Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమునకు సహస్ర కంటే ముందు లక్ష్మీ పూజ చేసినట్లు అనుమానం వస్తుంది. కానీ ఎవరికీ చెప్పకుండా సహస్రతో పూజ చేయిస్తుంది. ఇక అంబిక సిద్ధార్థ్ తనని ఇబ్బంది పెడుతున్నాడని ఎలా అయినా వాడి అంతు చూసుకోవాలని అనుకుంటుంది. 

చారుకేశవ క్లే గురించి అంబిక దగ్గర మాట్లాడితే అంబిక క్లే ఆర్డర్ చేసిందో లేదో తెలిసిపోతుందని అనుకుంటాడు. కావాలనే క్లే గురించి మాట్లాడుతాడు. అంబిక పెద్దగా రియాక్ట్ అవ్వదు. ఏదో సీబీఐ ఆఫీసర్‌లా ఎంక్వైరీలు చేసేస్తున్నావ్ కానీ నీకు అంత లేదు బావ అంత తెలివే ఉంటే ఇళ్లరికం అల్లుడివై అత్తింటిలోనే  దొంగతనం చేయవు అని అంబిక అంటుంది. దానికి చారుకేశవ నేను నయం అత్తింట్లో దొంగతనం చేస్తున్నా కానీ కొందరు పుట్టింటిలోనే తోడపుట్టిన వాళ్ల ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తున్నారని అంటాడు. అంబిక నీ గురించి ఎవరికీ తెలీకపోయినా ఒక దొంగ గురించి మరో దొంగకే తెలుస్తుందని అంటాడు. అంబిక కోపంగా వెళ్లిపోతుంది. 

ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. అక్కడికి సహస్ర వస్తుంది. వసుధ భోజనానికి పిలిస్తే యమున వసుధతో ఈ రోజు తను ఉపవాసం సాయంత్రం తన భర్త చేతుల మీదగా ప్రసాదం తినేవరకు ఏం తినదు అంటుంది. ఇక సహస్ర ఉండలేను అనుకుంటూ గదిలోకి వెళ్లి చాక్లెట్ నోట్లో పెట్టుకుంటుంది. అప్పుడే అంబిక, పద్మాక్షిలు అక్కడికి వస్తారు. ఏంటే ఆకలేస్తుందా అని అడుగుతారు. సహస్ర నోట్లో చాక్లెట్ ఉండటంతో ఊ.. ఊ అంటుంది. నా కూతురు ఎంత దీక్షగా చేస్తుందో అనుకుంటుంది. 

లక్ష్మీ వచ్చి అందరికీ వడ్డిస్తుంది. పండు యమునకు తినమని అంటే ఆకలి వేయడం లేదు అని అంటుంది. యమునకు అనుమానం వస్తుంది. ఇక యమున సహస్రన దగ్గరకు వెళ్లి విహారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి రామ్మా అంటుంది. మరోవైపు వసుధ లక్ష్మీని పిలిచి విహారి ఎక్కడున్నాడు నిన్ను ఆశీర్వదించాలి అంటుంది. అందరూ ఉన్నారు కదా ఎలా ఆశీర్వదిస్తారు అని లక్ష్మీ అంటుంది. ఇంతలో చారుకేశవ వస్తాడు. ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. చారుకేశవ ప్లాన్ సూపర్ అనుకుంటారు. 

లక్ష్మీ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే వసుధ విహారిని పిలిచి సహస్రకు ఆశీర్వాదం ఇవ్వాలని వదిన పిలిచిందని పిలుస్తుంది. లక్ష్మీ దండం పెట్టుకోవడం యమున చూస్తుంది. వసుధ పడిపోయినట్లు నటించి అక్షింతల ప్లేట్ విహారికి ఇస్తుంది. ఇంతలో చారుకేశవ విహారిని నెట్టి లక్ష్మీ మీద అక్షింతలు పడేలా చేస్తాడు. విహారి కూడా లక్ష్మీ మీద అక్షింతలు వేస్తాడు. యమున అదంతా చూసి షాక్ అయిపోతుంది. విహారిని కిందకి పిలుస్తుంది. లక్ష్మీ తల మీద అక్షింతలు చూసి సహస్ర ఏంటా అనుకుంటుంది. యమున విహారితో సహస్రని ఆశీర్వదించమని అంటాడు. 

వసుధని యమున అక్షింతలు తీసుకురమ్మని చెప్తుంది. విహారి సహస్రని ఆశీర్వదించే టైంకి పద్మాక్షి ఇళ్లంతా అక్షింతలు చూసి ఏయ్ లక్ష్మీ అంటుంది. దాంతో విహారి సహస్ర మీద వేయాల్సిన అక్షింతలు కింద పడేస్తాడు. సహస్ర షాక్ అయిపోతుంది. ఆ అక్షింతలు పై నుంచి పడ్డయని వసుధ అంటుంది. క్లీన్ చయమని పద్మాక్షి అంటుంది. వసుధ లక్ష్మీని గుడికి పంపి పండుతో క్లీన్ చేయిస్తా అంటుంది. యమున మనసులో సహస్ర చేయాల్సిన పనులు అన్నీ లక్ష్మీ చేస్తుంది అందుకే విహారి కూడా దాని వైపు వెళ్లిపోతున్నాడు. ఇప్పుడే దీనికి ముగింపు పలకాలి అనుకుంటుంది. పద్మాక్షితో సహస్రతో ముత్తుయిదువులు వస్తారు వాయినం ఇప్పించమని చెప్పి తనకు పని ఉందని బయటకు వెళ్తుంది. 

లక్ష్మీ గుడి దగ్గరకు వెళ్లి వాయినం ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇంతలో యమున అక్కడికి వెళ్తుంది. మీరేంటి అమ్మగారు ఇలా అని లక్ష్మీ అడుగుతుంది. యమున కోపంగా చూస్తుంది. నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నావా అంటే లక్ష్మీ లేదు అంటుంది. ఇప్పటివరకు నన్ను వంచన చేసింది చాలు.. నన్ను పిచ్చిదాన్ని చేసింది చాలు.. ఇప్పటికైనా నీ భర్త గురించి నిజం చెప్పు అని అంటుంది. మీకు తెలుసు కదామ్మా నా భర్త నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడున్నాడో తెలీదు అంటుంది. నా కళ్లలోకి చూసి నిజం చెప్పు లక్ష్మీ అని యమున అరుస్తుంది. నమ్మంచి మోసం చేస్తారు. నటించి ద్రోహంచేస్తారు కానీ నువ్వు రెండు చూశాను. నేనేం చేయలేదు అని లక్ష్మీ అంటే అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు నేను చచ్చినంత ఒట్టు నిజం చెప్పు అని యమున అంటుంది. లక్ష్మీ ఏడుస్తుంది. నువ్వు చెప్పువు నాకు తెలుసు ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా నువ్వు చెప్పవు నాకు తెలుసు అని అంటుంది యమున. లక్ష్మీ యమునతో మీరు ఒత్తిడికి గురవొద్దు మీ ఆరోగ్యం బాలేదు అంటే నాకు అనారోగ్యం వచ్చిందేనీవల్ల అని అంటుంది. సరే నువ్వు చెప్పవు కదా నేను చెప్తా నువ్వు విను నీ మెడలో తాళి కట్టింది నా కొడుకు విష్ణు విహారి అని యమున అంటుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.