మెట్టినింటిని కూడా పుట్టింటిలా భావించే అలాంటి కోడలు రావడం మీరు చేసుకున్న అదృష్టం పూజరి అనడంతో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మల్లిక మాత్రం రగిలిపోతుంది. పెద్ద కోడలు జానకిని పొగుడుతుంటే తట్టుకోలేకపోతుంది.
తర్వాత అర్చన చేయిస్తానంటూ వాళ్లను గుడిలోకి తీసుకెళ్తాడు పూజారి.
తన కుటుంబం భవిష్యత్, సంతోషం పెద్ద కొడుకు భుజాలపై ఉందని ఆయనకు ఏం కాకుండా చూడమని దేవుణ్ని వేడుకుంటుంది జ్ఞానాంభ.
పూజ అయిన తర్వాత సర్‌ప్రైజ్ అంటూ వేరే ప్రాంతానికి తీసుకెళ్తాడు రామచంద్ర. ఎవరు అడిగినా జానకి రామచంద్ర చెప్పకుండా ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడకు తీసుకెళ్తారు.
రామచంద్ర పోటీల్లో గెలిచిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేస్తున్నట్టు చెబుతారు. సర్‌ప్రైజ్‌లో చేప్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని ఇలా చేసినట్టు రామచంద్ర వివరిస్తాడు.
మీరు ఇచ్చిన డబ్బులతో మీకు చెప్పకుండా ధ్వజస్తంభానికి విరాళం, అన్నదాతకు ఏర్పాటు చేసినందుకు క్షమించమని జ్ఞానాంభను జానకి అడుగుతుంది. అలాంటిదేమీ లేదని ఇలాంటి మంచి పనులు చేయడం అమ్మకు ఇష్టమని.. అలా చేసిన నిన్ను అభిమానిస్తుందని చెప్తారు. జానకిలో జ్ఞానాంభ తనను తాను చూసుకుంటుందని కూడా అంటారు.
అత్తా పెద్ద కోడలు కలిసిపోయారని... తనను మాత్రం కరివేపాకులా తీసేశారని తెగ బాధపడుతుంది మల్లిక. భర్త వచ్చి ఎంత చెప్పినా వినిపించుకోదు. అమ్మ మెచ్చుకునేలా చేస్తానంటూ మల్లికను బోల్తా కొట్టించేందుకు ప్లాన్ చేస్తాడు.
అన్నదానం దగ్గర అంతా ఫ్యామిలీని పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉందని.. దేవుడే దిగి వచ్చి దీవించినట్టు ఉందంటుది జ్ఞానంభ. ఇంతలో విష్ణు వచ్చి... రామచంద్ర గెలిస్తే మొక్కు చెల్లించుకుంటానని చెప్పినట్టు తల్లికి చెప్తాడు. జానకి అన్నదానం చేసింది కాబట్టీ... తనతో ఏ వస్త్రదానమో చేయిస్తారని అనుకుంటుంది. ఏమని మొక్కుకున్నావని అంతా అడుగుతారు. ఇంతలో విష్ణు కలుగజేసుకొని..కోనేటి నుంచి 108 బిందెలు నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తానని మొక్కుకుందని చెప్తాడు. ఇది విన్న మల్లికతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అవుతారు. మొక్కు చెల్లించాలని మల్లికను విష్ణు అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆమె బిందెలతో జలాభిషేకం చేస్తుంటే అంతా నిలబడి చూస్తుంటారు. మధ్యలో లెక్క తప్పించే ప్రయత్నం కూడ చేస్తుంది... విష్ణు మాత్రం ఆమెను వదలడు.
Also Read: రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో, ఇకపై ఇద్దరు శత్రువులు అని రగిలిపోతున్న జ్వాల
మన కుటుంబం చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా ఉందని... ఏదో పండగ వచ్చినంత సంబంరంగా ఉందని... రామా గెలుపే దీనంతటికీ కారణమని అంటుంది. ఈ సంతోషం ఇలాగే ఉండాలని దేవుణ్ని కోరుకుంటున్నట్టు చెబుతుంది జ్ఞానాంభ.
కారు తీసుకురావడానికి రామచంద్ర బయటకు వెళ్తాడు. కుంకుమ తీసుకురావడానికి జ్ఞానకి గుడిలోపలికి వెళ్తుంది.
గుడిలో వస్తున్న టైంలో దారిలో కరెంట్ తీగ తెగి పడి ఉంటుంది. దాన్ని చూసిన జానకి కర్రతో ఆ తీగను తప్పిస్తుంది. అలా తప్పించే క్రమంలో అక్కడే ఉన్న మెట్లపై పడిపోతుంది. స్పృహ తప్పి పడిపోయిన జానకిని ఫ్యామిలీ మెంబర్స్ అంతా లేపే ప్రయత్నం చేస్తారు.