Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీని యమున ఇంటి నుంచి పంపేస్తుంది. విహారిని ఇంటి నుంచి వెళ్లొద్దని లక్ష్మీని కలవొద్దని ప్రామిస్ చేయిస్తుంది. విహారి మనసులో లక్ష్మీని ఎస్‌ఐతో పంపాను కదా ఇక ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు వంద కోట్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇంతలో మేనేజర్ కాల్ చేసి బ్యాంక్‌ వాళ్లతో మన అకౌంట్ హ్యాక్ అయిందని మన సర్వెర్లు ముంబయిలో ఉన్నాయి.. అక్కడ నుంచి హ్యాకర్లు బ్యాంక్‌ వాళ్లకు పోలీసులకు ఐపీ అడ్రస్‌ తెలీకుండా బాగా ప్లాన్ చేశాడని అంటాడు.

విహారి మేనేజర్‌తో ఐపీ అడ్రస్‌ ఉంటే వాళ్లని ఈజీగా కనిపెట్టేయొచ్చు లక్ష్మీని ఈ స్కామ్‌ నుంచి బయట పడేయొచ్చు అని అంటాడు. ఇక వెంటనే విహారి ముంబయి బయల్దేరుతారు. యమున, సహస్ర, పద్మాక్షి అందరూ ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. విహారి వంద కోట్ల హ్యాక్ చేసిన వాళ్లని పట్టుకోవాలని అందుకే అర్జెంట్‌గా ముంబయి వెళ్తున్నా అని చెప్తాడు. ఇక్కడ ఐపీ అడ్రస్‌ తెలీకపోయిన ముంబయి సర్వెర్‌లో కచ్చితంగా ఐపీ అడ్రస్‌ దొరుకుతుందని అది తెలుసుకుంటే ఈజీగా ఆ వంద కోట్లు ఏం అయ్యావో తెలుస్తాయని అంటాడు. 

సహస్ర, అంబికలు మొత్తం లక్ష్మీనే చేసింది తనని ఇంటరాగేషన్ చేస్తే తెలిసిపోతుందని అంటారు. లక్ష్మీ మీద నాకు అనుమానం లేదని హ్యాకర్లను పట్టుకొని దాని వెనక ఎవరు ఉన్నా వాళ్ల అంతు చూస్తానని అంటాడు. ప్రాబ్లమ్ క్లియర్ చేసే వస్తానని చెప్పి వెళ్తాడు. సహస్ర మనసులో బావ ఆ హాకర్‌ని పట్టుకుంటే లక్ష్మీ వేలిముద్రలు ఇచ్చింది నేనే అని తెలిసిపోతుంది అని చాలా కంగారు పడతాడు. 

అంబిక వెంటనే సుభాష్‌కి కాల్ చేసి విషయం చెప్తుంది. వెంటనే ముంబయి వెళ్తున్న విహారిని ఆపాలని చెప్తుంది. వెంటనే విహారిని కిడ్నాప్ చేయమని చెప్తుంది. అందుకు సుభాష్‌కి ప్లాన్ చెప్తుంది. సుభాష్ సరే అంటాడు. సుభాష్ తన మనుషులకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. విహారి రాత్రి ఎయిర్ పోర్ట్‌కి వెళ్తుంటే ఓ వ్యక్తి కారుకి అడ్డంగా పడి ఉండటం చూసి యాక్సిడెంట్ అయిందేమోఅని  విహారి వెళ్తాడు. దగ్గరకు వెళ్లి చూస్తే ఆ వ్యక్తి లేచి చూస్తాడు. రౌడీలు విహారికి మత్తు పెట్టి కిడ్నాప్ చేస్తారు. విహారి కారుని మరో వ్యక్తి వేరే దగ్గర పార్క్ చేస్తాడు. 

లక్ష్మీ ఉదయం యమున మాటలు తలచుకొని బాధ పడుతుంది. ఎస్‌ఐ లక్ష్మీ దగ్గరకు వచ్చి మర్యాదలు చేసి విహారికి కాల్ చేస్తానని చేస్తుంది. విహారి ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుందని అంటుంది. లక్ష్మీ కంగారుగా విహారి గారు ఎలాంటి పరిస్థితుల్లో ఫోన్ ఆపరని చెప్తుంది. పండు గురించి చెప్పి విహారి గురించి అడుగుతా అని పండుకి కాల్ చేస్తుంది. పండు లక్ష్మీతో విహారి ముంబయి వెళ్లాడని చెప్తాడు. లక్ష్మీ ఎస్ఐతో స్కామ్ విషయంలో ముంబయి వెళ్లారు అంటే మీకో నాకో కాల్ చేస్తారు కదా చేయలేదు అంటే కంగారుగా ఉందని అంటుంది. ఎస్‌ఐ పోలీసులకు కాల్ చేసి చెప్తుంది. కానిస్టేబుల్ ఎస్‌ఐకి కాల్ చేసి ఎయిర్‌ పోర్ట్‌ దగ్గర్లో కారు అనుమానాస్పదంగా ఉందని అంటాడు. కారు డిటైల్స్ తెలుసుకోమని ఎస్‌ఐ చెప్తే అది విహారి కారుని కానిస్టేబుల్ చెప్తాడు. 

ఎస్ఐ షాక్ అయిపోతుంది. లక్ష్మీకి భయపడొద్దు అని చెప్పి ముంబయికి వెళ్లిన విహారి కారు రోడ్డు మీద ఉందని అంటుంది. ఏమైనా క్లూ దొరుకుతుందని లొకేషన్‌కి వెళ్తారు. లక్ష్మీ కారు మొత్తం వెతుకుతూ విహారి గారు అని వెతుకుతుంది. ఇంతలో రౌడీ అటుగా నక్కి నక్కి మొత్తం పరిశీలిస్తుంటాడు. ఎస్‌ఐ లక్ష్మీతో టైం అయిపోయి కారు ఇక్కడే వదిలేసి వెళ్లుంటాడు. వదిలేయ్ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!