Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి కోసం యమున, సహస్రతో పాటు అందరూ ఇళ్లంతా వెతుకుతారు. ఎక్కడా విహారి ఆచూకి లభ్యం కాదు. ఎంత ముఖ్యమైన పని అయినా కనీసం ఒక్క మాట చెప్పి వెళ్లాలి కదా అని అందరూ అనుకుంటారు. యమున వంద కోట్లు పని మీద వెళ్లుంటాడు అని ఏడుస్తూ చెప్తుంది.
అంబిక అందరితో విహారిది వృథా ప్రయాస ఆ లక్ష్మీని పట్టుకొని నాలుగు పీకితే నిజం చెప్తుందని హ్యాకర్లు గురించి చెప్తుందని ఈ కిడ్నాప్ కూడా ఆ లక్ష్మీనే ఉంటుందని అంటుంది. వసుధ, పండు అందరూ లక్ష్మీ ఏం చేయదు అని అంటే అంబిక అక్కతో చూశావా అక్క దాని ఫాలోయింగ్ అందర్ని తన గ్రిఫ్‌లో పెట్టిందని అంటుంది. పద్మాక్షి కూడా లక్ష్మీ కావాలనే ఈ డైవర్ట్ గేమ్ ఆడుంటుందని అంటుంది. దాని గురించి తర్వాత ముందు విహారి గురించి ఆలోచించండి అంటుంది.
విహారి, లక్ష్మీ, ఎస్‌ఐ, చారుకేశవలు సిద్దార్థ్ ఇంటికి వస్తారు. సిద్దార్థ్ వాళ్లని చూసి అంబికకు కాల్ చేస్తాడు. వాటి ఇచ్చిన తర్వాత కూడా నాకు ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటుంది. సిద్దార్థ్ అంబికతో నీ మేనల్లుడు, లక్ష్మీ అందరూ మా ఇంటికి వస్తున్నారు అని చెప్తాడు. దాంతో అంబిక వాళ్లకి డబ్బు నీ అకౌంట్‌లో పడినట్లు తెలిసిపోయింటుందని అంటుంది. సిద్దార్థ్ అంబికతో వాళ్లని నువ్వు ఆపకపోతే నేను నిజం చెప్పేస్తా అంటాడు. దానికి అంబిక సిద్దార్థ్‌ని బెదిరిస్తుంది. నేను చెప్పినట్లు వింటే నీకు ప్రాణాలు అయినా దక్కుతాయని అంటుంది. సిద్దార్థ్ భయపడతాడు.
విహారి వాళ్లు సిద్దార్థ్ ఇంటికి వచ్చే సరికి తాళం వేసి ఉండటం చూసి తాళం పగలగొట్టి లోపలికి వెళ్తారు. చారుకేశవ అతన్ని చూసి పట్టుకుంటాడు. ఎస్‌ఐ, చారుకేశవ సిద్దార్థ్‌ని పట్టుకుంటారు. 30 కోట్లు ఎలా వచ్చాయని అడుగుతారు. లక్ష్మీ ఇళ్లంతా వెతికి ఇంట్లో ఉన్న 30 కోట్లు బయటకు తీస్తుంది. సిద్దార్థ్ తప్పించుకోవాలని అనుకోకుండా తన అకౌంట్లోకి 30 కోట్లు వచ్చాయని అందులో కొంత డబ్బు తీసుకొని మిగతా డబ్బు అకౌంట్‌లో ఉందని చెప్తాడు. ఆ డబ్బు తీసుకోమని సిద్దార్థ్ అంటాడు. చారుకేశవ ఆ డబ్బు ట్రాన్షఫర్ చేసుకుంటాడు.
ఎస్‌ఐ 30 కోట్లు రికవరీ చేశాం కదా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని అంటుంది. ఉదయం అయినా విహారి ఆచూకి లేదని ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. ఫోన్ చేసినా విహారి లిఫ్ట్ చేయడు. ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. ఇంతలో పండు వచ్చి న్యూస్ వేయమని అంటాడు. అందులో వీ క్రాఫ్ట్‌లో వంద కోట్ల అవకతవకల్లో కొత్త మలుపు అని వీక్రాఫ్ట్ సీఈవో విహారి, ఎండీ లక్ష్మీ హ్యాకర్‌ని పట్టుకున్నారని చెప్పి విహారిలక్ష్మీ మీడియాతో మాట్లాడుతారు. హ్యాకర్‌ని పట్టుకొని 30 కోట్లు రికవరీ చేశామని చెప్తారు.
అంబిక, సహస్ర చాలా టెన్షన్ పడతారు. కుట్ర వెనక ఉన్న వాళ్లని చట్ట ప్రకారం శిక్షిస్తామని విహారి అంటాడు. లక్ష్మీ తప్పు ఏం లేదు చూశారా అని వసుధ అంటుంది. ఆ లక్ష్మీ నాటకాలు నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అని అంబిక అంటుంది. వసుధ యమునతో ఏం మాట్లాడవేంటి వదిన అంటే అంతా చూశాం కదా ఇంకేం మాట్లాడుతాం అంటుంది. పద్మాక్షి వసుధతో లక్ష్మీ మొత్తం డబ్బు వెనక్కి తీసుకొస్తే దాన్ని నమ్ముతా అంటుంది. వసుధ లక్ష్మీ తరుఫున మాట్లాడుతుంది. డబ్బు మొత్తం తెస్తుంది ఈ కుట్ర వెనక ఉన్న వాళ్లని బయటకు తీసుకొస్తుందని అంటుంది.
లక్ష్మీ ఫండ్స్ గురించి అంబిక, సహస్ర తనని తిట్టడం గుర్తు చేసుకొని ఏడుస్తుంది. లక్ష్మీని చూసి విహారి బాధ పడొద్దని అంటాడు. నీకు ఏ రోజు భార్యలా గుర్తింపు ఇవ్వలేదు.. తను కూడా అడగలేదు.. మా బంధాన్ని మాలోనే దాచుకోవడం కరెక్ట్ కాదు మామయ్య అని విహారి లక్ష్మీ గురించి లక్ష్మీ ముందే చెప్తాడు. చారుకేశవ కూడా మన కోసం ఇంత తపించే అమ్మాయి మన వల్ల బాధ పడటం కరెక్ట్ కాదు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?