Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: చట్టప్రకారం సహస్ర విహారి భార్య కాదా! పద్మాక్షికి దొరికిన అవకాశం!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode February 17th సహస్ర ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ చేస్తున్నా అని పద్మాక్షి ఇంట్లో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర తల్లి దగ్గర ఏడుస్తూ బావకి ఆ లక్ష్మీనే ఇష్టం.. తననే భార్యగా చూస్తున్నాడు.. మొదట తాళి కూడా తనకే కట్టాడు.. నా జీవితం ఏంటి అమ్మా ఇలా అయిపోయింది అని ఏడుస్తుంది. విహారి నీకు భర్తేనే నీ మెడలో కూడా తాళి కట్టాడు అని పద్మాక్షి అంటే బావ నా మెడలో కేవలం రెండు ముళ్లే వేశాడని సహస్ర ఏడుస్తూ చెప్తుంది. ఏంటే నువ్వు చెప్తున్నావ్ అని పద్మాక్షి షాక్ అయిపోతుంది.
సహస్ర ఏడూస్తూ ఈ విషయం తాగి వచ్చిన బావ చెప్తుంటే నేను విన్నాను.. అని చెప్తుంది. మూడు ముళ్లు వేయకుండా బావ నాకు భర్త ఎలా అవుతాడమ్మా.. ఎలా చూసినా ఆ లక్ష్మీనే బావకి భార్య అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా ఇన్ని రోజులు బావని లక్ష్మీని దూరం చేసి ఎలా అయినా బావని సొంతం చేసుకోవాలి అనుకున్నా.. కానీ ఇదంతా చూస్తుంటే బావ నాకు దక్కడని అనిపిస్తుందోమ్మా,, బావ లేకపోతే నేను బతకలేనమ్మా అని సహస్ర ఏడుస్తుంది. నిన్నూ విహారి నేను కలుపుతానే.. అదే నా లక్ష్యం అని పద్మాక్షి అంటుంది. ఎలా అమ్మా.. నా ప్రెగ్నెన్సీ కూడా నాటకమే కదా.. ఇవన్నీ తెలిసిన రోజు నా కథ ముగిసిపోతుంది అని సహస్ర ఏడుస్తుంది.
పద్మాక్షి లాయర్‌కి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. లీగల్‌గా నా కూతురు ఎలా ఎదుర్కొవాలని అడుగుతుంది. ఎలా చూసినా మీ కూతురికి విహారికి లీగల్‌గా ఎలాంటి సంబంధం లేదు.. పెళ్లి కూడా మీ మధ్యే జరిగింది.. కాబట్టి వాళ్ల కంటే ముందు మీ కూతురి పెళ్లి జరిగినట్లు రిజిస్టర్ చేయండి అని అంటాడు. ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకొని విహారితో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయిస్తా అని పద్మాక్షి అంటుంది. అందరూ రాత్రి భోజనాలు చేస్తుంటారు. విహారి వెళ్తుంటే విహారిని పిలిచి తినమని అంటారు. ఇంతలో పద్మాక్షి వచ్చి సహస్ర ప్రెగ్నెంట్‌గా ఉంది.. కనీసం తిన్నదా లేదా ఎవరూ అడగరా.. తనని పట్టించుకునే వాళ్లే ఈ ఇంట్లో లేరు అని అంటుంది. అలా అంటారు ఏంటి వదినా.. రోజు ఈ టైంకి సహస్ర వచ్చేసేది.. ఈ రోజు రాలేదు అంటే రెస్ట్ తీసుకుంటుందని అనుకున్నా అందరూ తినేశాక పిలుద్దాం అనుకున్నా అని యమున అంటుంది. ఏంటి అందరూ తినేశాక పిలుస్తావా.. తను గర్భవతి అయిందనే విషయమే మీకు గుర్తొందా.. సొంత కోడలికి చూసుకోవడం తెలీదు కానీ బయట వాళ్లని నెత్తి మీద పెట్టుకోవడం తెలుసు అంటుంది.
విహారి పద్మాక్షితో అత్తయ్య చిన్న విషయం కదా అని అంటాడు. ఇది చిన్న విషయమారా నీ భార్యని ఇంట్లో ఎవరైనా చూసుకుంటున్నారా.. అంతెందుకు నువ్వు కనీసం దాన్ని ఏం తింటున్నావ్.. ఎలా ఉంటున్నావ్ అని అడిగావా.. అసలు ఈ ఇంట్లో వాళ్లకి బయట వాళ్ల మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో వాళ్ల మీద లేనట్లు ఉంది అంటుంది. ఇక నుంచి సహస్రని అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి అని అంబిక అంటుంది. నా కూతురికి రేపటి నుంచి 3వ నెల వస్తుంది. మన ఫ్యామిలీలోనే కాదు.. మన రిలేటివ్స్‌కి అందరికీ నా కూతురు గర్భవతి అని తెలియాలి అందుకే రేపు సాయంత్రం ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ చేస్తున్నా అని అంటుంది. విహారి, లక్ష్మీ, యమున షాక్ అవుతారు. విహారితో రేపు ఆ పని ఉంది.. ఈ పని ఉంది. అని వెళ్లిపోవడం కాదు నా కూతురి పక్కనే ఉండాలి అంటుంది. భక్తవత్సలం కూతురితో ఉంటాడులే వాడి భార్య ఫంక్షన్‌కి వాడు ఉండకుండా ఎక్కడికి వెళ్తాడు అని అంటాడు.
సహస్ర గదిలోకి వెళ్లి విహారి,లక్ష్మీల గురించి ఆలోచించి ఏడుస్తుంది. పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్లి ఓదార్చుతుంది. విహారితో రేపు ఫంక్షన్‌లో అందరి ముందు సంతకం పెట్టేలా నేను చేస్తా అని పద్మాక్షి అంటుంది. విహారి అజ్ఞాత వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆయనే కాల్ చేస్తాడు. రేపు మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ పెట్టుకున్నావ్ అంట కదా అని ఆయన అంటాడు. పది నిమిషాల క్రితం మాట్లాడుకుంది నీకు ఎలా తెలుసురా అని విహారి అడుగుతాడు. చెప్పాను కదరా నేను నీ నీడను అని నువ్వు ఏం చేసినా నాకు మొత్తం తెలిసిపోతుంది. రేపు నువ్వు ఆనందంగా ఫంక్షన్ చేసుకుంటే నేను తట్టుకోలేనురా.. అని అంటాడు. ఎదుటి వాళ్ల సంతోషం చూడలేనివాడిని సైకో అంటారు. వెళ్లి చూపించుకోరా అని విహారి అంటాడు. నువ్వు సంతోషంగా ఉండకుండా చేయడమే నా లక్ష్యంరా.. రేపు నీకు ఓ సర్‌ఫ్రైజ్ పంపిస్తున్నా.. రేపు అది నువ్వు కాకుండా ఇంకెవరు చూసిన మీ అమ్మ పరువు పోతుంది అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























