Jagadhatri November 29th Episode: ఈరోజు ఎపిసోడ్ లో నువ్వు ఎందుకు అలా మూడిగా ఉన్నావు, నువ్వు మూడీగా ఉంటే అమ్మ కూడా మూడిగా ఉంటుంది ఏం కావాలో చెప్పు అని కీర్తిని అడుగుతుంది కౌషికి.


కీర్తి: బర్త్ డే పార్టీకి నాన్నని రమ్మని పిలువు.. ఫ్రెండ్స్ అందరూ ఎందుకు మీ నాన్న పార్టీలకు రారు అని అడుగుతున్నారు అని సైగల ద్వారా చెప్తుంది.


కౌషికి: మీ నాన్న ఇక్కడికి రాకపోవడమే మంచిది మనకి ఇంతమంది ఉన్నారు కదా, నీకు నేను నాకు నువ్వు చాలు, ఆ మనిషి వద్దు అని సైగల ద్వారా చెప్తుంది.


అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి వాళ్లిద్దరిని చూసి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది.


కౌషికి: పార్టీకి తన తండ్రిని పిలవమని చెప్తుంది.


వైజయంతి: మీరు మీరు పార్టీలకి పండగలకి పిలుచుకుంటూ దగ్గరైతే మేము చూస్తూ ఊరుకుంటామా అని మనసులో అనుకొని మీ నాన్న మంచివాడు కాదు, డబ్బు మనిషి అలాంటి వాడు పార్టీకి రాకూడదు అని చెప్పి కూతుర్ని తీసుకొని త్వరగా కిందికి రమ్మని కౌషికి చెప్పి వెళ్ళిపోతుంది.


కిందికి వచ్చిన కీర్తి మూడీగా ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతుంది ధాత్రి.


కీర్తి: నాన్నని పార్టీకి పిలవమంటే అమ్మ వద్దంటుంది అని సైగలతో చెప్తుంది.


అప్పుడు కేదార్ ని కీర్తి దగ్గర ఉండమని చెప్పి కేదార్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్లి సురేష్ కి ఫోన్ చేస్తుంది.


సురేష్: నా కూతురు పుట్టిన రోజు నాకు గుర్తు లేకపోవడమేమిటి.. కేక్ తీసుకొని వస్తున్నాను.


ధాత్రి: మొన్న చేసినట్లుగా ఇప్పుడు కూడా గొడవ చేస్తారేమో.


సురేష్: నా కూతురు నేను రాకపోతే సంతోషంగా ఉండదు, నా కూతురు కోసం నేను ఎన్ని అవమానాలు అయినా భరిస్తాను.


ధాత్రి : మీరు రండి ఇక్కడ ఎలాంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్లి ఇదే విషయాన్ని కీర్తికి చెప్తుంది. కీర్తి హ్యాపీగా ఫీల్ అవుతుంది.


కేదార్: ఏదైనా కుటుంబ సభ్యులు ఇచ్చే ధైర్యం ఇంకెక్కడ దొరకదు.


ధాత్రి : నీకు కూడా అలాంటి ఆనందాన్ని అందేలాగా చేస్తాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండేలాగా చూసుకుంటాను.


కేదార్: నువ్వు కూడా ఎప్పటికీ నాతోనే ఉండిపోవచ్చు కదా అంటాడు కానీ ధాత్రికి సరిగ్గా అర్థం అవ్వదు. ఏమన్నావు అంటుంది ఏం లేదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేదార్.  


మరోవైపు పార్టీలో ఉన్న మాధురిని ఒకప్పుడు తనని ఏడిపించిన వ్యక్తి విష్ చేస్తాడు. అతనిని అవమానించేలాగా మాట్లాడుతుంది మాధురి. అప్పటికే తను ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ చేయమని బలవంత పెడుతుంటే చేయను డ్రింక్ చేశానని తెలిస్తే అక్క ఊరుకోదు అంటుంది.


ఇంతలో మరో ఫ్రెండ్ కావాలనే ఆమె మీద పడటంతో వాడి చెంప పగలగొట్టి నువ్వు కావాలని పడలేదని నీకు తెలుసు నాకు తెలుసు మళ్లీ ఇలా జరిగితే ఊరుకోను అని హెచ్చరిస్తుంది. ఆ ఫ్రెండ్ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు ముందు అవమానపడ్డ వ్యక్తి వచ్చి అలా వెళ్ళిపోవడమేంటి ప్రతీకారం తీర్చుకోవాలి కదా అంటూ మందు ఆఫర్ చేస్తాడు.


మరోవైపు కిరణ్ అతని తండ్రి ఎలా అయినా కౌషీకీ దగ్గర కాంట్రాక్ట్ సంపాదించాలి అనుకొని కౌశికి ఇంటి లోపలికి వస్తారు.


కిరణ్: అక్కడ ఉన్న నిషికని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు.


నిషిక : ఇది మరీ బాగుంది పెళ్లికి రమ్మంటే రావడం మానేసి నా అత్తగారింటికి వచ్చి నన్నే ఎక్కడున్నావేంటి అని అడుగుతున్నావా అని నవ్వుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన యువరాజ్ ని వాళ్లకి పరిచయం చేస్తుంది.


కిరణ్: కౌషికి గారి దగ్గర కాంట్రాక్ట్ కోసం వచ్చాము ఇప్పటివరకు వస్తుందో లేదో అని టెన్షన్ పడ్డాను కానీ ఇకమీదట నీదే బాధ్యత అంటాడు.


నిషిక: నీకేం భయం లేదు ఈ ఇంట్లో నేను ఎంత చెప్తే అంత ఆ కాంట్రాక్ట్ నీకు వచ్చినట్లే.


ఈ మాటలు అన్నీ వింటున్న ధాత్రి పొగడ్తలకి పొంగిపోయి సమస్యలు తెచ్చుకుంటుంది అనుకుంటుంది.


అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికితో కాంట్రాక్టు కిరణ్ వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది నిషిక.


కౌషికి: మీకు ఈ విషయం నేరుగా చెప్పాలని ఇంటికి పిలిపించాను ఈ కాంట్రాక్ట్ మీకు ఇవ్వడం కుదరదు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేశాను అని చెప్తుంది.


నిషిక : అదేంటి కిరణ్ నా ఫ్రెండు, ఈసారి కి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేయండి.


అలా చెప్పినా కూడా కౌషికి వినిపించుకోకపోవడంతో ఆమెని పక్కకి తీసుకువెళ్లి కాంట్రాక్టు వాళ్ళకి ఇవ్వండి లేకపోతే వాళ్ళ దగ్గర నా పరువు పోతుంది అంటుంది నిషిక.


కౌశికి: వాళ్ల గత కాంట్రాక్ట్స్ అన్నీ చూశాను వాళ్ళు పెర్ఫార్మన్స్ ఏమీ బాగోలేదు మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉందంటే అందుకు కారణం క్వాలిటీ మెయింటైన్ చేయటం, అయినా నన్ను అడగకుండా నిన్ను ఎవరు మాట ఇవ్వమన్నారు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


కోపంతో రగిలిపోతున్న నిషిక దగ్గరికి కిరణ్ వాళ్ళు వచ్చి నీ ప్రయత్నం నువ్వు చేసావు, పని జరగలేదు వదిలేయ్ కానీ నిన్ను చూస్తేనే జాలిగా ఉంది అంటూ తనని రెచ్చగొట్టేలాగా మాట్లాడి వెళ్లిపోతారు.


నిషిక: నా ఫ్రెండ్ ముందు నన్ను అవమానించి చాలా పెద్ద తప్పు చేశావు.. నేను ఇంతకంటే ఘోరంగా అవమానిస్తాను అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆