Jagadhatri Serial Today Episode మాధురిని చంపేస్తా అని విక్కీ బెదిరిస్తాడు. గన్‌లు పక్కన పెట్టేసి దూరంగా వెళ్లిపోమని జేడీ, కేడీలతో చెప్తాడు. గన్‌లను ఎవరైనా వచ్చి మూట కట్టండి అని అంటే అందరూ చచ్చారురా కావాలంటే నేను కట్టాలా అని జేడీ అంటుంది. విక్కీ మాధురిని పట్టుకొని కాల్చేస్తా అని బెదిరించి జేడీ, కేడీలను లోపల ఉండమని అంటాడు. 

Continues below advertisement


బయటకు వెళ్లి మాధురిని నెట్టేసి విక్కీ పారిపోతాడు. జేడీ వాళ్లు మాధురి దగ్గరకు వెళ్తారు. నా కడుపులో బిడ్డ ఉంది.. నన్ను రక్షించిన మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటుంది. నాకు ఇబ్బందిగా ఉంది నన్ను ఇంటికి పంపేయండి అని అంటే ఏడుస్తుంది. లేదు నీకు హాస్పిటల్‌కి తీసుకెళ్తామని కిరణ్‌తో పంపిస్తారు. సంధ్య గురించి మాధురి చెప్తూ నన్ను కాపాడటానికి వచ్చిన సంధ్యని నా కళ్ల ముందే చాలా టార్చర్ చేశారు.. తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని అంటుంది. 


జేడీ, కేడీలు సంధ్య దగ్గరకు పరుగులు పెడతారు. సంధ్య పరిస్థితి చూసి ఏడుస్తారు. జేడీ సంధ్య  మీద దుప్పటి కప్పి హాస్పిటల్‌లో చేర్పిస్తుంది. సంధ్య పరిస్థితి ఏంటి మేడం అలా ఉంది తన పరిస్థితి ఏంటి అని కిరణ్‌ అడిగితే డ్యూటీలో సిన్సియర్‌గా ఉండేది ఈ పరిస్థితి వచ్చిందని జేడీ అంటుంది. డాక్టర్లు మాధురి, సంధ్య ఇద్దరినీ చూస్తారు. మాధురి కండీషన్‌ బాగానే ఉందని చెప్తారు. కేడీ మాధురితో మాట్లాడుతూ చెల్లి అనేస్తాడు. తర్వాత సారీ చెప్తాడు. పర్లేదు అన్నయ్య నాకు మీరు పునర్జన్మ ఇచ్చారు.. మా అన్నయ్యల లాగానే మీరు నాకు అండగా నిలిచారు. నాకు మీరు అన్నయ్యే. నా బిడ్డకు మీరు మేనమామే అని ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. సంధ్యని చూసిన డాక్టర్ తన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని చెప్తుంది. 


మాధురి ఇంటికి వస్తుంది. నాన్నని పట్టుకొని ఏడుస్తుంది. అందరూ మాధురిని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతారు. జగద్ధాత్రి, కేథార్‌లు కూడా వస్తారు ఏమైందని అందరూ మాధురిని అడిగితే విషయం చెప్తుంది. జేడీ, కేడీలు కాపాడారని మాధురి చెప్తుంది. ప్రతీ ఆపదలో మనల్ని కాపాడుతున్నారు. వాళ్ల రుణం పెరిగిపోతుందని కౌషికి అంటుంది. యువరాజ్‌ వంశీకి సారీ చెప్పి చెల్లి కనిపించలేదని కోపంలో ఏదేదో అనేశానని సారీ చెప్తాడు. ఇక మాధురిని తాను డ్రాప్ చేస్తానని అంటాడు. నువ్వు ఎందుకు అని అందరూ అంటే మళ్లీ ఆ రౌడీలు అటాక్ చేస్తే అని అంటే నేను ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను అని వంశీ అంటాడు. కేథార్ యువరాజ్‌తో జేడీ, కేడీలు ఉండగా మాధురిని ఎవరూ ఏం చేయలేరు కావాలి అంటే నీ తృప్తి కోసం వెళ్లిరా అని అంటాడు. యువరాజ్ వెళ్తాడు.


డాక్టర్లు జేడీ, కేడీలను అర్జెంటుగా రమ్మని అంటారు. సంధ్య బతకడం కష్టం.. తన మీద సామూహికంగా అత్యాచారం చేశారు. మందు తాగించారు.. ప్రైవేట్‌ పార్టుల్లో కట్ చేసి దారుణంగా హింసించారు. తనకి ఎక్కువ టైం లేదు చివరి వాగ్మూలం తీసుకోండి అంటుంది.జేడీ, కేడీ, రమ్య కిరణ్ ఏడుస్తూ సంధ్య దగ్గరకు వెళ్తారు. కేడీ ఏడుస్తూ సంధ్య ఇలా అడగటం చాలా కష్టంగా ఉంది నన్ను నీ అన్నయ్య అనుకొని చెప్పమ్మా అని అంటాడు. నాకు తోడబుట్టిన వాళ్లు లేరు నేను బతుకుతానో లేదో తెలీదు కానీ వాళ్లు బతకకూడదు అన్నయ్య వాళ్లని నడిరోడ్డు మీద ఉరి తీయాలి అంటుంది. మీ అన్నయ్య అడుగుతున్నాడని చెప్పమ్మా నువ్వు చెప్పే ప్రతీ మాట వాడిని చంపడానికి ఉపయోగపడుతుందని అంటాడు. హోం మినిస్టర్ కొడుకు అని సంధ్య జరిగింది అంతా చెప్తుంది. వాడిని వాడి గ్యాంగ్‌ని వదలకూడదు అన్నయ్య అని అంటే వాడి గ్యాంగ్ లేదమ్మా వాడు ఒక్కడే తప్పించుకున్నాడు అని కేడీ అంటాడు. వాడు హోం మినిస్టర్ కొడుకు ఈజీగా తప్పించుకుంటాడు. వాడిని వదలను అని మాటివ్వు అన్నయ్య అంటుంది. జేడీ, కేడీలు ఇద్దరూ మాటిస్తూ వాడిని నడిరోడ్డు మీద కుక్కని కాల్చి చంపుతాం.. అని మాటిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.