Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సర్టిఫికేట్ మీద విహారి సంతకం చేస్తాడా! లక్ష్మీకి నిజం తెలుస్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode February 18th సహస్ర ప్రెగ్నెన్నీ ఫంక్షన్ పెట్టిన పద్మాక్షి మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. అజ్ఞాతవ్యక్తి విహారికి సర్‌ఫ్రైజ్ ఉందని అంటాడు. అతను ఎవడో ఎలా అయినా కనిపెట్టాలి అని విహారి అనుకుంటాడు. ఫంక్షన్ టైం అవ్వడంతో పద్మాక్షి, అంబిక సహస్రని తీసుకురావడానికి వెళ్తారు. విహారి లక్ష్మీ ముఖం చూస్తే లక్ష్మీ బాధగా ముఖం దించుకుంటుంది.
యమున విహారిని చూసి మనసులో నువ్వు లక్ష్మీ గురించి ప్రెస్ మీట్‌లో చెప్పేసి ఉంటే.. ఈ పాటికి లక్ష్మీని నిన్ను మన చుట్టాలకు పరిచయం చేయడానికి ఇలాంటి ఫంక్షన్ ఏర్పాటు చేసేదాన్ని.. నిజం చెప్పకుండా తప్పు చేశావ్‌రా విహారి.. నువ్వే నీ సంతోషాన్ని దూరం చేసుకుంటున్నావ్‌రా.. ఎందుకు ఇలా చేశావ్రా అని మనసులో అనుకుంటుంది. పద్మాక్షి, అంబిక వచ్చే సరికి సహస్ర ఫాస్ట్‌గా నడుస్తూ వస్తుంది. అది చూసిన అంబిక ఎందుకు అంత ఫాస్ట్‌గా వెళ్తున్నావ్.. నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు గుర్తు లేదా అని అడుగుతుంది. దాంతో పద్మాక్షి సహస్రని తిట్టి కవర్ చేస్తుంది. జాగ్రత్త అని అంబిక అంటుంది. ఫంక్షన్‌లో అందరూ సందడిగా ఉంటారు. లక్ష్మీ గురించి నిజం తెలిసిన వాళ్లు మాత్రం డల్‌గా ఉంటారు.
విహారి వేరే చోట ఉంటే పద్మాక్షి చూసి యమున మీద కోప్పడుతుంది. విహారిని ప్రత్యేకంగా పిలవాలా రమ్మని చెప్పు అంటుంది. యమున వెళ్లి విహారి పిలుస్తున్నారు రారా అని అంటుంది. సహస్ర, విహారిలు పక్కపక్కన నిల్చొంటారు. సహస్ర ఈ కుటుంబ వారసున్ని కుడుపులో మోస్తుందని చెప్తుంది. ఇక లక్ష్మీ విహారి టెన్షన్గా ఉన్నారు.. ఏదో దాస్తున్నారు అసలు ఆ కవర్ ఏంటో చూడాలి అని విహారి గదిలోకి వెళ్తుంది. విహారి ఫోన్ గదిలో ఉంటుంది. అప్పుడే ఫోన్ వస్తుంది. లక్ష్మీ చూసే టైంకి విహారి ఫోన్ కోసం అక్కడికి వస్తాడు. లక్ష్మీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నీకు పంపిస్తాను అన్న గిఫ్ట్ మీ ఇంటికి వచ్చేసింది వెళ్లి తీసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. లక్ష్మీ ఎవరా అనిఅనుకుంటూ ఉంటుంది. ఇంతలో విహారి అక్కడికి వస్తాడు. విహారి గారు నాకు చెప్పకుండా ఏం దాస్తున్నారు అని అడుగుతుంది. విహారి లక్ష్మీకి తన ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. లక్ష్మీ ఇవ్వదు. విహారి తీసుకుంటాడు.
అజ్ఞాతవ్యక్తి మాటలు గుర్తొచ్చి పరుగున ఫంక్షన్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఫంక్షన్ దగ్గరకు విహారి పేరు మీద కొరియర్ వస్తుంది. పండు తీసుకొని విహారి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో భక్తవత్సలం పిలవడంతో కొరియర్ కవర్ అక్కడే పెట్టి ఫంక్షన్ దగ్గరకు వస్తాడు. లక్ష్మీ ఆలోచిస్తూ ఉంటుంది. యమున లక్ష్మీని చూసి బాధపడుతుంది. సహస్ర, విహారి కలిసి కేక్ కట్ చేస్తారు. పద్మాక్షి విహారితో ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నానురా.. ఎందుకంటే సహస్ర కడుపులో మా అన్నయ్యని మోస్తుంది.. ఇంకో 6 నెలల్లో అది పండండి మగ బిడ్డను కంటుంది. ఈ ఇంటికి మీరిద్దరూ వారసున్ని ఇస్తున్నారురా అని అంటుంది. భక్తవత్సలం సంతోషంగా మీరు నాకు మునిమనవడిని ఇస్తే నేను హ్యాపీగా ఆడుకుంటానురా అని అంటాడు. ఇక పద్మాక్షి ఈ సంతోష సమయంలో నేను ఓ నిర్ణయం తీసుకున్నా అని అంటుంది. ఏంటి అని అందరూ అడుగుతారు. పద్మాక్షి విహారితో మీ ఇద్దరి పెళ్లి హాస్పిటల్‌లో అనుకోకుండా సాదాసీదాగా జరిగిపోయింది. అది రిజిస్టర్ చేయించడానికి ఈ పేపర్లు తీసుకొచ్చా అని అంటుంది. విహారి, యమున, లక్ష్మీ షాక్ అయిపోతారు. పేపర్ల మీద సహస్ర సంతకం పెట్టేసింది.. నువ్వు సంతకం పెడితే మీ ఇద్దరి పెళ్లి చట్టబద్ధం అయిపోతుంది అని పద్మాక్షి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























