అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today July 8th: తనకొట్టు శకుంతల కాల్చేసిందని తెలుసుకున్న లక్ష్మీ శకుంతలకు వార్నింగ్ ఇచ్చి శకుంతలకు పోటీగా నిల్చొవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది.  ఈ రోజు(జులై 8న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

నాకు పోటీ ఎవరూ లేరు..

శకుంతల షాప్ కాల్చేసిందని లక్ష్మీకి కొడుకు హరికృష్ణ చెప్పడంతో లక్ష్మీ విశ్వరూపంతో రౌడీలను వెతుక్కుంటూ వెళ్లి చితక్కొడుతుంది. పెద్ద కర్ర తీసుకొని రౌడీలను తుక్కు తుక్కు చేస్తుంది. వడ్డీ శకుంతల ఎక్కడ అని అడిగి తెలుసుకొని అక్కడికి బయల్దేరుతుంది. హరికృష్ణ ఎంటర్‌ఫ్రైజస్ దగ్గర శకుంతల టెండర్ వేస్తూ హర్షతో మీ సార్ ఎక్కడరా.. చెప్పు ఆయనకు నాకు పోటీ ఎవరూ రారు.. ఇక్కడ మళ్లీ టెండర్ వేసేది నేనే.. గెలిచేది నేనే అని అంటుంది. ఇంతలో లక్ష్మీ అక్కడికి కత్తి పట్టుకొని అమ్మవారిలా వస్తుంది. 

నిన్ను చంపేస్తా.. నేనే నీకు పోటీ..

లక్ష్మీ కత్తి తీసుకొని రావడం చూసి హర్ష షాక్ అవుతాడు. లక్ష్మీ ఆవేశంగా శకుంతలతో నా హోటల్ తగలబెడతావా.. నిన్ను చంపేస్తా.. అని కత్తి తీసుకొని వెళ్తే హర్ష ఆపుతాడు. దాంతో లక్ష్మీ శకుంతల టెండర్ పేపర్ల దగ్గరకు కత్తి పోట్లు పోడుస్తుంది. ఏంటే ఈ శకుంతలనే చంపడానికి వచ్చావా అని శకుంతల అంటే అవును నిన్ను చంపడానికే వచ్చా.. కానీ ఇక్కడికి వస్తే తెలిసింది.. చంపాల్సింది నిన్ను కాదు.. నీ అహంకారాన్ని దించాలి.. నిన్ను ఎవరూ గెలవలేరు అని అన్న నీ పొగరు దించాలి.. ఇన్ని రోజులు నీకు ఎవరూ పోటీ లేరు అన్నావ్ కదా.. ఇప్పుడు నేను నీకు పోటీగా వస్తా.. నేను నీకు ఎదురుగా నిలబడతా.. అవసరం అయితే నేను నీ మీద తిరగబడతా.. ఇన్ని రోజులు జనాల్లో భయం చూసి విర్రవీగావ్ కదా.. నీ మీద జనాల్లో ఆ భయాన్ని నేను పోగొడతాను అని లక్ష్మీ అంటుంది. నువ్వు చెప్పే అంత తేలిక కదా చేయడం అని శకుంతల అంటే హర్ష మీ క్యాంటీన్ కాంట్రాక్ట్ బరిలో ఈ శకుంతలకు నేను పోటీగా నిలబడతా..  నేనే గెలుస్తా అని ఫాం ఫిల్ చేయమని హర్షకి చెప్పి సంతకం పెడుతుంది. అక్కడున్న అందరూ చప్పట్లు కొడతారు. ఏంటే నీ ధైర్యం అని శకుంతల అంటే నేనే నా ధైర్యం.. నేనే నా పొగరు... ఆ రోజు జంతికలు చకోడిలు అని వదిలేయాల్సింది.. ఆ తర్వాత చిన్న టిఫెన్ సెంటర్ కదా అని వదిలేయాల్సింది.. నా హోటల్‌ని కాల్చి పెద్ద తప్పు చేశావ్.. నన్ను రెచ్చగొట్టి మహాపాపం చేశాను అనేలా చేస్తా.. ఈ సిరితో అనవసరంగా పెట్టుకున్నా అని అనుకునేలా చేస్తా అని ఛాలెంజ్ చేసి వెళ్లిపోతుంది. 

మా అక్క వంటలు సూపర్ సార్..

బయట గొడవ విని విహారి, చారుకేశవ బయటకు వచ్చి ఏమైందని అడుగుతాడు. మా అక్క పోటీకి వచ్చింది సార్.. మా అక్క వంటల టేస్ట్ చూస్తే కచ్చితంగా తనకే కాంట్రాక్ట్‌ ఇస్తారు సార్ అని అంటాడు. పోనీలే ఈ శకుంతలకు ఎవరూ పోటీ లేరు అన్నారు.. మీ అక్కకి ధైర్యం ఎక్కువే అని విహారి అంటాడు. క్రిష్ ఇంటికి వెళ్లి బామ్మకి జరిగింది చెప్తాడు. బామ్మ  భయపడుతూ ఆ శకుంతలతో పెట్టుకోకపోవడమే మంచిది అంటే లేదు బామ్మ మనం యుద్ధం చేయాల్సిందే అని లక్ష్మీ అంటుంది. చావో రేవో తేల్చుకుంటా.. ఆ శకుంతలకి బుద్ధి  చెప్తా అని అంటుంది. 

మనం కాంట్రాక్ట్ దక్కించుకోవాల్సిందే.. 

శకుంతల బీడీ కాల్చుతూ లక్ష్మీ ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకొని రగిలిపోతూ ఉంటుంది. సిరిని ఎందుకు వదిలేశావ్ అక్క అని రౌడీలు అంటారు. రేపు అక్కడికి ఎలా వస్తుందో ఆ కాంట్రాక్ట్ రాకుండా ఎలా చేస్తుందో నేను చూస్తా అని అంటుంది. శకుంతల ఏం చేస్తుందా అని బామ్మ చాలా భయపడుతుంది. లక్ష్మీ బామ్మతో మనం భయపడినంత కాలం వాళ్లు భయపెడతారు. ఒక సారి ఎదురు తిరిగితే వాళ్లే తగ్గిపోతారు అని లక్ష్మీ ధైర్యం చెప్పి కాంట్రాక్ట్ వేయడానికి హర్షతో కలిసి వెళ్తుంది. మీరు వచ్చేవరకు నాకు భయంగా ఉంటుంది అమ్మా అని బామ్మ కంగారు పడుతుంది.  మరోవైపు సిరి పాప తినకుండా కూర్చొంటే పండు బతిమాలుతాడు. నాన్నని చూసి రెండు రోజులు అవుతుంది నేను తినను అని పాప అంటుంది. ఇంతలో విహారి వస్తాడు. యమున విహారిని ఆపి నువ్వేమో ఆఫీస్‌లు అని తిరుగుతావ్.. నీ భార్య కిట్టీ పార్టీలని తిరుగుతుంది. సిరికి తల్లి ప్రేమ దక్కడం లేదు ఇప్పుడు నీ ప్రేమ కూడా దక్కకపోతే ఎలా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 17th: గుడిలో రాధపై కత్తితో దాడి చేసిన రౌడీలు...భార్యను కాపాడుకున్న విక్రమ్‌ కృష్ణ
నువ్వులేక నేను లేను: గుడిలో రాధపై కత్తితో దాడి చేసిన రౌడీలు...భార్యను కాపాడుకున్న విక్రమ్‌ కృష్ణ
Podarillu Serial Today July 17th:మహా బర్త్‌డేకు చక్రి సర్‌ఫ్రైజ్ ప్లాన్‌....అంతకన్నా ఎక్కువ షాక్‌ ఇచ్చిన మహాలక్ష్మీ
పొదరిల్లు: మహా బర్త్‌డేకు చక్రి సర్‌ఫ్రైజ్ ప్లాన్‌....అంతకన్నా ఎక్కువ షాక్‌ ఇచ్చిన మహాలక్ష్మీ
Gundeninda Gudigantalu July17th Episode: చింతామణి చేతిలో దారుణంగా మోసపోయిన మీనా....పదిలక్షల కోసం మీనా చేసిన ప్రయత్నాలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: చింతామణి చేతిలో దారుణంగా మోసపోయిన మీనా....పదిలక్షల కోసం మీనా చేసిన ప్రయత్నాలు ఏంటి..?
Nindu Noorella Saavasam Serial Today July 17th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన స్వామిజీ - అయోమయంలో మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన స్వామిజీ - అయోమయంలో మనోహరి  
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Embed widget