Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి కండీషన్ సీరియస్‌గా ఉందని డాక్టర్ చెప్తారు. లక్ష్మీకి కూడా ఆ విషయం తెలిసి విహారి కోలుకోవాలని హాస్పిటల్‌లో కనిపించిన అమ్మవారిని దండం పెట్టి త్రిశూలానికి చేతిని గుర్చుకొని ఆ రక్తంతో అమ్మవారికి తిలకం దిద్దుతుంది.
పద్మాక్షి సహస్రని ఓదార్చుతుంది. ఇంతలో డాక్టర్ వస్తే అందరూ డాక్టర్ దగ్గరకు వెళ్లి విహారి కండీషన్ అడుగుతారు. దాంతో డాక్టర్ మిరాకిల్ జరిగిందని విహారి ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవుతున్నాడని ఎవరో అతని కోసం బలంగా కోరుకున్నారని చెప్తాడు. అందరూ సంతోషిస్తారు. యమున డాక్టర్‌కి దండం పెట్టి నా కొడుకుని కాపాడారు డాక్టర్ అంటే దానికి డాక్టర్ లక్ష్మీని చూపించి టైంకి తీసుకొచ్చి రక్తం ఇచ్చి లక్ష్మీ విహారిని కాపాడిందని చెప్తారు. విహారికి స్ఫ్రుహా రావడంతో అందరూ లోపలికి వెళ్తారు. అంబిక విహారిని చూసి నీతో సంతకాలు పెట్టించి నిన్ను శవంలా చూస్తా అనుకున్నా కానీ ఇలా చూస్తాను అనుకోలేదు అనుకుంటుంది.
విహారిని అందరూ పలకరిస్తే విహారి మాత్రం లక్ష్మీ గురించి అడుగుతాడు. దాని గురించి ఇప్పుడు ఎందుకు అని అందరూ అంటే లక్ష్మీ వల్లే బతికానని అంటాడు. లక్ష్మీ లేకపోయి ఉంటే ఈ పాటికి నా శవాన్ని చూసేవాళ్లు అని అంటాడు. నీకు బులెట్ తగలడం ఏంటి? నువ్వు హైదరాబాద్‌లో ఉండటం ఏంటి అని పద్మాక్షి అడుగుతుంది. దాంతో విహారి నేను ఢిల్లీకే వెళ్లలేదు.. వెళ్తుంటే నన్ను కిడ్నాప్ చేశారని విహారిని కిడ్నాప్ చేయడం నుంచి లక్ష్మీ తనని కాపాడటం వరకు అంతా అందరితో చెప్తాడు. ఇక విహారి పండుతో లక్ష్మీని తీసుకురమ్మని చెప్తాడు. పండు వెళ్లి లక్ష్మీని పిలుస్తాడు. సహస్ర నేను వెళ్లి తీసుకొస్తా అని అంటుంది.
పండు లక్ష్మీని పిలిస్తే వద్దు సహస్రమ్మ ఊరుకోదు అని అంటుంది. లక్ష్మీ వస్తుంటే సహస్ర ఎదురెళ్లి ఎక్కడికే నువ్వు లోపలికి వెళ్లావు అంటే నేను చేయి కోసుకొని చచ్చిపోతా అని ఆపరేషన్ కత్తి పట్టుకొని బెదిరిస్తుంది. దాంతో లక్ష్మీ రాదు. విహారి సహస్ర వాళ్లకి లక్ష్మీ గురించి అడిగితే లక్ష్మీ లేదు అని చెప్తుంది. పండు కూడా లక్ష్మీ లేదని చెప్తాడు. ఇక నర్సు వచ్చి అందర్ని బయటకు పంపి విహారికి ఆక్సిజన్ మాస్క్ పెడతారు.
అంబిక సుభాష్‌ని కలిసి లాగిపెట్టి కొడుతుంది. విహారి మొత్తం తవ్వితే ఏం జరుగుతుందో అర్థమవుతుందా.. లక్ష్మీ గురించి తెలుసుకదా అది విహారిని కాపాడింది. మళ్లీ మళ్లీ ఇలాంటి ఛాన్స్ వస్తుందా అని ప్రశ్నిస్తుంది. ఇక హాస్పిటల్‌లో ఉండటం మంచిది కాదు అని సుభాష్‌ని పంపేస్తుంది. లక్ష్మీ విహారిని చూడాలి అని ఉందని అనుకుంటుంది. ఎలా చూడాలి అని అనుకుంటూ నర్స్ గెటప్ వేసుకొని విహారి గదిలోకి వెళ్తుంది. విహారిని చూసేశా కదా వెళ్లిపోతా అని లక్ష్మీ అనుకుంటే విహారి చూసి చేయి పట్టుకుంటాడు. నువ్వు ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది కనకం. నాకు తెలుసు మా వాళ్లు నీకు రానివ్వరు అని అంటాడు. నీతో ఒక విషయం చెప్పాలి కనకం అని విహారి పడుకుండి పోతాడు.
విహారి పడుకోవడం చూసిన లక్ష్మీ దగ్గరకు వెళ్లి విహారి నుదిటి మీద ముద్దు పెడుతుంది. తర్వాత వెళ్లి గెటప్ విప్పేసి వెయిటింగ్ హాల్‌లో కూర్చొంటుంది. పోయిన వంద కోట్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పక్కన ఇద్దరు పిల్లలు ఆడుకోవడం చూసి వాళ్లు క్లేతో ఆడుకుంటూ వీటిమీద నీ వేలిముద్రలు ఉంటాయి అని అనుకుంటారు. ఆ మాటలు విన్న లక్ష్మీకి తన వేలిముద్రలు కూడా అలాగే తీసుకొని ఉంటారని అనుకొని వెంటనే ఎస్‌ఐకి కాల్ చేస్తుంది. విహారికి జరిగిన ప్రమాదం గురించి చెప్తుంది. సహస్ర లక్ష్మీ ఫోన్‌లో మాట్లాడటం చాటుగా వింటుంది. ఇక తన ఫ్రింగర్ ఫ్రింట్స్ ఎవరో తీసుకొని హ్యాకర్‌కి ఇచ్చారని నా అనుమానం చెప్తుంది. దాంతో సహస్ర షాక్ అయిపోతుంది. ఎస్ఐ హ్యాకర్‌ని పట్టుకోవడానికి లక్ష్మీని ఓ చోటుకి రమ్మని అంటుంది. సహస్ర తనని బెదిరిస్తున్నవాడిని చూసి వాడి అంతు తేల్చాలని అనుకుంటుంది. ఇక లక్ష్మీ పండుకి కాల్ చేసి రిసెప్షన్ దగ్గరకు రమ్మని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!