Jagadhatri Today Episode: రెండు రోజుల్లో నిజాన్ని నిరూపిస్తాను అని ధాత్రి అనటంతో మూడు రోజులు టైం తీసుకో కానీ నిజాన్ని నిరూపించు లేదంటే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్లి పోవాల్సి ఉంటుంది అంటుంది కౌషికి.


యువరాజ్: తప్పు చేసి దొరికిపోయాక కూడా ఇంకా టైం ఇస్తున్నావ్ ఏంటక్క అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యువరాజ్.


తర్వాత ఒంటరిగా ఉన్న కేదార్ దగ్గరికి వచ్చి ఆ ప్రేమలో ఏదో తేడా ఉందని నేను ముందే చెప్పాను కానీ నువ్వు వినిపించుకోలేదు అంటుంది ధాత్రి.


కేదార్ : నాకు మంచే జరిగింది ఆ తండ్రి నన్ను కొట్టినప్పుడు తప్పు చేస్తే సరిదిద్దే తండ్రి కనిపించాడు, నా అనుకున్న వాళ్ళనే ఎవరైనా కొడతారు అంటాడు.


ధాత్రి : ఇంతగా ప్రేమించే నీ ప్రేమని ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అంటుంది.


కేదార్:  మూడు రోజుల్లో మనం నిజం నిరూపించాలి లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది.


ధాత్రి : అందుకు ఒక ఉపాయం ఉంది డాక్యుమెంట్స్ రాసేటప్పుడు పేరు అడ్రస్ తీసుకుంటారు అక్కడికి వెళ్తే మనకి నిజాలు తెలుస్తాయి అంటూ అక్కడికి బయలుదేరుతారు ధాత్రి వాళ్ళు.


అదే సమయంలో తమ ట్రాప్ లో కేదార్ చిక్కుకున్నందుకు ఆనందపడతారు యువరాజ్ వాళ్ళు.


వైజయంతి : మూడు రోజుల్లో వాళ్ళు నిజాన్ని నిరూపిస్తే అదే చెంప దెబ్బ నీకు పడుతుందేమో అని భయంగా ఉంది.


యువరాజ్: ఎలాంటి ఆధారం దొరక్కుండా తప్పు చేయటం నాకు అలవాటు. అయినా నిజానికి వాళ్ళకి మధ్యలో నేనుంటాను. వాళ్లు నిజం తెలుసుకోకుండా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను అంటాడు.


అప్పుడే కంగారుగా బయటికి వెళ్తున్న కేదార్ వాళ్ళని చూస్తాడు యువరాజ్.


నిషిక : ఏంటి అలా చూస్తున్నావ్.


యువరాజ్: వాళ్ల కంగారు చూస్తుంటే స్కూల్ కి వెళ్తున్నట్టుగా లేదు మరెక్కడి కో వెళ్తున్నారు అంటాడు.


నిషిక : నేను ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నాను నన్ను డ్రాప్ చేసి నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు అని చెప్తుంది.


తర్వాత బండి మీద వెళ్తున్న ధాత్రి దంపతులని చూస్తూ కారులో వెళ్తున్న నిషిక నేను ఆఫీస్ కి వెళ్తున్నాను నువ్వు ఇలాగే డొక్కు స్కూటర్ మీద స్కూల్ కి వెళ్ళు అని వెటకారంగా మాట్లాడుతుంది.


ధాత్రి: నువ్వు ఇంకా గాల్లోనే మేడలు కడుతున్నావు ఎప్పటికైనా భూమ్మీద పడిపోతావు జాగ్రత్త. అయినా నువ్వు అనుకున్నది సాధిస్తే నాకంటే ఆనందించే వాళ్ళు ఎవరు లేరు అంటుంది.


ధాత్రి వాళ్ళని దాటుకొని యువరాజ్ వాళ్ల కారు ముందుకి వెళ్ళిపోతుంది. ఇంతలో కేదార్ వాళ్ళకి సూరి మామ కారులో వెళ్తూ కనిపిస్తాడు. కేదార్ దంపతులు గట్టిగా సూరిని పిలుస్తూ అతని కారుని ఫాలో అవుతారు. అది గమనిస్తాడు యువరాజ్.


యువరాజ్: నువ్వు ఆఫీస్ కి క్యాబ్లో వెళ్ళు అని చెప్తాడు.


నిషిక :ఎందుకు అని అనుమానం గా అడుగుతుంది.


యువరాజ్: వాళ్ళు ఎవరినో చాలా కంగారుగా ఫాలో అవుతున్నారు నేను వాళ్ళని ఫాలో అయితే నిజం తెలుస్తుంది అని చెప్పడంతో నిషిక కారు దిగిపోతుంది యువరాజ్ వాళ్ళని వెంబడిస్తాడు.


మరోవైపు ఆఫీస్ కి వెళ్ళిన నిషిక ఐడి చూపించమన్నందుకు సెక్యూరిటీని చెంప మీద కొడుతుంది. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి వదిన రూమ్ ఎక్కడ అని అడుగుతుంది.


రిసెప్షనిస్ట్ : ఆవిడ మీటింగ్లో ఉన్నారు ఎవరిని ఎలవ్ చెయ్యొద్దన్నారు  అంటుంది అయినా వినిపించుకోకుండా కౌషికి రూములోకి వెళ్లి మీతో మాట్లాడాలి అని ఆమెని బయటికి లాక్కు వస్తుంది.


కౌషికి : నేను పనిలో ఉన్నాను ఏం మాట్లాడాలో చెప్పు అంటుంది.


నిషిక : వాళ్ళు నన్ను అవమానించారు ముందు వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయండి అని మొండిగా మాట్లాడుతుంది.


కౌషికి: వాళ్ల పని వాళ్లు చేస్తే ఎందుకు పనిలోంచి తీసేయటం, నువ్వు పది నిమిషాలు వెయిట్ చెయ్యు నేను మీటింగ్ ఫినిష్ చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. కోపంతో రగిలిపోతుంది నిషిక.


మరోవైపు సూరి మామ నేరుగా ఇంటికి వెళ్తాడు. స్కూల్లో గొడవలు పెట్టుకోవద్దు అంటూ కూతురుతో మాట్లాడుతూ ఉంటే కేదార్ వాళ్ళు ఇంట్లోకి వస్తారు. యువరాజ్ దొంగ చాటుగా గోడ దూకి ఇంట్లో ప్రవేశించి వాళ్ల మాటలు వింటూ ఉంటాడు.


సూరి :మీరు ఎవరు అని అడుగుతాడు.


కేదార్: నేను మామ కేదార్ ని గుర్తుపట్టలేదా అని అడుగుతాడు.


సూరి: పేరు ఎక్కడో విన్నట్టుంది కానీ నువ్వు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను అంటాడు.


ధాత్రి : సుహాసిని గారి అబ్బాయి.


సూరి: అతనిని ఆప్యాయంగా పట్టుకొని నువ్వు మా సుహాసిని అమ్మ కొడుకువా అంటూ యోగక్షేమాలు అడుగుతాడు.


కేదార్ : తన పరిస్థితిని అంతా వివరించి ఆయనే నా తండ్రి అని నిరూపించుకోవటానికి నీ దగ్గర సాక్షాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు.


ఇదంతా వింటున్న యువరాజ్ వీళ్లు మా నాన్న గురించేనా మాట్లాడుకుంటున్నారు అని అనుమానపడతాడు.


సూరి: నేనే పెద్ద సాక్ష్యం. వాళ్ల పెళ్లికి నేను ప్రత్యక్ష సాక్షిని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.