జ్ఞానంబ ఇంటికి జెస్సి తల్లిదండ్రులు పీటర్ మేరీ వస్తారు. మా ఇంట పెళ్లి జరిగితే నాన్ వెజ్ తో విందు భోజనం ఏర్పాటు చేస్తాం.. కానీ వాళ్ళ పెళ్లి అనుకోకుండా జరిగింది కాబట్టి రిసెప్షన్ ఏర్పాటు చేయలేక ఇక్కడికే రకరకాల నాన్ వెజ్ వంటకాలు చేసి తీసుకుని వచ్చామని పీటర్ చెప్తాడు. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. తెచ్చిన వంటకాలు పేర్లు వింటేనే పరవశించిపోతుంది కానీ తినడానికి మా పోలేరమ్మ ఒప్పుకోదని మల్లిక మనసులో అనుకుంటుంది. వదినగారు నాన్ వెజ్ లో మీకు ఏ వంటకాలు ఇష్టమని మేరీ అడుగుతుంది. జ్ఞానంబ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నా కూతుర్ని కడుపులో పెట్టుకుని చూసుకోండి అని మేరీ అడుగుతుంది. ఆ వంటకాలు సంచి ఇంట్లో పెట్టమని ఇస్తుంటే మల్లిక ఆత్రంగా తీసుకుంటుంటే జ్ఞానంబ గుర్రుగా చూస్తుంది.
జానకి వాళ్ళకి తెలియదు కాబట్టి మన ఇంట్లో అనుమతి లేని తిండి పదార్థాలు తీసుకుని వచ్చారు ఇంకోసారి అలాంటివి తీసుకురావద్దని చెప్పమని జ్ఞానంబ గట్టిగా చెప్తుంది. వాటిని తీసుకెళ్ళి బయట పారేయమని చెప్తుంది. ఈ ఒక్కసారికి వీటిని తినడానికి అనుమతించండి అని మల్లిక అడుగుతుంది. అందుకు జ్ఞానంబ మాత్రం ఒప్పుకోకుండా కోపంగా చూడటంతో నేనే వాటిని స్వయంగా బయటపడేస్తాను అని మల్లిక తీసుకుని వెళ్ళిపోతుంది. జెస్సి మాత్రం అది చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మల్లిక వాటిని పక్కకి తీసుకొచ్చి లాగించేస్తుంది. విష్ణు అది చూసేసరికి వేవిళ్ళ కోరికలు అని కవర్ చేస్తుంది.
Also Read: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో
అత్తయ్యగారిది కోపం కాదు బాధ తన మాట మీరి అబద్ధం చెప్పాడు అని జానకి రామతో అంటుంది. అమ్మ కోపం అంత త్వరగా తగ్గదని రామా అంటాడు. ఉండ్రాళ్ళ తద్ది కాబట్టి ఆ పండగ జరిపించి జెస్సి, అఖిల్ ని అత్తయ్యగారికి దగ్గర చెయ్యాలని జానకి చెప్తుంది. జెస్సికి మన పద్ధతులు అలవాట్లు తెలియదు కాబట్టి ఈ పూజ వల్ల అమ్మ జెస్సిని మరింత దూరం పెడుతుందేమో అని అనిపిస్తుందని రామా చెప్తాడు. దాని వల్ల జెస్సి, అఖిల్ ఇంకా బాధపడటారేమో అంటాడు. అత్తయ్యగారి కోపానికి ఓర్పుతో తప్ప ఇంకేమీ చేయలేము వల్ల పెళ్లి చెయ్యడమే కాదు వాళ్ళని తనకి దగ్గర కూడా చెయ్యాలి అని జానకి సర్ది చెప్తుంది. జానకి వచ్చి ఉండ్రాళ్ళ తద్ది చేద్దామని అడుగుతుంది. కానీ జ్ఞానంబ వద్దని అంటుంది. పండగ అంటే సంతోషంతో జరగాలి కానీ మనసులు బాధపెట్టుకుని కాదు వచ్చిన వాళ్ళు ఊరికే ఉండరు అఖిల్ పెళ్లి గురించి నోరు పారేసుకుంటారు అది నాకు ఇష్టం లేదని జ్ఞానంబ అంటుంది.
తినే నోరు, అనే నోరు ఖాళీగా ఉండదులే జ్ఞానం అని గోవిందరాజులు సర్ది చెప్తాడు. ఏరోజైనా అఖిల్ పెళ్లి గురించి తెలియాల్సిందే కదా అని రామా కూడా చెప్తాడు. పండగ బాగా జరిగితే మనకి కూడా శుభం జరుగుతుందని జానకి అంటుంది. మల్లికా మాత్రం పుల్లలు వేస్తుంది. అత్తయ్యగారు వద్దు మీరు మాట పడితే నేను తట్టుకోలేను సహించలేను అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. జానకి మాత్రం జ్ఞానంబని ఒప్పిస్తుంది. మీ అందరి ఆనందం కాదనలేక ఒప్పుకుంటున్నా కానీ పది మందిలో ఇంటి పరువు పోకుండా చూసుకోమని కొత్తగా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పమని చెప్తుంది. జానకి గోరింటాకు నూరుతుంటే అక్కడికి జెస్సి వస్తుంది. రేపు మన ఇంట్లో పండగ ఉందని చెప్తుంది. ఈ వ్రతం నేను కూడా చెయ్యొచ్చా అత్తయ్య ఒప్పుకుంటారా అని జెస్సి జానకిని అడుగుతుంది.
Also Read: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్