విహారి చెప్తాడు.
లక్ష్మీ ఓ వైపు బాధ పడుతూ ఉంటే విహారి మరోవైపు బాధ పడుతూ ఉంటాడు. ఇక విహారి లక్ష్మీ కోసం తన గదికి వెళ్తాడు. లక్ష్మీ కనిపించకపోవడంతో బాల్కానీలో చూస్తాడు. అక్కడ లక్ష్మీ ఓ మూల కూర్చొని మోకాల్లో తల పెట్టుకొని పడుకొని ఉంటుంది. విహారి లక్ష్మీని ఎత్తుకొని తీసుకెళ్లి పడుకోపెడతాడు. ఇక లక్ష్మీ చేతికి గాయం చూసి మందు పెడతాడు. నా కోసం నువ్వు ఏమైనా చేస్తావ్ ప్రాణం ఇవ్వడానికి అయినా రెడీ అయిపోతావ్.. కానీ నేను నీకు ఏం చేశాను లక్ష్మీ.. నా వల్ల నువ్వు ఒక్క పూట కూడా సంతోషంగా లేవు అని అనుకుంటాడు.
లక్ష్మీ దగ్గర విహారి ఉండటం సహస్ర చూస్తుంది. విహారి లక్ష్మీని చూసి బాధపడటం లక్ష్మీతో మాట్లాడుకోవడం సహస్ర వింటుంది. నీకు సారీ చెప్పాలి అని నేను నీ దగ్గరకు వచ్చిన ప్రతీసారి నన్ను దూరం పెడుతున్నావ్.. నా మనసులో మాట నీకు చెప్పాలి అని ఇంతకు ముందు చాలా సార్లు అనుకున్నా నీకు చెప్పలేకపోయా.. ఇప్పుడు నీకు ఆ మాట చెప్పాలి అంటే నాకే ఏదోలా ఉంది అని బాధ పడతాడు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్లిపోతే నేను ఉండలేను కనకం అని కన్నీరు పెట్టుకుంటాడు. సహస్ర చూసి చాలా ఫీలవుతుంది.
సహస్ర మనసులో బావ నువ్వు ఆ లక్ష్మీ కోసం ఎంత బాధ పడినా ఎంత ఆరాట పడినా చివరకు నువ్వు నాతో ఉండాల్సిందే.. ఎందుకంటే మొన్న నేను వేసిన ప్లాన్తో నువ్వు దాదాపు నా వాడికి అయిపోయినట్లే ఇక నిన్ను ఆ లక్ష్మీని దూరం చేస్తా అని అనుకుంటుంది. విహారి గదిలోకి వచ్చే సరికి సహస్ర పడుకొని ఉంటుంది. విహారి సహస్రని చూసి మొన్న జరిగిన దాని నుంచే నేను ఇంకా తేరుకోలేకపోతున్నా అని బయట హాల్లోకి వెళ్లి పడుకుంటాడు. సహస్ర లేచి నువ్వు రావు బావ అది నాకు తెలుసు.. ఇంట్లో అందరూ మనం ఒకటి అయ్యాం అని అనుకుంటున్నారు. చిన్నగా నిన్ను నా వైపు తిప్పుకుంటా అని అనుకుంటుంది.
కావేరి తల్లి ఫోటో చూస్తూ ఏడుస్తూ అమ్మా ఎక్కడున్నావ్.. నీ కోసం వెతుకుతున్నాం అని చెప్తున్నారు.. కానీ వెతికించడం లేదని నాకు తెలుసు.. రెండు రోజుల్లో అమ్మిరాజుతో నా పెళ్లి చేస్తారంట నువ్వు ఉంటే చేయనిచ్చేదానివి కాదు.. అందుకే రామ్మా అని ఏడుస్తుంది. కావేరి తల్లి కూడా ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. ఎవరు మనల్ని ఈ సమస్య నుంచి బయట పడేస్తారు.. అని ఏడుస్తుంది.
కావేరి తల్లి రుక్మిణిని బంధించిన గది పక్కనే అమ్మిరాజు, ఓ ముసలాయన, ఇంకొంత మంది మందు తాగుతూ ఉంటారు. ఆ ముసలాయన అమ్మిరాజుతో ఓరేయ్ అమ్మిరాజు ఆ హరికృష్ణ మనం దాచిన రుక్మిణిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి వెళ్లిపోయాడు.. పాపం ఆ రుక్మిణిని అన్యాయం చేసి వెళ్లిపోయాడు.. అది పక్కన పెడితే ఈ రుక్మిణి కూతుర్ని నువ్వు ఏడిపిస్తున్నావ్ అని అదే హరికృష్ణ కొడుకు నిన్ను చితక్కొట్టేశాడురా అని అంటారు. ఆ మాటలు రుక్మిణి వింటుంది. ఆ రుక్మిణిని ఆస్తి కోసం బంధించావ్ అని ముసలాయన అంటే అమ్మిరాజు ముసలాయన్ని కొడతాడు. రెండు రోజులు ఏంట్రా నాకు టైం కావాలి ఇప్పుడే వెళ్లి కావేరిని సొంతం చేసుకుంటా అని పరుగులు తీస్తాడు.
రుక్మిణి ఆలోచిస్తూ హరికృష్ణ నన్ను మోసం చేసి వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడని హరికృష్ణ చావు గురించి నేను ఎవరికీ చెప్పలేదు. కానీ నా కూతుర్ని అతని కొడుకు కాపాడాడు అంటే హరికృష్ణ చావు గురించి బయట పెట్టాలి అనుకుంటుంది.
అమ్మిరాజు తాగుతూ కావేరి దగ్గరకు వెళ్లి దగ్గరకు రమ్మని పిలుస్తాడు. వద్దని కావేరి బతిమాలుతుంది. కావేరి అమ్మిరాజుని పొడిచేస్తా అని గాజు పెంకు తీస్తుంది. ఇంతలో వీర్రాజు వచ్చి అమ్మిరాజుని ఆపి నా కొడుకుని చంపాలి అని చూస్తావా ఇక నీ పని చెప్తా మీ అమ్మని మరి వెతికించను అని అమ్మిరాజుని తీసుకెళ్తాడు. రెండు రోజులు ఆగితే దానితో నీ పెళ్లి అయి ఆస్తి మొత్తం నీకు వస్తుందని అంటాడు. ఇంతలో అంబిక బ్యాగ్తో వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.