Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయం అందరికీ తెలుస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీని పొద్దున్న కూడా చూశాను కదా అని పద్మాక్షి అంటుంది. అంబిక భక్తవత్సలాన్ని పిలిచి ముగ్గురు ఆడపిల్లల్ని వదిలేసి వదిన, విహారిని కూడా వదిలేసి ఇంట్లో అందరినీ వదిలేసి ఆ లక్ష్మీ పేరున 200 ఎకరాలు రాశావు కదా.. అది చక్కగా టైం చూసుకొని 200 ఎకరాలతో చెక్కేసిందని అంబిక అంటుంది. 

Continues below advertisement

నిజం తెలిసిన కావేరి అంబిక మాటలకు ఏడుస్తుంది. అంబికతో భక్తవత్సలం లక్ష్మీ గురించి అలా అనొద్దని అంటాడు.  లక్ష్మీ చేసిన బాగోతం ఇంత క్లియర్‌గా ఉంటే ఇంకా దానికి సపోర్ట్ చేస్తావేంటి అని అంబిక ప్రశ్నిస్తుంది. ఇంట్లో అందరూ మా లక్ష్మీ అది మా లక్ష్మీ ఇది అంటారు ఇప్పుడేమైంది అని అడుగుతుంది. దానికి భక్తవత్సలం కూతురితో లక్ష్మీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.. నీకే కాదు ఎవరికీ లేదు.. ఎందుకంటే లక్ష్మీ 200 ఎకరాలతో పారిపోయింది అంటున్నావ్ కదా.. మీకు తెలియని విషయం ఏంటంటే లక్ష్మీ నాకు ఆ రెండు వందల ఎకరాలు రాసేశాను అని చెప్తేనే నేను ఈ ఊరు వచ్చాను అని భక్తవత్సలం అంటారు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. 

లక్ష్మీ ఫోన్ చేసి 200 ఎకరాలు నాకు రాసేసి డాక్యుమెంట్స్ నా గదిలో పెట్టానని.. ఇక ఆ పొలాలు ఎవరూ తీసుకోరని చెప్పింది. అందుకే ఇంత హడావుడిగా నేను వచ్చా.. ఏమైందని అడుగుదామని అనుకుంటే లక్ష్మీ లేదు అని భక్తవత్సలం చెప్తారు. లక్ష్మీని మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం అని యమున అంటుంది. లక్ష్మీ ఎప్పటికీ మనకు అపకారం చేయదు అని చెప్తుంది. వసుధ విహారితో ముందు లక్ష్మీని వెతుకుదామని అంటుంది. 

Continues below advertisement

విహారి కావేరితో లక్ష్మీ ఎప్పుడు బయటకు వెళ్లిందో చూశావా అని అడుగుతాడు. లేదని కావేరి చెప్తుంది. నేను వెళ్లి లక్ష్మీని వెతికి తీసుకొస్తా అని విహారి బయటకు వెళ్తాడు. లక్ష్మీ కోసం విహారి రాత్రి అయినా సరే వెతుకుతూ ఉంటాడు. లక్ష్మీ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. చివరకు ఓ గుడి దగ్గరకు చేరుకుంటుంది. గుడిలో కూర్చొని విహారిని గుర్తు చేసుకొని బాధ పడుతూ ఉంటుంది. ఇక లక్ష్మీ ఉన్న చోటుకే విహారి వస్తాడు. లక్ష్మీ చలికి వణుకుతూ ఉంటే అమ్మవారి జెండా ఎగిరి లక్ష్మీ దగ్గర పడుతుంది. లక్ష్మీ దాన్ని తీసుకొని కప్పుకుంటుంది. 

విహారి అమ్మవారి ముందుకు వచ్చి గంట కొట్టి అమ్మా ఆ రోజు కనక మహాలక్ష్మీని నీ కూతురిగా దత్తత తీసుకున్నావ్ కదా మరి నీ కూతురికి ఇన్ని కష్టాలు ఇస్తున్నావ్.. తను ఏం పాపం చేసిందని ఇన్ని సమస్యలు ఇస్తున్నావ్.. తనకి దేవతలు కూడా సాయం చేయలేకపోతున్నారు.. అందుకే తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు., ఎలా కష్టాలు ఎదుర్కోవాలో అర్థం కాక నా నుంచి దూరంగా వెళ్లిపోయిందమ్మా,, ఇప్పుడు నా కనక మహాలక్ష్మీ ఎక్కడుంది.. అని విహారి గంట కొడతాడు. లక్ష్మీకి ఏం జరిగినా ఆ పాపం నాదే తల్లి.. అందులో నీకు కూడా భాగం ఉంది.. నువ్వు కనికరించి లక్ష్మీ ఆచూకీ చూపించిన వరకు గంట కొడుతూనే ఉంటా  అని విహారి ఆపకుండా గంట కొడుతూనే ఉంటాడు. 

గంట సౌండ్ విని లక్ష్మీ చూస్తుంది. విహారి గంట కొట్టడం చూసి చాలా బాధ పడుతూ ఏడుస్తుంది.. విహారి చేతికి రక్తం కారుతూ ఉంటుంది. విహారి మనసు లక్ష్మీ తనకు దగ్గర్లో ఉందని చెప్తుంది. దాంతో విహారి మొత్తం చూస్తాడు. నా కనకం ఇక్కడే ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది. నా కనకానికి ఎక్కడున్నా ఏం కాకూడదు.. తనకి ఏం అపాయం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అమ్మ,, తనకు ఏమైనా అయితే పోయేది ఒక ప్రాణం కాదు.. రెండు ప్రాణాలు అని గుర్తు పెట్టుకో అని విహారి అంటాడు. విహారి లక్ష్మీ రాసిన లెటర్ పట్టుకొని లక్ష్మీ వెళ్లాలి అనుకుంటే మామూలుగా వెళ్లొచ్చు కదా ఇలా రిజైన్ చేసి వెళ్లడం ఏంటి అంటే కచ్చితంగా అంబిక అత్తయ్య దీని వెనక ఉంటుంది అని అనుకుంటాడు. ఆలోచిస్తూ కోపంగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మీ కూడా నేను ఇంటి నుంచి బయటకు వస్తే ఎవరికి ఉపయోగం అని ఆలోచించి అంబికమ్మ కదా అని అనుకుంటుంది. అంబికమ్మ అయితే కావేరిని పావుగా వాడుకోదు.. ఏదైనా డైరెక్ట్‌గా చేస్తుంది. మరి అంబికమ్మ కాకుండా ఎవరు ఉన్నారు అని ఆలోచించి అమ్మిరాజు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.