Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీతో మాట్లాడుతుంది. రేపే తెల్లారితే వ్రతం పూర్తయిపోతుందని లక్ష్మీ చెప్తుంది. దానికి విహారి రేపు తెల్లారితే నీ వ్రతం పూర్తవుతుందని నాకు సహస్రకు పెళ్లి పనులు మొదలవుతాయి. మొన్నే నీకు నాకు పెళ్లి అయిందని నిజం చెప్పాలి అనుకున్నా కానీ మాట్లాడనివ్వకుండా మా అమ్మ మీద ఒట్టేసి నా నోరు కట్టేశారు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు.
లక్ష్మీ: మీరు ఇబ్బంది పడకూడదు అనే ఈ వ్రతం చేశాను. నా గురించి వదిలేయండి సహస్రమ్మని పెళ్లి చేసుకోండి. విహారి: సహస్ర మెడలో తాళి కడితే మీ పరిస్థితి ఏంటి?లక్ష్మీ: నా గురించి ఆలోచించకండి నాకు ఈ వరం చాలు మిమల్ని భర్తగా ఆరాధించుకుంటూ ఉండిపోతాడు. మీరు దైవ నిర్ణయం ప్రకారం నడుచుకోండి. ఇంకేం మాట్లాడొద్దు విహారి గారు నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వకండి.సహస్ర: లక్ష్మీ, బావ ఇద్దరూ కనిపించడం లేదు అంటే ఇద్దరూ ఎక్కడికి వెళ్లుంటారు. బావ ఇక్కడున్నావా. ఫోన్ మాట్లాడుతున్నట్లు విహారి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. లక్ష్మీ దాక్కుంటుంది. సహస్ర లక్ష్మీ కోసం మొత్తం వెతుకుతుంది. లక్ష్మీ నువ్వు ఇక్కడున్నావా. లక్ష్మీ: ఆరిన బట్టలు తీయడానికి వచ్చానమ్మా..సహస్ర: అవునా సరే సరే.విహారి: పద సహస్ర వెళ్దాం.
యమున పెళ్లికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. అన్నీ పక్కన పెట్టుకుంటుంది. వసుధ వచ్చి వదిన మీరు పెళ్లి హడావుడిలో మందులు వేసుకోవడం లేదని మందులు ఇస్తుంది. యమున వేసుకుంటుంది. ఇద్దరూ లక్ష్మీ గురించి మాట్లాడుకుంటారు. ఏంటో పిచ్చి పిల్ల వదిలేసిన భర్త కోసం చాలా కష్టపడుతుందని యమున అంటుంది. రేపు పెళ్లి సక్రమంగా జరిగిపోతే వదిన వాళ్లు లక్ష్మీని ఏం అనరు అని యమున అంటుంది. దానికి వసుధ మనసులో అప్పుడే అసలైన గొడవలు మొదలవుతాయి. ఇప్పటి వరకు జరిగినవన్నీ అసలు గొడవలే కాదు అనుకుంటుంది.
లక్ష్మీ రాత్రి అమ్మవారికి పూజ చేస్తుంది. పండు, వసుధ, యమున, విహారి అక్కడ ఉంటారు. అందరికీ ప్రసాదం ఇచ్చిన తర్వాత లక్ష్మీ నేల మీద ప్రసాదం వేసుకొని తింటుంది. తర్వాత లక్ష్మీ యమున దగ్గరకు వెళ్తే యమున నీ వ్రతం సఫలం అయి నీ భర్త దగ్గరకు నువ్వు వెళ్తే బాగుంటుందని అంటుంది. లక్ష్మీ ఆరుబయటే పడుకోవాలని పంతులు చెప్పడంతో యమున, వసుధలు జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతారు. లక్ష్మీ జాగ్రత్త అని విహారి పండుతో చెప్తాడు. ఇక పద్మాక్షి, అంబికలు సహస్ర పెళ్లి మేకప్ గురించి మాట్లాడుకుంటారు.
సహస్ర మాత్రం లక్ష్మీ కోసం కలవరిస్తూ ఉంటుంది. వద్దు లక్ష్మీ వద్దు అని నిద్రలో ఏడుస్తుంది. సహస్రను పద్మాక్షి, అంబికలు నిద్రలేపుతారు. పీడకల అని నిద్రలో కూడా ఇబ్బంది పెడుతుందని సహస్ర అంటుంది. లక్ష్మీని ఎలా ఆపాలి అని అనుకుంటారు. అది ఇంట్లో ఉండగా దాన్ని ఆపలేమని అంబిక అంటే దాని ప్రాణం ఆపేద్దామని పద్మాక్షి అంటుంది. దాన్ని ప్రాణం తీసే బాధ్యత నాది అని అంబిక అంటుంది.
విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తుంటాడు. పద్మాక్షి విహారి దగ్గరకు వచ్చి రేపే మీ పెళ్లి కచ్చితంగా జరగాలి అంటుంది. దానికి యమున వచ్చి అనుకున్న ముహూర్తానికి పెళ్లి సక్రమంగా జరగాలి అంటుంది. విహారి కూడా జరుగుతుందని అని అంటాడు. పెళ్లి నార్మల్‌గా చేసి రిసెప్షన్ గ్రాండ్‌గా జరగాలి అనుకుంటారు. ఇక అంబిక సహస్ర, పద్మాక్షిల ఎదురుగానే పాముల వాడికి కాల్ చేసి లక్ష్మీ బయట పడుకొని ఉంది ఎలా అయినా చనిపోవాలి అంటుంది. లక్ష్మీ దేవుడికి దండం పెట్టి నేల మీద పడుకుంటుంది. విహారి లక్ష్మీని చూసి బాధ పడతాడు. లక్ష్మీ కోసం తాను కూడా నేల మీద పడుకుంటా అని నేల మీద పడుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!