జానకి పార్కులో కూర్చుని చదువుకుంటూ ఉంటే రామ పక్కనే బొమ్మల పుస్తకం పట్టుకుని చూస్తూ నవ్వుతాడు. అందులో ఏముందో చూసి జానకి మొహం బాధగా పెడుతుంది. ఐపీఎస్ లక్ష్యం కోసం రామ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. నిజమే జానకి పరిస్థితులు పగబట్టి నిన్ను పాతాళానికి తొక్కేసి ఒడిపోయేలా చేయాలని చూస్తుంది. ప్రాణం పోయినప్పుడే యూనిఫాం వదిలేస్తాను. నువ్వే గెలుస్తావ్ రామ చెప్పిన మాటలు గుర్తు చేసుకో అన్యాయానికి ఎదురెళ్ళాలని అనుకుని ఇంటికి వస్తుంది. గదిలో జ్ఞానంబ మంచం మీద స్పృహ లేకుండా పడి ఉంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అది చూసి ఏమైందని అడుగుతుంది. మా ఇద్దరి మీద కంటే నీమీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు కదా అందుకు మంచి బహుమతి ఇచ్చావు. ఆవిడ మూసిన కళ్ళు తెరవకుండా పడి ఉండటానికి కారణం నువ్వేనని మల్లిక జానకిని తిడుతుంది.
Also Read: దివ్య గురించి విక్రమ్ మనసులో విషబీజం నాటిన రాజ్యలక్ష్మి- మళ్ళీ ఫస్ట్ నైట్ గోవింద
డాక్టర్ గోవిందరాజులను మాట్లాడాలని చెప్పి బయటకి రమ్మంటుంది. ఇలా ఎన్నాళ్ళు ఆవిడని సెలైన్ బాటిల్ తో రక్షించుకుంటారు. మెడిసిన్ మానేసిందని చెప్తున్నారు. తిండి మానేసి ఒక విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారని డాక్టర్ చెప్తుంది. ఎంత చెప్పినా ఆవిడ మాట వినడం లేదని అంటాడు. అయితే మీరే ఆవిడ మాట వినండి, దేని గురించో బెంగ పెట్టుకున్నారు అది తెలుసుకుని తీర్చకపోతే ఆవి హెల్త్ పాడైపోతుంది. బతకడం కష్టం జాగ్రత్త పదండని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ మాటలకు గోవిందరాజులు కుప్పకూలిపోతాడు. రామ కోర్టు దాకా వెళ్తే బతకనని తన నిర్ణయం తీసుకుంది మరి నేను ఏమైపోవాలి నా గురించి ఆలోచించదా, జ్ఞానం నాకు తోడు లేకపోతే పిచ్చి వాడిని అయిపోతాను బతకలేనని బాధపడతాడు. అత్తయ్యకి ఏమి కాదు ఆరోగ్యం బాగుపడుతుందని ధైర్యం చెప్పేందుకు చూస్తుంది.
తన భార్యని కాపాడమని వేడుకుంటాడు. నిన్ను బలవంత పెట్టడం లేదు నీ మనసు ఒప్పుకుంటేనే నేను అడిగింది చెయ్యి మీ అత్తయ్యలాగా మొండిగా ఉండలేనని చెప్తాడు. కర్తవ్యం కోసం నిలబడితే ఇంట్లో వాళ్ళకి రాక్షసి అవుతున్నా అలాగని యూనిఫాంకి న్యాయం చేయలేకపోతున్నానని జానకి బాధపడుతుంది. మల్లిక జానకిని తిడుతుంటే జెస్సి ఎప్పటిలాగా వెనకేసుకొస్తుంది. ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా జానకి వచ్చి ఏమైందని అడుగుతుంది. అత్తయ్య ఈ దుస్థితికి కారణం జానకి అన్నాను అది తప్పా అని మల్లిక అంటుంది. అత్తయ్య ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకని జానకి చెప్తుంది. కానీ మల్లిక మాత్రం మాటలు అనడం ఆపదు. అత్తయ్య దగ్గర తను ఉంటానని చెప్పి ఇద్దరినీ వెళ్లిపొమ్మని చెప్తుంది.
Also Read: కోడలి హోదాలో భోగాలు అనుభవించమన్న అపర్ణ- అత్తకి ఫ్యూజులు ఎగిరిపోయే షాకిచ్చిన కావ్య
జ్ఞానంబ కాళ్ళు నొక్కుతుంటే నన్ను ముట్టుకోకని లాగేసుకుంటుంది. తినడం ఎందుకు మానేస్తున్నారని అడుగుతుంది. నువ్వు అడిగే హక్కు పోగొట్టుకున్నావని తిడుతుంది. రామ ఇంటికి వచ్చే వరకు ఎవరి మాట విననని జ్ఞానంబ తెగేసి చెప్తుంది.