Jagadhatri Serial Today Episode మీనన్ తన యువరాజ్ కుటుంబాన్ని చంపేయాలని రౌడీలను యువరాజ్ ఇంటికి పంపిస్తాడు. యువరాజ్ బయట కాపలా కాసి తన కుటుంబానికి ఏం కాకూడదు అని రౌడీలను చితక్కొడతాడు. 

Continues below advertisement

మరికొంత మంది రౌడీలు ఇంటిలోపలికి దూరుతారు. కౌషికిని చంపాలని రౌడీ కత్తి పెడితే జగద్ధాత్రి అడ్డుకుంటుంది. శ్రీవల్లి మీదకు వచ్చిన రౌడీని కేథార్ కొడతాడు. జగద్ధాత్రి కత్తి పట్టుకొని కొట్టడం కీర్తి పాప చూస్తుంది. జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ సైలెంట్‌గా రౌడీల అంతు చూస్తారు. కీర్తి పాప చప్పట్లు కొడితే వద్దని జగద్ధాత్రి చెప్తుంది. ఇంటి బయట యువరాజ్ రౌడీలను చితక్కొడితే ఇంటి లోపలి జగద్ధాత్రి, కేథార్ మీనన్ మనుషులు తాట తీస్తారు. ఇంట్లో ఏ ఒక్కరి నిద్రకి ఇబ్బంది కాకుండా రౌడీలను నరికేస్తారు. కీర్తి పాప వచ్చి రౌడీలను నరకడం వల్ల పడిన రక్తం తుడిచేస్తుంది. 

నిషిక వాటర్ కోసం లేస్తుంది. గదిలో నీరు లేకపోవడంతో బయటకు వస్తుంది. నిషికను రౌడీ నరకాలని చూస్తే నిషికకు తెలీకుండా జగద్ధాత్రి వచ్చి అడ్డుకుంటుంది. యువరాజ్‌ని బయట ఓ రౌడీ చంపాలని చూస్తే కేథార్ అడ్డుకుంటాడు. కేథార్ రౌడీలను నరికేయడం చూసి యువరాజ్‌ షాక్ అయిపోతాడు. ఇక జగద్ధాత్రి రౌడీలను నరికి కాలి కింద అణిచేస్తుంది. నిషిక గదిలోకి వెళ్లిన తర్వాత జగద్ధాత్రి రౌడీని బయటకు విసిరేస్తుంది. 

Continues below advertisement

కేథార్ యువరాజ్‌కి చేయి అందిస్తాడు. కేథార్, యువరాజ్ కలిసి రౌడీలను చితక్కొడతాడు. రౌడీలందరినీ వెంట పడి వెంటపడి తరిమి తరిమి జగద్ధాత్రి, కేథార్ నరికి చంపుతారు. యువరాజ్ గదిలోకి వెళ్లి నా ఫ్యామిలీ సేఫ్ అని అనుకుంటాడు. కేథార్ డ్రైవర్‌తో అందర్ని చంపేశా నిన్ను ఎందుకు చంపలేదో తెలుసా వీళ్లందరినీ ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసు కదా తీసుకెళ్లు అని లారీలో అందరి శవాలను ఎక్కించి పంపిస్తారు. జగద్ధాత్రి గుమ్మం ముందు రక్తం కారుతున్న గొడ్డలితో కూర్చొంటే కేథార్ కత్తి పట్టుకొని ఇంటి గేట్ మీద కూర్చొంటాడు. 

రౌడీలు యువరాజ్ ఫ్యామిలీని చంపేసుంటారని మీనన్ గెంతులేస్తాడు. ఇంతలో జగద్ధాత్రి మీనన్‌కి కాల్ చేస్తే ఏంటి జేడీ ఈ సర్‌ఫ్రైజ్ అని మీనన్ అడుగుతాడు. ప్రాణాలు లేకుండా నీ మనుషులు ఈ టైంకి వచ్చేసుంటారు అనుకుంటున్నా వచ్చేశారా అని అంటుంది. మీనన్ ముందు లారీ ఆగుతుంది. చూసి బిత్తరపోతాడు. ఈ షాక్ నాకు ఎందుకు ఇచ్చావ్ జేడీ అని మీనన్ అంటే నువ్వు ఎంట్రీ ఇస్తే నేను ఎంటర్ అవుతా.. ఏదో ఒక రోజు నీ పాలిట మృత్యుదేవతని నేనే అంటుంది. నేను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా.. ఎవడికిరా నువ్వు భాయ్.. ఎవడిని నువ్వు బెదిరిస్తావ్‌రా అని అంటుంది. మీనన్ యువరాజ్‌ని బెదిరించే టైంలో జగద్ధాత్రి వింటుంది. ఈ ఇంట్లో ఎవరూ రక్తపుమడుగులో లేరు నీ మనుషులే ఉన్నారు చూశావా దిస్‌ ఈజ్ జేడీ అని అంటుంది. నువ్వేం చేస్తావో చేసి చేయ్ మీనన్ ఇక్కడే ఉంటా అని ఏం చేస్తావో చేయ్ అని అంటుంది. 

మాధురి సీమంతం చక్కగా జరిగింది అని వైజయంతి, సుధాకర్ ఉదయం మాట్లాడుకుంటారు. యువరాజ్ అంతా వింటాడు. యువరాజ్ మంచిగా ఉంటే మనకు ఇంకేం కావాలి అని అనుకుంటారు. యువరాజ్ బయటకు వెళ్తుంటే కాచి, బూచిలు మొత్తం చూసేశాం అని అనడంతో యువరాజ్ రాత్రి జరిగింది చూసేశాడేమో అనుకుంటారు. కానీ ఇద్దరూ సీమంతం గురించి మాట్లాడుతారు. కేథార్‌ని చూసి యువరాజ్ అక్కడికి వెళ్లి థ్యాంక్స్ చెప్తాడు. థ్యాంక్స్ వద్దు నాతో రా అని కేథార్ యువరాజ్‌ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. నిషి చూసి ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.