Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 13th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: యమునకు 2 పెళ్లిళ్లు అయ్యావా? విహారి ఇంట్లో కొత్త చిచ్చు! CEOగా లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode February 13th విహారి ప్రెస్ మీట్‌లో లక్ష్మీ తన భార్య అని చెప్పాలి అనుకోవడం అజ్ఞాతవ్యక్తి ప్రెస్‌మీట్ ఆపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ప్రెస్‌మీట్ పెడతాడు. లక్ష్మీని దగ్గరకు పిలుస్తాడు. సహస్ర చాలా టెన్షన్ పడుతుంది. ఇక సుభాష్ కూడా షూట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అజ్ఞాతవ్యక్తి కాల్ చేస్తే విహారి లిఫ్ట్ చేయకపోవడంతో ఆయన మెసేజ్ చేస్తాడు. నువ్వు ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎంతో ప్రేమగా చూసుకుంటున్న మీ అమ్మ పరువు పోతుందని రాస్తాడు.
విహారి షాక్ అయి పక్కకి వెళ్లి కాల్ మాట్లాడుతాడు. అజ్ఞాత వ్యక్తి విహారితో ప్రెస్ మీట్ ఆపేసి వెంటనే నా దగ్గరకు రా అని చెప్తాడు. నువ్వు ఎవర్రా అని విహారి కోప్పడితే నీకు ఓ మెసేజ్ వచ్చింది అది చూడు అని ఓ ఫోటో పంపిస్తాడు. అందులో యమున మరో వ్యక్తి పెళ్లి చేసుకున్నట్లు ఉంటుంది. విహారి కోపంగా అసలు నువ్వు ఎవర్రా అంటే నువ్వు నేను చెప్పిన చోటుకి వస్తే ఇలాంటివి చాలా చూపిస్తా.. లేదంటే మీడియా మొత్తానికి ఈ ఫొటో చూపిస్తా అంటాడు. దాంతో విహారి సరే అంటాడు. వెంటనే మీడియా దగ్గరకు వెళ్లి సారీ చెప్పి అరగంటలో వస్తా ఆగమని అంటాడు. విహారి సడెన్‌గా ఎక్కడికి వెళ్తున్నాడు అని అందరూ అనుకుంటారు. లక్ష్మీ కూడా టెన్షన్ పడుతుంది.
అజ్జాతవ్యక్తి చెప్పిన లొకేషన్‌కి విహారి వెళ్తాడు. వెళ్లి వెంటనే ఫోన్ చేస్తాడు. కాసేపు ప్రశాంతంగా ఉండు తర్వాత ఎలాగూ ఉండలేవు అని అంటాడు. విహారికి ఓ ఫోన్‌లో తిప్పుతూ ఉంటాడు. ఓ ఖాళీ ప్లేస్లోకి వెళ్లి రాళ్ల కుప్ప కింద ఓ కవర్ తీసుకోమని చెప్తాడు. అది ఓపెన్ చేసి చూసిన విహారి ఆ కవర్ మీద యమున వెడ్స్ విశ్వనాథ్ అని రాసి ఉన్న శుభలేఖ చూసి బిత్తరపోతాడు. ఆ పెళ్లి కార్డు మీద మీ నాన్న పేరు ఉండకుండా ఇంకొకరి పేరు ఉందని చూస్తున్నావా.. నీ స్టోరీ లాంటి స్టోరీనేరా మీ అమ్మది కూడా అని విహారికి కథ మొత్తం చెప్తాడు. ఇదీ జరిగింది నా మాట మీద నమ్మకం లేకపోతే మీ అమ్మని అడుగు అని అంటుంది. తన గురించి నిజం తెలిసిపోయిందని మీ అమ్మ గుండె ఆగి చచ్చిపోతుందిరా అని అంటాడు. అసలు నీకు ఏం కావాలి అని విహారి అడిగితే.. నీ అసలు భార్య గురించి నువ్వు ప్రెస్ మీట్లో చెప్పకూడదు.. అంటాడు. నేను నిజం చెప్పకపోతే నీకు వచ్చే లాభం ఏంటి అని అంటే దీన్ని సంతృప్తి అంటారు.. నువ్వు తన గురించి చెప్పి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావ్ కదా మీరు సంతోషంగా ఉండకూడదు.. నువ్వు నిజం చెప్తే నేను మీ అమ్మ గురించి చెప్పేస్తా.. అని అంటాడు. విహారి చాలా టెన్షన్ పడతాడు.
విహారి ఇంటికి వచ్చి మేనేజర్‌తో మాట్లాడి వెంటనే లక్ష్మీని సీఈవోని చేస్తూ ఆర్డర్లు పాస్ చేయమని అంటాడు. అంబిక ఆ మాటలు వినేసి ఇంకా నా గురించి సుభాష్ గురించి అనుకున్నా అని కంగారు పడుతుంది. లక్ష్మీని సీఈవోని చేస్తే ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటుంది.
ఇక విహారి మీడియా ముందుకు వచ్చి లక్ష్మిని పిలిచి తనే కనకమహాలక్ష్మీ.. తను మా ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయింది.. ఇప్పుడు కనకమహాలక్ష్మీని మా బిజినెస్‌లు అన్నింటికీ సీఈవోని చేయాలి అని నిర్ణయించుకున్నా అని చెప్తాడు. అందరూ బిత్తరపోతారు. లక్ష్మీనే తన భార్య అని చెప్పాలి అనుకున్న విహారి ఇలా చెప్పాడేంటి అని ఆలోచిస్తారు. సహస్ర అయితే విహారి లక్ష్మీ గురించి చెప్పకుండా ఉన్నందుకు సంతోషపడుతుంది. యమున నిజం చెప్పేస్తా అని వెళ్లబోతే సహస్ర యమునకు తెలీకుండా నోరు మూసి గదిలో పెట్టి లాక్ వేసేస్తుంది. మీ ఇంట్లో అందరు ఉండగా లక్ష్మీకి ఎందుకు సీఈవో బాధ్యతలు ఇచ్చారు అని అడుగుతుంది మీడియా.. ఇంతలో విహారి యమున కోసం చూసి అమ్మ ఎక్కడా అనుకుంటూ లోపలికి వెళ్తాడు. చారుకేశవ మీడియాతో మాట్లాడి పంపేస్తాడు. ఇక సహస్ర ఎవరూ చూడకముందే యమున గది తలుపు తీసేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























