Jagadhatri Serial Today Episode: మీనన్ వైజయంతికి వజ్రాలు అందజేసి తాము చెప్పినచోట ఇవ్వమని చెబుతాడు.అలాగే ఈ పనిచేసినందుకు వైజయంతికి ఇవ్వాల్సిన కమీషన్ డబ్బు కూడా ఇచ్చేస్తాడు. ఆ డబ్బులు తీసుకున్న వైజయంతి....ఇక ధాత్రిని ఒక ఆట ఆడుకుంటానని అనుకుంటుంది. దుండగుల బారీ నుంచి కౌషికి, కీర్తి క్షేమంగా బయటపడంతో ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో యువరాజు మీనన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు మీనన్ ఎందుకు నా ఫ్యామిలీ జోలికి వస్తున్నాడో అర్థం కావడం లేదంటాడు. నేను ఒకసారి మీనన్‌తో మాట్లాడి గట్టి వార్నింగ్ ఇస్తానని యువరాజు కౌషికిని అడుగుతాడు. దీనికి కౌషికి అభ్యంతరం చెబుతుంది. నువ్వు మళ్లీ తన కోసం పనిచేయాలనే మీనన్ ఇదంతా చేస్తున్నాడని చెబుతుంది. నువ్వు మాట్లాడటం మొదలుపెడితే మళ్లీ నిన్ను బయపెట్టో, లేక డబ్బు ఆశ చూపించో మళ్లీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడని అంటుంది. అయినా ఈసారి వచ్చింది నీకోసం కాదని...వదిన దగ్గర నుంచి తనకు కావాల్సిన విలువైనది ఏదో తీసుకోవడానికే వచ్చాడని ధాత్రి అంటుంది. అందుకే బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడని చెబుతుంది. ఆ బ్యాగ్‌లో నా పర్సనల్ ఐటెంలు తప్ప..వాడికి అవసరమైనది ఏదీ లేదని కౌషికి చెబుతుంది. వదిన బ్యాగ్‌లో కుంకుమ భరణి ఉన్న సంగతి ఎవరో ఇక్కడ నుంచే మీనన్‌కు చేరవేశారని ధాత్రి కేదార్‌తో అంటుంది. ఈ ఇంట్లో మనకు తెలియకుండా ఎవరో అతనికోసం పనిచేస్తున్నారని అంటుంది. నిషి కాదని క్లారిటీ వచ్చింది కదా మరి ఇంకెవరు అని కేదార్ అంటాడు. వైజయంతి బయట నుంచి వస్తూనే కీర్తికి ఎలా ఉందని...పాపం వాళ్ల దెబ్బకు బిడ్డ బెదిరిపోయి ఉంటుందని అంటుంది. బయట నుంచి వచ్చే తనకు కీర్తి కిడ్నాప్‌కు గురైందన్న సంగతి ఎలా తెలిసిందని ధాత్రితోపాటు అందరికీ అనుమానం వస్తుంది. కీర్తికి ఏమైంది అత్తయ్యగారు అని ధాత్రి నిలదీయగా...ఆ రౌడీ వెదవలు కౌషికి కారుపై దాడి చేసి కీర్తిని ఎత్తుకెళ్లడానికి ట్రై చేశారంట కదా అని ఆగిపోతుంది. ఈ విషయం నీకు ఎలా తెలిసిందని ధాత్రి, కేదార్ నిలదీస్తారు. అసలు ఎక్కడికి వెళ్లావని సుధాకర్ అడుగుతాడు. తన ప్రెండ్ విదేశాలకు వెళ్లి తిరిగి వస్తే చూసి రావడానికి వెళ్లానని చెబుతుంది.నేను కారులో వెళ్లేప్పుడు చూశానని....తిప్పుకుని వచ్చేప్పుడు ఎటువాళ్లు అటు వెళ్లిపోయారని అంటుంది. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ ఏంటని కౌశికి నిలదీస్తుంది. అందులో ఏం ఉన్నాయని ధాత్రి, కేదార్ కూడా నిలదీయగా....యువరాజు కలుగుజేసుకుంటాడు. మీ హద్దుల్లో మీరు ఉండండని హెచ్చరిస్తాడు. అందులో నా వస్తువులే ఉన్నాయని...దానికి ఎందుకు ఈ రచ్చ అంటూ తీసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ధాత్రి మళ్లీ వైజయంతిని ఆపుతుంది. కౌషికి కూడా అందులో ఏం ఉన్నాయో చెప్పడానికి ఎందుకు భయమని నిలదీస్తుంది. ఇంతలో యువరాజు కూడా ఆ బ్యాగ్‌లో ఏం ఉందో చూపించమని అంటాడు. ఇంట్లో అందరూ నిలదీయటంతో వైజయంతికి బ్యాగ్ ఓపెన్ చేయకతప్పదు.అందులో ఉన్న నోట్ల కట్టలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత డబ్బు నీకు ఎక్కడిదని సుదాకర్ నిలదీస్తాడు. ఎవరి దగ్గర ఇంత డబ్బు తీసుకొస్తున్నారని కౌషికి కూడా గట్టిగా అడుగుతుంది. ఈ డబ్బు నా ప్రెండ్ దగ్గర తీసుకొచ్చానని చెప్పగా...చాలా సవంత్సరాలు విదేశాల్లో ఉండి వచ్చిన ప్రెండ్ నీకు ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందని ధాత్రి ప్రశ్నిస్తుంది. ఇంత డబ్బు తీసుకుని ఇంట్లో వాళ్లకు తెలియకూడదని ఎందుకు అనుకుంటున్నారని కేదార్ నిలదీస్తాడు. యువరాజు, నిశిక కోసమే తీసుకున్నానని అనగా...నేనేమీ అమ్మను డబ్బులు అడగలేదని యువరాజు, నిషిక అంటారు. నా కొడుకు ఇంట్లో కూర్చుని ఉండటం చూడలేక నా బిడ్డ కోసమే ఈ డబ్బులు తీసుకుని వచ్చానని అంటుంది. దీంతో వైజయంతిపై కౌషికతోపాటు సుదాకర్ కూడా మండిపడతారు. యువరాజు మారడం కోసమే కదా...వాడికి డబ్బులు ఇవ్వడం లేదని అంటుంది. మీరు ఇలా చాటుమాటుగా డబ్బులు ఇస్తే ఎలా అని అంటుంది. ఈ డబ్బులు తిరిగి ఇచ్చేయమని సుదాకర్ అనగా...ఈ డబ్బు అప్పుగా తీసుకొచ్చింది కాదని...గతంలో నేను చేసిన సాయం గుర్తుపెట్టుకుని ఇప్పుడు కృతజ్ఞతగా తిరిగి ఇచ్చిందని చెబుతుంది. ఈసారికి వదిలేయండి..మరోసారి ఇలా తీసుకురానులే అని అంటుంది. వైజయంతి చెప్పిన మాటలు ధాత్రి, కేదార్‌కు నమ్మకం కుదరదు. అత్తయ్య ఏదో తప్పు చేస్తున్నారని...అందుకే ఆమె తడబడుతోందని ధాత్రి అంటుంది. ఖచ్చితంగా ఆ డబ్బు అత్తయ్య వాళ్ల ప్రెండ్ నుంచి తీసుకురాలేదని...మీనన్ నుంచే తీసుకొచ్చిందని అంటుంది. అత్తయ్యగారే మీనన్‌తో చేతులు కలిపినట్లు అనిపిస్తోందని అంటుంది. నిషిక కిడ్నాప్ అయినరోజు కూడా అత్తయ్య కనిపించలేదని...ఈరోజు కూడా ఆమె బయటకు వెళ్లిందని అబద్దం చెప్పిందని అంటుంది. పూజ రోజు కూడా కుంకుమ భరణిలు ఓపెన్ చేసే సమయానికి గ్యాస్ వాసన వస్తోందని అబద్ధం చెప్పిందని అంటుంది.నిజానికి అసలు ఆరోజు గ్యాస్ లీకేజీయే కాలేదని జగధాత్రి గుర్తుచేస్తుంది. మనల్ని దారి మళ్లించడానికే అలా అబద్ధం చెప్పిందని అంటుంది. అత్తయ్య మీనన్ కోసం పనిచేస్తున్నారో లేదో కనిపెట్టాలని అంటుంది. రూమ్‌లోకి వెళ్లిన తర్వాత నిషి కూడా వైజయంతిని నిలదీస్తుంది.నిజంగా ఈ డబ్బు మీ ప్రెండ్ దగ్గరే తెచ్చావా అని అడగ్గా....నిజమేనని వైజయంతి సమాధానమిస్తుంది. ఇంతలో మీనన్ మనిషిలాగా కేదార్ వైజయంతికి ఫోన్ చేస్తాడు. బాయ్ ఓ పార్సిల్ ఇవ్వమని చెప్పాడని..వచ్చి తీసుకోమని అంటాడు. ఆమె సరేననడంతో....ధాత్రి,కేదార్‌కు విషయం అర్థమవుతుంది. కానీ వెంటనే వైజయంతికి అనుమానం వచ్చి మాటమారుస్తుంది. మీనన్ మనిషితో నాకేంటి పని అని అంటుంది.
Jagadhatri Serial Today January 6th:వైజయంతి మీనన్ కోసం పనిచేస్తున్నట్లు జగధాత్రికి తెలిసిపోయిందా..? నోట్ల కట్టల గురించి నిలదీస్తే వైజయంతి ఎలా తప్పించుకుంది..?
ABP Desam | 06 Jan 2026 10:49 PM (IST)
Jagadhatri Serial Today Episode January 6th: మీనన్ ఇచ్చిన డబ్బులు వైజయంతి దగ్గర బయటపడటంతో ఇంట్లోఅందరూ నిలదీస్తారు. ప్రెండ్ దగ్గర తీసుకున్నానని అబద్ధం చెప్పినా ధాత్రి నమ్మదు.
జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్