అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 11th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి సంచలన నిర్ణయం! ప్రెస్ మీట్ ఎవరి కోసం?

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode February 11th లక్ష్మీ గురించి విహారి అందరికీ చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీలు ఒకర్ని వదిలి ఒకరు ఉండలేమని అనుకొని ఇంటికి వెళ్లి అందరికీ విషయం చెప్పేయాలి అనుకుంటారు. సుభాష్ అంబికకు కాల్ చేసి లక్ష్మీ, విహారీలను చంపలేకపోయాను కానీ వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానం ఉంది.. లక్ష్మీ కోసం విహారి చాలా తపించిపోతున్నాడు.. అని చెప్తాడు. నువ్వు ముందు పారిపో నేను చెప్పే వరకు ఎవరికీ కనిపించకు అని అంబిక చెప్తుంది. విహారి, లక్ష్మీల మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. 

లక్ష్మీ విహారి మీద తనకు ఉన్న ప్రేమ అయితే చెప్పేసింది కానీ.. విహారి నిజం చెప్తే ఇంట్లో ఎన్ని గొడవలు అవుతాయో అని సహస్ర పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తుంది. లక్ష్మీ, విహారి ఇంటికి వచ్చేస్తారు. లక్ష్మీ కారు దిగడానికి ఆలోచిస్తూ ఉంటే విహారి డోర్ తీసి లక్ష్మీకి దిగమని చెప్తాడు. లక్ష్మీ భయంగా ఉంది మన బంధం గురించి అప్పుడే చెప్పొద్దని అంటుంది. ఇప్పటికే నువ్వు ఈ ఇంటి కోడలు అని చెప్పక ఎన్ని ఇబ్బందులు పడ్డావు కదా.. ఇప్పటికైనా చెప్పేయాలి అని అంటాడు. నిన్ను నా ఫ్యామిలీకి పరిచయం చేసి నీకు తగిన స్థానం ఇవ్వాలి.. ఇందుకు ఏమైనా నేను భరిస్తాను.. అందరికీ నేను చెప్తాను.. ఫలితం ఏమైనా నేను భరిస్తాను.. ఈ రోజు ఎలా అయినా నువ్వు ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి అని అంటాడు. లక్ష్మీ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. 

పండు చూసి సంతోషంగా యమున, వసుధలకు చెప్తాడు. వసుధ వాళ్లు హారతి తీసుకొస్తారు. ఈ రోజు నుంచి ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభిస్తారు.. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అని హారతి ఇస్తారు. వసుధ హారతి ఇస్తుంటే పద్మాక్షి వచ్చి హారతి పళ్లెం నెట్టేస్తుంది. అందరూ బిత్తరపోతారు. వసుధ, సహస్రలు చాలా సీరియస్‌గా ఉంటారు. ఏం చేస్తున్నారు.. మీరు దానికి హారతి ఇచ్చి ఆహ్వానించే అంత ఘనకార్యం అదేం చేసింది అని పద్మాక్షి అంటుంది. విహారి ముంబయి వెళ్లాడు.. ఈ లక్ష్మీ వీక్రాఫ్ట్ పని మీద ఊరు వెళ్లాడు.. ఇద్దరూ కలిసి  ఎలా వచ్చారు అని అంబిక అడుగుతుంది. బావతో కలిపి దానికి ఎందుకు హారతి ఇస్తారు అని సహస్ర అడుగుతుంది. యమున సహస్రతో లక్ష్మీని దానికి దీనికి అనొద్దు అంటుంది. ఇంకెలా పిలవాలి.. లక్ష్మీగారు.. మీరు మా అందరికీ మహారాణి.. మేం మీ కట్టుబానిసలం అని దానికి నీకు కాళ్లు  మొక్కి ఇంట్లోకి ఆహ్వానించాలా అని పద్మాక్షి అంటుంది. అత్తయ్యా అని విహారి అంటే సౌండ్ చేయకు అని పద్మాక్షి అంటుంది.

లక్ష్మీ విహారిని ఏం మాట్లాడొద్దు అని అంటుంది. ఇంతలో పద్మాక్మి లక్ష్మీని లాగిపెట్టి కొడుతుంది. లక్ష్మీని ఎందుకు కొట్టారని విహారి అడిగితే ఇంట్లో గర్భవతిని వదిలేసి వెళ్లిపోతా కొట్టనా.. అంటుంది. తను వీక్రాఫ్ట్ పనులే కాదు.. ఇంట్లో పనులు కూడా చేయాలి కదా అంటుంది. లక్ష్మీని పని మనిషి అనొద్దు అని యమున అంటుంది. దాన్ని ఇంకేం అనాలి దాని వాలకం చూస్తే అలాగే ఉంటుందని పద్మాక్షి అంటుంది. లక్ష్మీ విలువ మీకు తెలీదు.. తను ఎవరో కూడా మీకు తెలీదు.. మామయ్య అరగంటలో ప్రెస్ మీట్ పెట్టండి.. అని  అంటాడు. అంబిక విషయం అడిగితే అందరికీ ప్రెస్ మీట్ లోనే  చెప్తా.. కొన్ని నిజాలు మీరంతా తెలుసుకుంటారు అని అంటాడు. 

విహారి ఏం నిజాలు చెప్పాలి అనుకుంటున్నాడు, నా గురించి ప్రెస్ మీట్‌లో చెప్పాలి అనుకుంటున్నాడా అని అంబిక చాలా టెన్షన్ పడుతుంది. యమున విహారిని పక్కకి తీసుకెళ్లి ఏం చేస్తున్నావ్‌రా.. తను ఈ ఇంటికి కోడలు అని అందరికీ చెప్పాలి కదా. అది చెప్పకుండా ప్రెస్ మీట్ ఏంటి అని అడుగుతుంది. లక్ష్మీ గురించి మన ఇంట్లో మాత్రమే తెలిస్తే సరిపోతుందా.. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం అందరికీ తెలియాలి.. తను నా అసలైన భార్య అని ప్రపంచానికి తెలియాలి.. ఇంట్లో వాళ్లతో పాటు అందరికీ ఒకే సారి విషయం తెలియాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి విషయం చెప్తా అని అంటాడు. నీ ఆలోచన చాలా బాగుందిరా అని యమున అంటుంది. ఇక మీద కనకానికి ఎవరి వల్ల అవమానం జరగకూడదు.. ఎవరు తనని ఏం అనకూడదు అని అంటాడు. లక్ష్మీ ఈ ప్రెస్ మీట్‌లు ఏం వద్దు.. నేను మీ ఇంట్లో కోడలి స్థానం ఆశించడం లేదు.. మీ అందరితో ఇలా ఉంటే చాలా  అని అంటుంది. నిన్ను ఈ ఇంటి కోడలిగా చూసుకుంటాం అని మీ నాన్నకి మాటిచ్చాం.. అది జరిగి తీరాలి..నువ్వేం చెప్పినా ఇక నిజం చెప్పకుండా ఆపలేవని యమున అంటుంది. 

విహారి నిజం చెప్పేస్తాడేమో అని సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పద్మాక్షి రావడంతో లక్ష్మీని చంపేస్తా అంటే వద్దు అన్నావ్..  కదా ఇప్పుడు చూడు బావ ప్రెస్ మీట్ అంటున్నాడు.. ఆ లక్ష్మీని చంపేస్తా అని అంటుంది. లక్ష్మీని చంపేస్తే మీ బావ ఊరుకుంటాడా.. అని అంటుంది. అందరికీ నిజం తెలిస్తే దాన్ని చంపి ఉపయోగం లేదమ్మా అని సహస్ర అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today March 16th: పుట్టింట్లోనే జగధాత్రికి ఘోర అవమానం...ధాత్రిని రాగిని మెడపట్టి బయటకు గెంటడానికి కారణమేంటి..?
జగద్ధాత్రి సీరియల్: పుట్టింట్లోనే జగధాత్రికి ఘోర అవమానం...ధాత్రిని రాగిని మెడపట్టి బయటకు గెంటడానికి కారణమేంటి..?
Podharillu Serial Today March 16th:  మహా,చక్రి లాయర్‌ను ఎందుకు కలిశారు..? మహాకు నిహారిక ఇచ్చిన సలహా ఏంటి..?
పొదరిల్లు: మహా,చక్రి లాయర్‌ను ఎందుకు కలిశారు..? మహాకు నిహారిక ఇచ్చిన సలహా ఏంటి..?
Nindu Noorella Saavasam Serial Today march 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని నిలదీసని మనోహరి – ఇంట్లోంచి వెళ్లిపోతానన్న భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని నిలదీసని మనోహరి – ఇంట్లోంచి వెళ్లిపోతానన్న భాగీ
Nindu Manasulu Serial Today March 16th: నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ గణ! అన్నతో అదిరిపోయే ఛాలెంజ్! తల్లికి షాక్ ఇచ్చిన సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ గణ! అన్నతో అదిరిపోయే ఛాలెంజ్! తల్లికి షాక్ ఇచ్చిన సిద్ధూ!
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget