kalavari kodalu kanaka mahalakshmi serial today April 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌తో విహారిని బెదిరించిన అంబిక, సుభాష్! యమున అరెస్ట్‌ని విహారి అడ్డుకుంటాడా!
kalavari kodalu kanaka mahalakshmi today April 8th భుజంగం గురించి లక్ష్మీ, విహారి మాట్లాడుకుంటూ ఉంటే యమున, సహస్ర వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

kalavari kodalu kanaka Mahalakshmi serial today episode సహస్ర ఫుల్లుగా తడిచిపోయి నీరసంగా రావడం చూసి అందరూ ప్రశ్నిస్తారు. దాంతో తను గుడికి వెళ్లి స్వామీజీ చెప్పినట్లు దోష నివారణ పూజ చేసి వచ్చానని.. మీకు చెప్తే జ్వరం ఉన్న నన్ను వెళ్లనివ్వరు అని ఇలా చెప్పకుండా వెళ్లానని అంటుంది. ఈ ఇంటి వారసుడి కోసం చాలా సాహసం చేశావమ్మా నువ్వు అని యమున అంటుంది. అంబిక విహారితో సహస్ర ఇంటి వారసుడిని కాపాడుకోవడానికి ఎంత కఠినమైన దీక్ష చేసిందో చూశావా అని అంటుంది. తడి బట్టలతో ఎక్కువ సేపు ఉండకూడదు అని సహస్రని పద్మాక్షి వాళ్లు తీసుకెళ్తారు.
అంబిక ఫోరెనిక్స్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటే.. సుభాష్ అంబికతో అప్పుడెప్పుడో జరిగిన ఈ రిపోర్ట్స్‌తో ఇప్పుడు మీ వదినను అరెస్ట్ చేయిస్తే మనకి ఏం వస్తుందని అడుగుతాడు. లక్ష్మీ విహారిల ప్రాణాలు మా వదిన దగ్గర ఉన్నాయి.. మా వదినని ఇప్పుడు అరెస్ట్ చేయిస్తే వదిన్ని ఎలా బయటకు తీసుకురావాలా అని నానా తంటాలు పడతారు. వీటితో విహారి, లక్ష్మీలను ఓ ఆట ఆడుకోవాలి అని అంబిక చెప్తుంది. వెంటనే విహారికి సుభాష్‌తో ఫోన్ చేయిస్తుంది. విహారి ఫోన్ చేసింది భుజంగమే అనుకొని రేయ్ ఇప్పుడు మళ్లీ ఎందుకు కాల్ చేశావ్‌రా.. మళ్లీ ఏం ప్లాన్ చేశావ్.. నా మీద నీకు ఎందుకు ఇంత పగరా అని అడుగుతాడు. దానికి సుభాష్ ఇప్పటి వరకు జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే ఇప్పుడు అసలు ఆట ఉందిరా అని అంటాడు. దానికి విహారి నువ్వు నాకు దొరకకూడదు అని మొక్కుకోరా.. దొరికితే నిన్ను వదలను అంటాడు. ఈ మాటలు పక్కన పెట్టు కానీ నీకు మరో ఆట మొదలైందిరా.. మీ అమ్మ విషయంలో నేను ఏం చేయబోతున్నానో నీకు ఓ క్లూ పంపిస్తా ఒక సారి చూడరా అని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ పెడతాడు. విహారి వాటిని చూసి షాక్ అయిపోతాడు. నువ్వేం చేయబోతున్నావ్‌రా అంటే రేపు ఉదయమే మీ అమ్మని అరెస్ట్ చేయిస్తున్నా ఏం చేస్తావో చేసుకోరా అని అంటాడు.
విహారి ఆలోచించి రేపు ఉదయం పోలీసులు వచ్చి అమ్మని అరెస్ట్ చేసేలోపు యాంటిసిపేటరీ బెయిల్( ముందస్తు బెయిల్) ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే అమ్మని అరెస్ట్ చేయకుండా కాపాడుకోవాలని అనుకుంటాడు. ముందే చెప్పడం వల్ల జాగ్రత్త పడతాడు కదా అని సుభాష్ అంటే వాడు ఏం చేసినా రేపు మా వదిన అరెస్ట్ అవుతుంది.. వదినను ఎలా బయటకు తీసుకురావాలా అని విహారి, లక్ష్మీ టెన్షన్ పడుతూ ఉంటారు ఆ టైంలో వాళ్లని బిజినెస్ నుంచి ఎలా బయటకు గెంటేయాలా అని మనం ఆలోచించొచ్చు అని అంటుంది.
విహారి ఆలోచిస్తూ ఉంటే లక్ష్మీ వచ్చి యమునమ్మ విషయంలో మీరు చాలా కంగారు పడుతున్నారు కదా..అని అంటుంది. అవును కనకం అమ్మకి ప్రేమించడం తప్ప ఇంకేం తెలీదు.. అలాంటి అమ్మని ఆ భుజంగం అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు.. ఏది ఏమైనా అమ్మని అరెస్ట్ చేయకుండా ఆపాలి.. ఆ భుజంగాన్ని ఎలా అయినా పట్టుకోవాలి అని అంటాడు. మనిద్దరం కలిసి వాడిని ఎలా అయినా పట్టుకుందాం అని లక్ష్మీ అంటుంది. విహారి లక్ష్మీని హగ్ చేసుకొని సమస్య వచ్చిన ప్రతీ సారి నువ్వు నా వెనక నిల్చొంటావ్ కానీ నేను నీకు ఎప్పుడూ సాయం చేయలేకపోతున్నా అని అంటాడు. భుజంగం గురించి లక్ష్మీ,విహారి మాట్లాడుతూ ఉంటే కింద నుంచి యమున, పై నుంచి సహస్ర మొత్తం వింటారు. భుజంగం వల్లే నువ్వు నా భార్యవి అని చెప్పలేకపోయా.. వాడు అమ్మని అరెస్ట్ చేయిస్తాడు అంటుంటే వాడిని ఏమీ చేయలేకపోతున్నా అని ఉక్రోషం పెరిగిపోతుందని అంటాడు. ఆ మాటలు విని యమున కన్నీరు పెట్టుకుంటుంది.
భుజంగం ఎవరో మనకు పనికి వచ్చేలా ఉన్నాడు.. వాడు లేకపోయి ఉంటే ఈ పాటికి నాకు మా బావ దూరం అయిపోయేవాడు.. వాడు ఎవడో తెలుసుకొని లక్ష్మీని బావ జీవితం నుంచి గెంటేయాలి అని సహస్ర అనుకుంటుంది. యమున ఏడుస్తూ వచ్చి విహారిని తప్పుగా అర్థం చేసుకున్నా అని ఏడుస్తుంది. అప్పుడే విహారి వచ్చి తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తాడు. ఏమైందని యమున కంగారు పడుతుంది. ఏమైందని అడుగుతుంది. నాకు నేను అసమర్ధుడిలా కనిపిస్తున్నాను అమ్మా అని విహారి చెప్తే అలా అంటావేంటి నాన్న నువ్వు అసమర్థుడివి కాదు అని యమున చెప్తుంది. అలా కాదమ్మా వాడేవడో పాతికేళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తీసి నిన్ను టార్గెట్ చేస్తుంటే నేను ఏం చేయలేకపోతున్నా.. వాడిని పట్టుకోలేకపోతున్నా అని అంటాడు. వాడు దొరుకుతాడు నువ్వు అధైర్య పడకు అని యమున అంటుంది. యమున విహారికి ధైర్యం చెప్తుంది. నిన్ను పరీక్షిస్తున్నా కాలమే నీకు అనుకూలంగా మారుతుందని అంటుంది. యమున విహారి వెళ్లిన తర్వాత చాలా ఏడుస్తుంది. నా కొడుకు జీవితం ,లక్ష్మీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు


















