Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతున్నా లక్ష్మీ! కన్నీటి వీడ్కోలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today February 9th Episode: లక్ష్మీ విహారిని వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode: విహారి లక్ష్మీతో ఈ రోజు నువ్వే నా భార్య అని చెప్పేస్తా ఏది ఏమైనా ఈ రోజు తాడో పేడో తేల్చుకుంటా.. ఫైనల్‌గా నా భార్యగా నువ్వే నా పక్కన ఉంటావ్ అని విహారి లక్ష్మీకి చెప్తాడు. సహస్ర, పద్మాక్షి లక్ష్మీని చంపేయాలని బయల్దేరుతారు. ఈ రోజు ఎలా అయినా లక్ష్మీ అంతు చూస్తా దాని శవమే మన ఇంటికి వస్తుందని అనుకుంటారు. లక్ష్మీ, విహారి ఇద్దరూ గుడికి వెళ్తారు.
యమున విహారికి కాల్ చేసి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందని అడుగుతుంది. గంట అని విహారి చెప్తే మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నా అని అంటుంది. విహారి లక్ష్మీతో అమ్మ తన కోడలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుందని చెప్తాడు. మరోవైపు అంబిక సుభాష్ వాళ్లకి ఎదురు వస్తుంది. సుభాష్ మీద కోపం పక్కన ఉన్న రౌడీ మీద చూపించి అతన్ని లాగి పెట్టి కొడుతుంది. సుభాష్‌ని చూస్తూ రౌడీలను తిడుతుంది. మిమల్ని నమ్మి అనవసరంగా సిటీకి వచ్చేశా.. నేనే అక్కడుంటే ఏదో ఒకటి చేసేదాన్ని.. అని తిడుతుంది. ఏంటి సుభాష్ ఏం సంజాయిషీ ఆలోచించాలి అని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. వాళ్లని ఎలా అయినా చంపాలని చూస్తున్నా అని సుభాష్ అంటాడు. ఊరిలో అంత మంచి అవకాశం వస్తే ఏం చేయలేకపోయావ్ ఇక సీటీలో ఏం చేస్తావ్ అని అడుగుతుంది. ఇంతలో సుభాష్‌కి తన మనిషి కాల్ చేసి లక్ష్మీ, విహారిలు అడ్రస్ చెప్తాడు. వాళ్ల గురించి తెలిసింది అంబిక వాళ్లని చంపి నేను చేతకాని వాడిని కాదు అని నిరూపించుకుంటా అని వెళ్తాడు. అంబిక తనతో తాను సుభాష్‌ని ఎంత రెచ్చగొడితే అంత ప్రమాదంగా మారిపోతాడు. ఆ లక్ష్మీ, విహారిలను ఏం చేస్తాడో చూస్తా అని అనుకుంటుంది.
లక్ష్మీ విహారి గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. లక్ష్మీ కొంచెం దూరం వెళ్లి విహారికి కనిపించకుండా గుడి దగ్గరకు వచ్చిన చారుకేశవ దగ్గరకు వెళ్లి చాటుగా తీసుకెళ్తుంది. పాస్ పోర్ట్‌లు తీసుకురమ్మని మెసేజ్ చేశా కదా తెచ్చారా అని అడుగుతుంది. నీది విహారిది తీసుకొచ్చా అని చారుకేశవ చెప్తాడు. లక్ష్మీ తన పాస్ పోర్ట్ తీసుకుంటుంది. ఇది నేను మాత్రమే చేయాల్సిన పయనం అని అంటుంది. అంటే విహారికి మాకు దూరంగా వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నావా అని అడుగుతాడు. అవును అని లక్ష్మీ షాక్ ఇస్తుంది. ఇక విహారి లక్ష్మీ కనిపించకపోవడంతో లక్ష్మీని వెతుకుతాడు. చారుకేశవ లక్ష్మీతో మీ అత్తయ్య నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంటే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని లక్ష్మీని వెళ్లొద్దని బతిమాలుతాడు.
లక్ష్మీ మాత్రం చారుకేశవ మాటలు వినదు.. నేను ఆ ఇంటికి కోడలిగా రావడం ఆ ఇంటికి మంచిది కాదు. ఆ కుటుంబం ముక్కలైపోతుంది అని అంటుంది. నువ్వు లేకపోతే విహారి పిచ్చోడు అయిపోతాడు అని చారుకేశవ అంటాడు. మీ అందర్ని నమ్మి ఆయన్ని వదిలేసి వెళ్తున్నా బాబాయ్.. మీరంతా తనని చూసుకోవాలి అని అంటుంది. నేను దీనికి ఒప్పుకోను విహారికి నిజం చెప్తా అని చారుకేశవ అంటే విహారిగారికి నిజం చెప్తే నా మీద ఒట్టే అని లక్ష్మీ ఒట్టేస్తుంది. చారుకేశవని బతిమాలి విహారికి నిజం చెప్పమని అంటుంది. విహారికి నువ్వు దూరంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు.. మేం కూడా సంతోషంగా ఉండలేం.. నువ్వు మనసు మార్చుకొని తిరిగిరావాలని కోరుకుంటున్నాం అమ్మా అని చెప్పి చారుకేశవ వెళ్లిపోతాడు.
లక్ష్మీ తనలో తాను విహారి గారు మీరు సంతోషంగా ఉండాలి.. ఏ సమస్య రాకూడదు అని నేను ఫారిన్ వెళ్లిపోతున్నా.. నిన్న రాత్రి మీతో భార్యగా ఉన్నాను ఆ ఒక్క జ్ఞాపకం చాలు జీవితాంతం బతికేస్తా అని అనుకుంటుంది. ఇంతలో విహారి లక్ష్మీని చూసి వచ్చి హగ్ చేసుకుంటాడు. నువ్వు కనిపించలేదని చాలా కంగారు పడ్డానని విహారి అంటాడు. దానికి లక్ష్మీ కొత్త ప్రయాణం చేయబోతున్నా కదా దాని గురించి ఆలోచిస్తున్నా అని అంటుంది. నా భార్యగా కొత్త ప్రయాణం గురించి ఆలోచిస్తున్నావా అని విహారి అంటాడు. ఇక లక్ష్మీ ఎమోషనల్ అవుతూ తన చేతికి ఉన్న ఉంగరం తీసి ఇది చిన్నప్పటి నుంచి నాతోనే ఉంది.. ఇది మీకు ఇవ్వాలి అనిపిస్తుంది. ఇది మీకు ఇస్తే నేను మీతో ఉన్నట్లే అని ఆ రింగ్‌ని విహారి చేతికి పెడుతుంది. ఉంగరం చేతికి వెళ్లకపోవడంతో విహారి బలవంతంగా పెట్టుకొని ఇది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నిన్నూ ఈ ఉంగరాన్ని ఎప్పటికీ వదలను అని అంటాడు. లక్ష్మీ విహారి చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. లక్ష్మీ ఏడ్వడం చూసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అంటే ఇంత ప్రేమ మిస్ అవుతా కదా అంటుంది. అదేంటి అని విహారి అంటే ఇన్ని రోజులు ఇంత ప్రేమ మిస్ అయ్యానని అంటుంది. అమ్మవారికి పట్టు బట్టలు పెట్టాలి.. అని అంటుంది. దాంతో విహారి నేను తీసుకొస్తా అని వెళ్తాడు. లక్ష్మీ విహారి వెళ్లడం చూసి చాలా ఏడుస్తుంది. ఇదే మనం చివరి సారి కలిసి ఉండేది ఇకపై మనం ఎప్పటికీ కలవమని అనుకొని వెళ్లిపోతుంది. విహారి వచ్చే సరికి లక్ష్మీ ఉండదు.. దాంతో విహారి మొత్తం వెతుకుతాడు. ఎక్కడికి వెళ్లిందని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























