Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 10th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి ప్రేమలో ట్విస్ట్: లక్ష్మీ వెళ్లిపోయిందా? సుభాష్ కుట్ర! చివరికి ఏమైంది?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode February 10th లక్ష్మీ తనని వదిలేసి వెళ్లిపోయిందని విహారి పిచ్చోడిలా రోడ్లు పట్టుకొని లక్ష్మీ గురించి వెతకడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి పంతులుకి పట్టు బట్టలు ఇస్తాడు. ఇవి ఎందుకు అని పంతులు అడిగితే మీరే అడిగారని నా భార్య చెప్పిందని అంటాడు. అవేమీ అవసరం లేదు అని పంతులు చెప్పడంతో విహారి షాక్ అవుతాడు. కనకం ఇచ్చిన రింగ్ చూసి ఈరోజే ఎందుకు ఈ రింగ్ ఇచ్చింది.. ఈ రింగ్ నాతో ఉంటే తను నాతో ఉన్నట్లే అని ఎందుకు చెప్పింది.. సారీ ఎందుకు చెప్పింది.. ఏదో కొత్త ప్రయాణం అని ఎందుకు చెప్పింది.. అంటే నాతో రావడం ఇష్టం లేక వెళ్లిపోవాలి అనుకుందా అని షాక్ అయిపోతాడు.
లక్ష్మీ అంటూ గుడి మొత్తం వెతుకుతాడు. లక్ష్మీ కూడా ఆటోలో వెళ్లిపోతూ విహారిని గుర్తు చేసుకొని ఏడుస్తుంది. విహారి లక్ష్మీ లక్ష్మీ అంటూ పడిపోతాడు. అందరూ అక్కడికి వస్తారు. ఏమైందని అని అడగటంతో లక్ష్మీ ఫొటో చూపించి అందరికీ అడుగుతాడు. పంతులు తన ఫోన్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తాడు. లక్ష్మీ చారుకేశవతో మాట్లాడిందేంటి అని అనుకుంటాడు. లక్ష్మీ కూడా నీ వెనకాలే వెళ్లింది ఎక్కువ దూరం వెళ్లదు వెళ్లి వెతుకు అని అంటారు. విహారి వెళ్తాడు. తర్వాత సుభాష్ లక్ష్మీ, విహారిల కోసం వెతుకుతాడు. విహారి కూడా బయటకు వెళ్లాడని తెలుసుకొని సుభాష్ తన మనుషులతో వెతకుతాడు.
లక్ష్మీ గురించి విహారి వెతుకుతూ నన్ను వదిలేసి ఎలా వెళ్లాలి అనుకున్నావ్.. నువ్వు లేకుండా నేను బతకలేను అని అనుకుంటాడు. వెంటనే చారుకేశవకి కాల్ చేస్తాడు. చారుకేశవ కాల్ లిఫ్ట్ చేయడు. విహారి కాస్త దూరం వెళ్లే సరికి చారుకేశవ బాధగా ఇంటికి వెళ్తూ కనిపిస్తాడు. చారుకేశవ దగ్గరకు వెళ్లి మామయ్య కనకం ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు. నాకు తెలీదు అని చారుకేశవ అంటాడు. నీకు తెలీకపోవడం ఏంటి.. నువ్వు గుడికి రావడం కనకంతో మాట్లాడటం అంతా నాకు తెలుసు.. నీతో లక్ష్మీ బాధగా ఏదో చెప్పింది.. నువ్వు కూడా కారు వదిలేసి బాధగా వెళ్తున్నావ్ అని అడుగుతాడు. దాంతో చారుకేశవ విహారి వదిలేయ్‌రా లక్ష్మీ ఇక మనకు కనిపించదు అని అంటాడు. విహారి మళ్లీ మళ్లీ అడగటంతో.. తను ఇక మనకు కనిపించదురా... నాతో పాస్ పోర్ట్ తెప్పించుకొని మనల్ని వదిలేసి వెళ్లిపోవాలని అనుకుంది.. నీకు కూడా కనిపించలేదు అంటే ఈ పాటికే వెళ్లిపోయి ఉంటుంది అని అంటాడు.
విహారి వెంటనే ఎయిర్‌పోర్టుకి బయల్దేరుతాడు. దారిలో సుభాష్ వాళ్లు విహారి కారుకి అడ్డంగా వస్తారు. విహారి గొడవ పడతారు. రేయ్ అర్జెంటుగా వెళ్లాలిరా పర్సనల్ పనిరా అని అంటాడు. అప్పుడే విమానం వెళ్లడం చూసి సుభాష్‌ని తోసేసి పరుగులు పెడతాడు. కాస్త దూరం వెళ్లి కనకమహాలక్ష్మీ అని అరుస్తూ ఏడుస్తాడు. నన్ను వదిలేసి వెళ్లిపోయావా అని కుప్పకూలిపోతాడు. సుభాష్ వాళ్లు విహారిని చుట్టుముడతారు. విహారిని కొడతారు. విహారి కింద పడిపోతాడు. అప్పుడే అక్కడ లక్ష్మీ పాస్ పోర్ట్ కింద కనిపిస్తుంది. విహారి చూసి పట్టుకొని చితక్కొట్టేస్తాడు. సుభాష్‌తో థ్యాంక్స్‌రా నీ వల్లే లక్ష్మీ ఎక్కడికీ వెళ్లలేదు అని తెలిసిందని అంటాడు. నీ లక్ష్మీనా అని సుభాష్ షాక్ అయిపోతాడు. కాస్త దూరంలో రౌడీలు లక్ష్మీని పట్టుకోవడం చూస్తాడు. లక్ష్మీని పట్టుకొని లాగిపెట్టి కొట్టి నన్ను వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నావా.. ఎందుకు వెళ్లిపోవాలి అనుకున్నావ్ చెప్పు అని రౌడీలను చితక్కొట్టేస్తాడు.
లక్ష్మీ ఏడుస్తుంది. లక్ష్మీకి పాస్ పోర్టు ఇచ్చి వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నావ్ కదా వెళ్లిపో.. నీ కోసం నీ ప్రేమ కోసం నా ఇంట్లో వాళ్లని వదిలేసి నీ ఇంటి ముందు పోరాడాను.. నన్ను వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నావా.. నేను అంటే నీకు అంత లోకువ అయిపోయానా.. ప్రేమ అంటే దూరంగా పారిపోవడం కాదు.. ప్రేమంటే పోరాడి మన ప్రేమను మనం గెలిపించుకోవడం.. నేను నీ మాటలు వినను..నువ్వు చేస్తుందంటా చేస్తుంటావ్..కదా.. రాత్రి ఐలవ్‌యూ కూడా నాతో జాలితోనే చెప్పావ్ కదా అంటాడు. లక్ష్మీ ఏడుస్తూ నా మనసులో మాటే మీకు నిన్న చెప్పాను.. మీకు సమస్యలు రాకుండా వెళ్లిపోవాలి అని అనుకున్నా.. కానీ ఇప్పుడే తెలిసింది.. మీరే కాదు నేను మీ నుంచి దూరంగా వెళ్లలేను అని ఇక్కడే ఆగిపోయా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























