అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తనని కాపాడింది లక్ష్మీనే అని విహారికి తెలిసిపోయిందా! లక్ష్మీ డెలివరీకి ఏర్పాట్లు!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 20th: విహారి కండీషన్ సీరియస్ నుంచి నార్మల్‌కి రావడం విహారి లక్ష్మీనే తనని కాపాడిందని గుర్తించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode | అంబిక హాస్పిటల్‌కి వచ్చి యమున వాళ్లని చూసి ఆ విహారి గాడిని చంపేశాను.. ఇక సహస్రకి మగ బిడ్డ పుడితే వాడిని చంపేస్తే నాకు ఏ అడ్డు ఉండదు అని అనుకుంటుంది. యమున వాళ్లు ఏడ్వడం చూసి విహారి గాడు చచ్చిపోయి ఉంటాడా.. వీళ్ల ఏడుపులు హడావుడి చూస్తుంటే చచ్చిపోయినట్లే ఉన్నాడు.. విహారి చనిపోతే వాడిని తీసుకెళ్లాల్సింది మార్చురీకి కదా.. ఇక్కడ ఉన్నారేంటి చూద్దాం అని యమున దగ్గరకు వెళ్తుంది.

అంబిక అని యమున ఏడుస్తుంది. ఏమైంది వదినా అని అంబిక అడిగితే విహారిని ఎవరో కత్తితో పొడిచేశారు అంట అంబిక అని చారుకేశవ చెప్తాడు. అంబిక ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లి ఆ లేడీ విహారిని పొడిచేసి అంబికకు కాల్ చేసి విహారికి నాలుగు కత్తిపోట్లు పడ్డాయ్,, అని చెప్పిన విషయం గుర్తు చేసుకొని పైకి మాత్రం అలాగా ఇప్పుడు విహారికి ఏం కాలేదు కదా అని అడుగుతుంది. దానికి చారుకేశవ దేవుడి దయ వల్ల ఎవరో అమ్మాయి విహారిని కాపాడి హాస్పిటల్‌లో చేర్పించింది.. విహారి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని చెప్తాడు. అంబిక చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. విహారి కండీషన్ క్రిటికల్‌గానే ఉంది.. చిన్న సర్జరీ చేయాలంట అని చారుకేశవ అంటాడు. ఏ దుర్మార్గులు నా కొడుకు మీద ఇలా చేశారో వాళ్లకి పుట్టగతులు ఉండకూడదు అని యమున అనడంతో నేను సహస్రని చూసి వస్తా వదినా అని అంబిక బయటకు వెళ్తుంది. సుభాష్‌కి కాల్ చేసి విహారిని చంపడానికి మనుషుల్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చావ్.. నీకు వాళ్లకి కలిపి సన్మానం చేస్తా అని అంటుంది. ఏమైంది అని సుభాష్ అడిగితే వాళ్లు సగం పొడిచి వదిలేసి చంపేశాం అని చెప్పారు.. వాడు ఐసీయూలో ఉన్నాడు అని చెప్తుంది. సుభాష్‌ని ఫుల్లుగా తిడుతుంది. సుభాష్‌ని హాస్పిటల్‌కి రమ్మని అంటుంది. 

ALSO READ: కార్తీకదీపం సీరియల్: దీప, జ్యోత్స్నలకు మొదలైన పోటీ! సూరజ్ పట్ల దారుణంగా ప్రవర్తించిన జ్యో! నడిరోడ్డు మీదే అంతా నాశనం!

బామ్మ యమున దగ్గరకు వెళ్లి ఎలా ఉందమ్మా మీ బాబుకి అని అడుగుతుంది. ఇంకా సీరియస్‌గానే ఉందని యమున ఏడుస్తుంది. అక్కడ నా మనవరాలి పరిస్థితి అలాగే ఉంది.. ఏంటో దేవుడు మంచి వాళ్లకే ఇలాంటి పరిస్థితి ఇస్తాడు అని అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి విహారి కండీషన్ క్రిటికల్‌గా ఉందని చెప్పడంతో అంబిక చాలా సంతోషపడుతుంది. తన కొడుకుని కాపాడమని యమున ఏడుస్తుంది. బామ్మ యమునకు ధైర్యం చెప్తుంది. ఇక డాక్టర్ లక్ష్మీని పరీక్షించి తనకి వెంటనే డెలివరీ చేయాలి ఒంటి మీద ఏం ఉండకూడదు మొత్తం తీసేయ్ అని చెప్తుంది. దాంతో నర్సు పూలు, మెట్టెలు, తాళి, రింగ్ ఇలా అన్నీ తీసి బామ్మకి ఇస్తారు. నా మనవరాలు ఈ కాలం పిల్ల అయినా పాత కాలం పద్ధతులు పాటిస్తుంది. తన నుంచి ఏం దూరం చేసినా ఆ తాళి తీయొద్దమ్మా,, తన నుంచి భర్త దూరం అయినా ఈ తాళి తన గుండెల మీదే ఉంచి తృప్తి పడుతుంది. దయచేసి ఈ తాళి తన మెడలోనే ఉంచండి అని చెప్తుంది. దాంతో డాక్టర్ సరే అంటుంది. 

యమున దేవుడి దగ్గరకు వెళ్లి దేవుడా ఉంటి ఈ పరిస్థితి ఒక వైపు మా ఇంటి వారసుడికి గండాలు పెట్టావు.. మరోవైపు నా కొడుకుకి ఈ పరిస్థితి కలిగించావు నా కొడుకుని కాపాడు అని వేడుకుంటుంది. అంబిక విహారిని చూసి అక్కడ తప్పించుకున్నా ఇక్కడ విహారి చస్తాడు.. ఎలా అయితే ఏంటి నాకు  విహారి చావు కావాలి అంతే అని అనుకుంటుంది. మరోవైపు బామ్మతోనే డాక్టర్ లక్ష్మీ మెడలో తాళి వేయిస్తుంది. లక్ష్మీ మెడలో తాళి పడగానే విహారిలో చలనం మొదలవుతుంది. డాక్టర్ చూసి యమున వాళ్లతో మీ అబ్బాయి నార్మల్ కండీషన్ లోకి వచ్చారని అంటాడు. ఇక లక్ష్మీని క్రిటికల్ వార్డుకి మార్చుతారు. విహారిని ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకి మార్చుతారు.

 

ఇద్దరినీ ఒకే టైంలో మార్చడంతో ఒకరి చేయి ఒకరికి తగులుతుంది. మరోవైపు బావకి ఎలా ఉందో అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే పద్మాక్షి వచ్చి ఏం ప్రాబ్లమ్ లేదు అని అంటుంది. సహస్ర తల్లితో అమ్మా ఒక్క సారి ఎవరికీ కనిపించకుండా బావని చూసి వచ్చేస్తా అని అంటే పద్మాక్షి సహస్ర జుట్టు పట్టుకొని లాగి పడేసి ఎక్కడికే వెళ్లేది నోరు మూసుకొని ఉండు అని అంటుంది. ఏంటి అమ్మా  ఇంత కోపం అని సహస్ర అంటే నేను పడే టెన్షన్ నీకు ఏం తెలుసే.. ఆ సరోగసీ మదర్ సరిగా డెలివరీ అవ్వాలి,, ఆ బిడ్డని నీ తీసుకొచ్చి ఇవ్వాలి.. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు.. ఎలా ఏం చేయాలో అని నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు బావని చూస్తా బోడి గుండుని చూస్తా అంటే ఎలానే నువ్వేం మాట్లాడకుండా ఇక్కడే ఉండు అని చెప్పి పద్మాక్షి వెళ్లిపోతుంది. 

మరోవైపు  విహారి జరిగింది అంతా గుర్తు చేసుకొని లక్ష్మీ అని అరిచి లేస్తాడు. నాకు కనకం కనిపించింది అని అనుకొని లేస్తాడు. బయటకు వచ్చే సరికి పండు కుర్చీలో పడుకొని ఉంటాడు. నర్సు విహారిని చూసి సార్ మీరు బయటకు రాకూడదు అని అంటుంది. నేను నా కనకాన్ని చూడాలి అని అంటాడు. కనకం ఎవరు సార్ అని నర్సు అంటే నన్ను కాపాడింది కదా తనే అని అంటాడు. తను క్రిటికల్ వార్డులో ఉందని నర్సు చెప్తుంది. విహారి అటుగా వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today June 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్రేమలో ఇందు – కొత్త ప్లాన్‌ చేసిన రేఖ
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్రేమలో ఇందు – కొత్త ప్లాన్‌ చేసిన రేఖ
Karthika Deepam 2 Serial Today June 13th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి ఐలవ్‌యూ చెప్పిందా! సూరజ్ ఎవర్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు? ఒకే ఇంట్లో 'జ్యోరజ్'
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి ఐలవ్‌యూ చెప్పిందా! సూరజ్ ఎవర్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు? ఒకే ఇంట్లో 'జ్యోరజ్'
Godavari Serial Today June 13th: 'గోదావరి' సీరియల్: జానుతో తిరుగుతున్నావ్ అంట ఏంటి సంగతి! తోట విషయంలో ఏదో తేడా కొడుతుందన్న జాను!
'గోదావరి' సీరియల్: జానుతో తిరుగుతున్నావ్ అంట ఏంటి సంగతి! తోట విషయంలో ఏదో తేడా కొడుతుందన్న జాను!
Nindu Manasulu Serial Today June 13th: నిండు మనసులు: అర్ధరాత్రి.. ఐస్‌క్రీమ్.. పక్కనే లవర్ బాయ్.. అదిరిపోయిందమ్మా ప్రేరణ! అల్లరి మామూలుగా లేదుగా!
నిండు మనసులు: అర్ధరాత్రి.. ఐస్‌క్రీమ్.. పక్కనే లవర్ బాయ్.. అదిరిపోయిందమ్మా ప్రేరణ! అల్లరి మామూలుగా లేదుగా!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో సైబర్ మోసం!వాట్సాప్ కాల్స్ చేసి వసూళ్లు! 
NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Yogi Adityanath Strategy: మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
Wamiqa Gabbi : వామికా గబ్బీ బోల్డ్ లుక్ - పెట్ డాగ్‌తో బాలీవుడ్ బ్యూటీ
వామికా గబ్బీ బోల్డ్ లుక్ - పెట్ డాగ్‌తో బాలీవుడ్ బ్యూటీ
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
MrBeast 500 Million YouTube Subscribers:యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!
యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ క్రియేట్ హిస్టరీ! 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో రికార్డు!
Deva Katta: ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది
ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది
Embed widget