Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో వాళ్లు నన్ను మోసం చేసినా పర్వాలేదు నేను వాళ్లకు డబ్బు ఇస్తాను అన్నాను, ఇస్తాను. నాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంది నిషిక.
కౌషికి : ధాత్రి చెప్పిన తర్వాత కూడా నీకు డబ్బులు ఇస్తానని ఎలా అనుకున్నావు అంటుంది.
నిషిక: కోపంతో రగిలిపోతూ ఇదంతా నీ వల్లే ముందు నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి పో అని ధాత్రి జుట్టు పట్టుకుంటుంది.
కేదార్: నువ్వు ఇంట్లోకి రమ్మంటే రాలేదు పొమ్మంటే పోవడానికి. అక్క పిలిస్తే వచ్చాము అక్క పొమ్మంటేనే పోతాము అని నిషిక మీద ఫైర్ అవుతాడు.
వైజయంతి : కౌషికితో పొమ్మని చెప్పమ్మా ఈరోజుతో ఇంట్లో గొడవలన్నీ సర్దుకుంటాయి అంటుంది.
కౌషికి : మాటిచ్చాను పిన్ని, పొమ్మన లేను అంటుంది.
నిషిక: నా ఆస్తివాటా ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి చందా కి వచ్చిన వాళ్ళతో నేను తరువాత కాల్ చేస్తాను అప్పుడు రండి అని చెప్పి పంపించేస్తుంది. అత్తగారి దగ్గరికి వెళ్లి ఈ ఇంట్లో నా బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయింది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
వైజయంతి : కౌషికి దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అయినా వాళ్ళకి ఇచ్చిన గడువు ఎప్పుడో అయిపోయింది కదా అంటుంది.
మరోవైపు ధాత్రి, కేదార్ నిషిక మొండి ప్రవర్తన గురించి
మాట్లాడుకుంటూ ఉంటారు.
ద్ధాత్రి : మోసం చేసే వాళ్ళది కాదు తప్పు, మోసపోతున్నామని తెలిసినా కూడా ఎదుటి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు వాళ్ళది తప్పు అంటుంది.
అప్పుడే అక్కడికి వస్తారు కౌషికి, సుధాకర్.
కౌషికి : కరెక్ట్ గా చెప్పావు మీరు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాను కదా నిజంగా మాదే తప్పు. గడువు ముగియటానికి ఆరు రోజులు మాత్రమే టైముంది ఇంకా ఒక్క సాక్ష్యం కూడా తీసుకురాలేదు అందుకే ఇంట్లోంచి వెళ్లిపోండి అంటుంది.
కేదార్: ఇంట్లోంచి వెళ్తే సుధాకర్ కొడుకు గానే వెళ్తాను సాక్షాధారాలు తీసుకువస్తాను అంటాడు. అయినా అక్కకంటే తెలియదు కానీ మీకు తెలుసు కదా అని సుధాకర్ ని అడుగుతాడు కేదార్.
సుధాకర్: నాకేమీ తెలియదు అని దబాయిస్తాడు.
ధాత్రి: ఆడిటోరియంలో జరిగిందంతా మర్చిపోయారా అని అడుగుతుంది
సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వాడిని కూడా మీరు అరేంజ్ చేసి ఉంటారు అంటాడు.
మీరు ఆవేశ పడకండి బాబాయ్ అని చెప్పి సుధాకర్ ని అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతుంది కౌషికి.
మనం ఎలాగైనా సూరి మామ దగ్గర నుంచి సాక్షదారాలు తీసుకురావాలి అనుకుంటారు ధాత్రి దంపతులు. ఆ మాటలు వింటాడు యువరాజ్. అంటే సూరి మామ దగ్గరికి వెళ్తే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అనుకుంటాడు.
మరోవైపు అత్తగారితో మన ఆస్తులు పంచేయమని మావయ్యతో చెప్పండి మనం ఆ కౌషికి కింద బ్రతకడం ఏమిటి అంటుంది నిషిక.
వైజయంతి: ఆయన కూతురు దగ్గర గట్టిగా మాట్లాడనే మాట్లాడరు. ఇంకా ఆస్తులు గురించి అడుగుతారా అంటుంది.
నిషిక : అలా అయితే ఇంట్లోంచి నేను వెళ్ళిపోతాను అంతేగాని ఇలా బానిస బ్రతుకు బ్రతుకును అంటుంది.
వైజయంతి :మీ మామ గారితో నేను మాట్లాడతాలే అని సర్ది చెప్తుంది.
మరోవైపు దివ్యాంక కుడికాలు లోపల పెట్టి కౌషికి ఇంట్లోకి రావాలనుకుంటుంది. కానీ కౌషికి అందుకు ఒప్పుకోదు.
నిషిక: ఒకరి దయ మీద పడి బ్రతుకుతున్నావు, నాకోసం వచ్చిన వాళ్ళని రావద్దని చెప్పటానికి నువ్వు ఎవరు అని నిలదీస్తుంది.
కౌషికి: తనకి హక్కు లేకపోవచ్చు కానీ ఇంటికి ఎవరు రావాలి రాకూడదు చెప్పే హక్కు నాకు ఉంది కదా తను ఈ ఇంటికి రావటానికి వీలు లేదు అంటుంది.
దివ్యాంక గర్వంగా ఇంట్లోకి అడుగుపెట్టి నాకు సురేష్ కి పెళ్లి అని చెప్పాను కదా ఎంగేజ్మెంట్ కి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను.
నిషిక: ఆనంద పడిపోతూ మీరు తనని ఎంత ఇబ్బంది పెట్టినా మొదటి ఇన్విటేషన్ మనకే ఇస్తుంది తీసుకోండి అంటుంది.
కౌషికి: కోపంగా బయట వాళ్ల ముందు నోరు జారటం బాగోదని ఊరుకుంటున్నాను ఇంట్లోంచి నిన్ను బయటికి పంపించేసే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ధాత్రి: ఎందుకు వదినని బాధపెట్టి ఆనందపడతావు అంటుంది.
నిషిక : నా ఇంట్లో నన్ను నిలదీయడానికి నీకేం హక్కు ఉంది అంటుంది.
ధాత్రి : మాట్లాడితే హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు.
అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.