Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పాపని చూసి లక్ష్మీ బిడ్డ అని అనుమానపడ్డ సహస్ర! కొడుకుని తీసుకొని పారిపోతున్న లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 25th: లక్ష్మీని చంపేయమని రౌడీని పద్మాక్షి పురమాయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. విహారి లక్ష్మీ వాళ్ల దగ్గరకు వెళ్లి లక్ష్మీని చూడకుండా బాబుని ముద్దాడి మెడలో గొలుసు బాబుకి వేయడం.. పద్మాక్షి లక్ష్మీ వాళ్లని చంపేయమని రౌడీలతో చెప్పడంతో తదితర ఆసక్తికర సీన్స్‌తో సీరియల్ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది.. ఈ రోజు(మే 25న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరిగాయో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ అడ్డు తొలగించుకోవాలి..
విహారి లక్ష్మీ వాళ్ల దగ్గరకు వెళ్లి బిడ్డని ముద్దాడి.. బాబు మెడలో గెలుసు వేస్తాడు. విహారి ఆ గది నుంచి వస్తే పద్మాక్షి చూసి విహారి లక్ష్మీని చూసేశాడా అని టెన్షన్ పడుతుంది. విహారిని ఆపి ఆవిడను చూశావా అని అంటే లేదు అని విహారి అంటాడు. విహారిని సహస్ర వాళ్లకి పంపేసి.. లక్ష్మీ బిడ్డని సహస్ర దగ్గరకు తెచ్చాను అని విషయం వీళ్లకి తెలీదు. భవిష్యత్‌లో తెలిసినా విహారి డీఎన్ఏ ఆ పాపతో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఏ ప్రమాదం ఉండదు.. ఇక నా కూతురి కాపురానికి ఉన్న ఒకే ఒక్క అడ్డు ఆ లక్ష్మీ. దాన్ని అడ్డు తొలగించుకుంటే ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదు అని అనుకుంటుంది.
ALSO READ: Nindu Manasulu Serial Today May 23rd: నిండు మనసులు: మంజుల ఫైనాన్స్ కంపెనీలో భారీ మోసం.. విజయానంద్ మోసాన్ని సిద్ధూ, ప్రేరణ బయట పెట్టగలరా!
బాబుని తీసుకొని వెళ్లిపోతా..
లక్ష్మీ బాబుతో నిన్ను సరైన టైంలో ఆ ఇంటికి వారసుడిగా పంపిస్తాను.. అప్పటి వరకు మనం ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం అని అంటుంది. ఇంతలో బామ్మ రావడంతో నేను బిడ్డ ఇక్కడ ఉండమని అంటుంది. అదేంటి సిరి నన్ను వదిలేసి వెళ్లిపోతా అంటున్నావా అని బామ్మ బాధ పడుతుంది. నాకు నువ్వే మనవరాలివి.. వీడే ముని మనవడు.. మీరు తప్ప నాకు ఎవరూ లేరమ్మా.. చావు అయినా బతుకునా మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను అని బామ్మ అంటుంది. లక్ష్మీ ఎంత చెప్పాలి అనుకున్నా బామ్మ వినదు.. బిల్ కట్టేసి ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటుంది. దాంతో లక్ష్మీ సరే అని అంటుంది. ఇక బామ్మ లక్ష్మీ కోసం చెప్పులు.. తలకి గుడ్డ తీసుకొని వస్తుంది. ఇద్దరూ బయటకు వెళ్తారు.
లక్ష్మీని వెంటనే చంపేయ్..
పద్మాక్షి రౌడీకి ఫోన్ చేసి హాస్పిటల్‌కి రమ్మని పిలుస్తుంది. లక్ష్మీ ఏ గదిలో ఉందో చెప్పి వెంటనే లక్ష్మీని చంపేయమని అంటుంది. లక్ష్మీతో నాకు పని అయిపోయిందని పద్మాక్షి అంటుంది. ఇక లక్ష్మీ బాబుని బామ్మని తీసుకొని బయటకు వస్తుంది. బామ్మ బాబుని పట్టుకుంటే లక్ష్మీ లగేజ్ పట్టుకుంటుంది. ఇద్దరూ బయటకు వెళ్తారు. రౌడీ లక్ష్మీ వాళ్లని బయట చూస్తాడు. లక్ష్మీ కూడా రౌడీని చూసి వెంట పరుగులు పెడతాడు.
Also Read: 'గోదావరి' సీరియల్: శంకర్ ఇంట్లో లవ్ లెటర్ గొడవ! మురళీ బాధ పడటానికి కారణమేంటి?
బాబుని బామ్మకి ఇచ్చేసిన లక్ష్మీ..
లక్ష్మీ బామ్మని తీసుకొని స్పీడ్‌గా వెళ్తుంది. బామ్మని బాబుని ఓ షాఫ్ వెనక దాక్కొమని అంటుంది. నువ్వు ఎక్కువ పరుగెత్తలేవు బామ్మ నేను వాడి దారి మళ్లించి వస్తా.. నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్లకు అని అంటుంది. లక్ష్మీ రౌడీ చూసేలా పరుగులు పెడుతుంది. బామ్మ బాబుని పట్టుకొని అక్కడే ఉంటుంది. లక్ష్మీ చాలా దూరం పరుగెత్తి ఓ బ్రిడ్జి దగ్గర పెద్ద రాయి విసిరి గట్టిగా అరుస్తుంది. తర్వాత దాక్కుంటుంది. లక్ష్మీ నీటిలో మునిగి చనిపోయిందని రౌడీ అనుకుంటాడు. వెంటనే పద్మాక్షికి కాల్ చేసి లక్ష్మీ చనిపోయిందని అంటాడు. పద్మాక్షి చాలా హ్యాపీ అయిపోతుంది. లక్ష్మీ తర్వాత బయటకు వచ్చి బామ్మని బాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
పాపతో ఇంటికి వచ్చేసిన సహస్ర..
సహస్ర పాపని ఎత్తుకోమని విహారికి ఇస్తుంది. విహారి యమునని తీసుకోమని అంటాడు. బావ నేను నీకే ఇస్తున్నా అత్తయ్యకు అయితే నేనే చెప్పేదాన్ని కదా అని అంటుంది. అందరూ తీసుకోమని అంటే విహారి పాపని ఎత్తుకుంటాడు. ఇక సహస్రకు కూడా డిశ్చారీ చేసేస్తారు. ఇంటికి వెళ్లగానే పద్మాక్షి సహస్ర, పాప, విహారిలకు హారతి తీస్తుంది. ఇదంతా నాకు ఇష్టం లేదు అత్తయ్యా అని విహారి వెళ్లిపోతాడు. తర్వాత సహస్రకు పద్మాక్షి హారతి తీస్తుంది.
పాపకి లక్ష్మీలా పుట్టుమచ్చ ఏంటి..
సహస్ర పాపని చూసి లక్ష్మీని గుర్తు చేసుకొని ఇద్దరికీ ఒకేలా ఒకే చోట పుట్టు మచ్చ ఉండటం గుర్తు చేసుకుంటుంది. పద్మాక్షి రాగానే అమ్మ ఈ పాప ఎవరి పాప అని అడుగుతుంది. అవన్నీ నీకు ఎందుకు.. అని పద్మాక్షి అంటుంది. అది కాదమ్మా ఈ పాప నాకు ఆ లక్ష్మీలా కనిపిస్తుందని సహస్ర అంటుంది. దానికి పద్మాక్షి షాక్ అయి తిడుతుంది. అది కాదమ్మా లక్ష్మీకి ఉన్నట్లే పాప చెంప మీద పుట్టు మచ్చ ఉందని సహస్ర అంటుంది. దాంతో పద్మాక్షి కవర్ చేస్తుంది. పాపని బాగా చూసుకోమని చెప్పి తనలో తాను సహస్రకు అనుమానం వచ్చింది.. ఇప్పుడు తనకి నిజం తెలిస్తే లక్ష్మీని అసహ్యించుకున్నట్లే ఆ బిడ్డని అసహ్యించుకుంటుంది. అప్పుడు ఇంట్లో అందరికీ అనుమానం వచ్చేస్తుందని పద్మాక్షి అనుకొని ఎప్పటికీ సహస్రకి విషయం తెలీకూడదు అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















