Jagadhatri Serial Today Episode: జగధాత్రి నెట్టడం వల్లే నిషిక కడుపుపోయిందని అబద్ధం చెప్పడంతో జగధాత్రికి కోపం వస్తుంది.మర్యాదగా నిజం చెప్పకపోతే...ఇప్పుడు నేను నోరు విప్పాల్సి వస్తుందని అంటుంది. దీంతో నిషిక జగధాత్రి దగ్గరకు వచ్చి చెంప పగులగొడుతుంది. నా కడుపు పోవడానికి కారణమైందే కాకుండా నేనే అబద్ధం చెబుతున్నానని అంటావా అని నిలదీస్తుంది. దీంతో జగధాత్రి కౌషికికి నిజం చెబుతుంది.అసలు నిషిక కడుపుతోనే లేదని ఆ నిజం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అబద్ధం ఆడుతోందని చెబుతుంది.ఇంతలో యువరాజు కల్పించుకుని నా బిడ్డ ఈ ఇంటి వారసుడు అవుతాడన్న కోపంతోనే మీరు ఇలా చేశారని అంటాడు.ఆ మాటలకు జగధాత్రి, కేదార్ షాక్‌తింటారు.అసలు మీ బిడ్డను చంపాల్సిన అవసరం మాకు ఏముందని అంటారు. నిషిక కల్పించుకుని ఇంత జరుగుతున్నా మీరు ఇంకా జగధాత్రి వైపు ఉన్నారా అని కౌషికిని అడుగుతుంది. దీంతో కౌషికి నేను జగధాత్రి వాళ్లవైపు లేనని చెబుతుంది.ఇంతలో సుధాకర్ కల్పించుకుని జగధాత్రిపై కోప్పడతాడు. నిన్ను కన్న కూతురిలా చూసుకుంటే ఇంతపనిచేస్తావా అని అసహ్యించుకుంటాడు. ఇకపై నీ ముఖం నాకు చూపించవద్దని కోపంగా అంటాడు. ఆ మాటలకు ధాత్రి ఎంతో బాధపడుతుంది. మొదటిసారి మామయ్యగారి దగ్గర మాటపడాల్సి వచ్చిందని కేదార్‌తో అంటుంది.నిజం తెలియక వాళ్లు అలా మాట్లాడుతున్నారని.....అసలు నిజం తెలిసినరోజు నిన్ను అర్థం చేసుకుంటారని అంటాడు. పాటిల్‌ను హత్య చేయడానికి వచ్చిన గ్రూప్ ఎక్కడ ఉందో పోలీసులు కనుక్కుని జేడీ, కేడీకి చెబుతారు.దీంతో వాళ్లిద్దరూ వెంటనే అక్కడికి బయలుదేరతారు. ఓ ఇంట్లో వాళ్లు ముగ్గురు ఉన్నారని తెలుసుకున్న జేడీ...ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చామంటూ ఆ ఇంట్లోకి వెళ్తారు.వీళ్లను గుర్తుపట్టిన రౌడీలు....జేడీ,కేడీని లోపల బంధించి బయట తాళం వేస్తారు.ఇళ్లంతా పెట్రోలు పోసి నిప్పంటిస్తారు. ఆ ముగ్గురు యువతీ,యువకులను అక్కడి నుంచి తీసుకుని పారిపోతారు. అయితే మంటల్లో నుంచి బయటపడిన జేడీ,కేడీ రౌడీలకు ఎదురుగా వచ్చి నిలబడతారు. వాళ్లందరిని తుక్కుతుక్కుగా కొట్టిపడేస్తారు. జేడీని చూసి యువతీ,యువకులు పారిపోవడానికి ట్రై చేయగా...ఆమె గన్‌తీసి బెదిరిస్తుంది.దీంతో వాళ్లు ముగ్గురు అక్కడికి వచ్చి చంపొద్దని ప్రాధేయపడతారు. అసలు పాటిల్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందని జేడీ నిలదీస్తుంది.అసలు మేం ఆయన్ను చంపాలని అనుకోలేదని...మాకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెబుతారు.మేం రోడ్లపై ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటామని...దీంతో ఒకతను మమ్మల్ని పిలిచి ఉద్యోగాలు ఇచ్చాడని చెబుతారు.మేం ఇలాగే ఫ్రాంక్ వీడియోలు చేయాలని చెప్పారని అంటారు. మేం ఎప్పటి మాదిరిగానే ఫ్రాంక్ వీడియోల కోసమే డమ్మీ గన్‌తో ఆయన్ను కాల్చామని....కానీ అనూహ్యంగా మా చేతుల్లోకి నిజం గన్ ఎలా వచ్చిందో తెలియదని అంటారు. అంటే మిమ్మల్ని పావులుగా పెట్టుకుని ఎవరో ఈ నాటకం ఆడించారన్నమాట అని జేడీ అంటుంది. అంటే మిమ్మల్ని పనులో పెట్టుకున్న బాషకు మాత్రమే ఈ హత్య చేయించింది ఎవరో తెలుసు అన్నమాట అని జగధాత్రి అంటుంది.
Jagadhatri Serial Today May 21th:జగధాత్రిని ముఖం కూడా చూపించవద్దని సుధాకర్ ఎందుకు అన్నాడు..?కౌషికికి యువరాజు గన్ ఎందుకు గురిపెట్టాడు..?
Ajay Kumar | 21 May 2026 11:19 PM (IST)
Jagadhatri Serial Today Episode May21th:నిషిక కడుపులో బిడ్డను జగధాత్రి కావాలనే చంపిందన్న కోపంతో సుధాకర్ జగధాత్రిని అసహ్యించుకుంటాడు. తనను ప్రాజెక్ట్ హెడ్‌గా చేయమని యువరాజు కౌషికిని బెదిరిస్తాడు.

జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్