Jagadhatri Serial Today Episode యువరాజ్‌ని పోలీసులు మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తారు. వైజయంతి ఏడుస్తూ కౌషికి దగ్గరకు వెళ్లి దండం పెట్టి నా బిడ్డను ఇంటికి తీసుకురండి వాడిని నిర్దోషిగా విడుపించుకురండి అని ఏడుస్తుంది. మేం వెళ్లి మాట్లాడి వస్తాం కనీసం బెయిల్ మీద అయినా తీసుకొస్తాం అని కౌషికి, జగద్ధాత్రి, కేథార్ జైలుకి వెళ్తారు.

Continues below advertisement

యువరాజ్‌ని కలవడానికి ముగ్గురు జైలుకి వెళ్తారు. నేనేం తప్పు చేయలేదు అక్క అని అంటాడు. జగద్ధాత్రి యువరాజ్‌తో అతనికి నీకు సంబంధం ఉందా.. మొత్తం చెప్పు యువరాజ్ అని అడుగుతుంది. కౌషికి కూడా యువరాజ్‌కి విషయం చెప్పమని అడుగుతుంది. మల్లన్న అనే వాడు గతంతో తాను కారులో వెళ్తుంటే ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద వెళ్తున్న తన కారుకి అడ్డంగా వచ్చాడని గొడవ పడ్డాడని చెప్తాడు. ఆ టైంలో యువరాజ్ మల్లన్నని గట్టిగా కొడతారు. యువరాజ్ మల్లన్నని పట్టుకొని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చానని జగద్ధాత్రి, కౌషికి వాళ్లతో చెప్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ వాడిని చూడలేదని నేను ఎందుకు  వాడిని చంపుతాను అని అంటాడు. ఈగొడవ జరిగి వారం దాటిందని యువరాజ్ అంటాడు. 

జగద్ధాత్రి వాళ్లు వారం తర్వాత చనిపోతే బాడీ ఇలా ఉండదు కదా.. దీని వెనక ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. అది ఎవరో తెలుసుకుంటే యువరాజ్‌ని విడిపించొచ్చని అంటాడు.  బెయిల్ తీసుకొచ్చిన లాయర్‌ ఎస్‌ఐని కలవాలి అంటాడు. కానిస్టేబుల్ లాయర్‌తో ఎస్‌ఐ, సీఐ ఎవరూ లేరు బెయిల్ ఇవ్వడం కుదరదు.. ఎస్‌ఐ వారం రారు.. సీఐ రేపు వస్తారు అని చెప్తారు. జగద్ధాత్రి, కేథార్‌ని అనుమానం వస్తుంది. కానిస్టేబుల్ రేపు వచ్చి బెయిల్ మీద తీసుకెళ్లమని అంటారు. కౌషికి యువరాజ్‌కి ఈ ఒక్క రోజు ఉండరా రేపు వచ్చి తీసుకెళ్తాం అని చెప్తుంది. 

Continues below advertisement

కానిస్టేబుల్ హోంమినిస్టర్‌కి కాల్ చేసి మీరు చెప్పినట్లు చేశానని అంటాడు. మీనన్ తాయారుతో నేను చెప్పిన పని ఆ యువరాజ్ చేయలేదు.. వాడి జీవితం నాశనం చేసేస్తా.. ఈరోజు రాత్రికే పోలీస్ స్టేషన్‌లో వాడిని లేపేస్తా అని అంటాడు. సీఐ భయపడితే అంతా నేను చూసుకుంటా  అని తాయారు చెప్తుంది. అంతా మీనన్ చూసుకుంటాడు.. వాడి చెల్లిని కిడ్నాప్ చేశాడు అని నా కొడుకుని చంపేశాడు.. వాళ్ల మీద పగ తీర్చుకుంటా అని అంటుంది. కేసు జేడీ, కేడీల మీదకి తోసేయాలని అనుకుంటారు. 

జగద్ధాత్రి వాళ్లు ఇంటికి వెళ్తారు. యువరాజ్ వచ్చాడని సంతోషంగా వైజయంతి హడావుడి చేస్తే యువరాజ్ రాలేదు అని కౌషికి చెప్పడంతో వైజయంతి ఏడుస్తుంది. వాడు చేసిన పాపాలకు ఇలా అయిందని సుధాకర్ అంటాడు. నా కొడుకు ఇప్పుడు అన్నీ వదిలేసి మన మాట వింటున్నాడని ఏడుస్తుంది. యువరాజ్‌ని అరెస్ట్‌ చేశారని ఈ కేసులో జేడీ, కేడీలు ఇన్వాల్వ్ అయ్యారని యువరాజ్ ప్రాణాలు పోకూడదని ఆ భగవంతున్ని కోరుకుందామని న్యూస్ వస్తుంది. జేడీ, కేడీలు నా కొడుకుని చంపేస్తారా అని వైజయంతి ఏడుస్తుంది. మీరు అదంతా నమ్మొద్దు అని జగద్ధాత్రి చెప్తుంది. నిజం లేకపోతే అలా చెప్తారా అని నిషి అంటుంది. జేడీ, కేడీలు అలా చేయరు అది ఫేక్ న్యూస్ అని కౌషికి చెప్తుంది. యువరాజ్‌కి ఏమైనా అయితే వాళ్లిద్దరినీ వదిలిపెట్టను అని నిషి ఏడుస్తుంది. 

సాధు సార్ జగద్ధాత్రి, కేథార్‌లకు ఫోన్ చేస్తాడు. ఎవరో కావాలని ఈ న్యూస్ వైరల్ చేశారని.. మీనన్, తాయారులే ఇలా చేసుంటారని అంతా చూస్తుంటే యువరాజ్‌ని చంపేసి నేరం మీ మెడకు చుట్టి మీ ఉద్యోగాలు తీసేయాలని చూస్తున్నారని చెప్తాడు. అందుకేనా ఎస్‌ఐ, సీఐలు లీవ్‌ అని చెప్పి రాలేదని జగద్ధాత్రి చెప్తుంది. అయితే ఈ రోజు రాత్రికే అటాక్ చేస్తారని సాధుసార్ చెప్పడంతో మేం కూడా అటాక్ చేయాలా అని కేథార్ అడుగుతాడు. బెయిల్ రాకపోతే అటాక్ చేయండి అని సాధుసార్ చెప్తాడు. మీనన్ చెప్పిన పని యువరాజ్ చేయడం లేదని హోం మినిస్టర్‌తో కలిసి ఇలా చేయిస్తున్నాడని జగద్ధాత్రి అంటుంది. కౌషికి జేడీకి కాల్ చేసి తన తమ్ముడికి కాపాడమని అంటుంది. ఇదంతా మీనన్ చేస్తున్నాడని సపోర్ట్‌గా తాయారు ఉందని చెప్తుంది జగద్ధాత్రి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.