Jagadhatri Serial Today Episode:కేదార్‌ నిర్దోషి అని న్యూస్‌లో రావడం చూసి ఆనందపడిపోయిన కౌషికి అందరినీ కిందకు పిలుస్తుంది. ఇంతలో జగధాత్రి, కేదార్‌ కూడా వచ్చేస్తారు. వైజయంతి, నిషిక వాళ్లను చూసి నిష్ఠూరంగా మాట్లాడటం చూసి సుధాకర్‌కు కోపం వస్తుంది. మీరు అసలు మనుషులే కాదని అంటాడు. దీంతో జగధాత్రి, కేదార్‌ సుధాకర్‌ను వారిస్తారు. అసలు తప్పు మా వైపు కూడా ఉంది మామయ్య అని ధాత్రి అంటుంది. కేదార్ తాత వేషంలో వచ్చిన వ్యక్తి చెప్పగానే నిజం తెలుసుకోకుండా మేం కూడా తొందరపడ్డామని అంటుంది. నేను కూడా బాబాయిపట్ల అలా ప్రవర్తించి ఉండకూడదని కేదార్ అంటాడు. మీరు మాత్రం ఏం చేస్తారు కళ్లతో చూసిందే నిజమనుకుంటారు కదా ఎవరైనా అని అంటాడు. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా అదే చాలని అంటాడు. దీనికి వైజయంతి, నిషిక మళ్లీ అడ్డుపడతారు. పోలీసులు, కోర్టులు మిమ్మల్ని నిర్దోషులుగా ప్రకటించి ఉండొచ్చు కానీ...తనను చంపడానికి ఎవరు ప్రయత్నించారో కమలాకర్‌కు మాత్రం తెలుసుకదా అని అంటారు. వీళ్లే సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటారని వైజయంతి అంటుంది. తనపై కత్తి దాడి చేసింది కేదార్‌ అని కమలాకర్‌ స్ఫష్టంగా చెబుతున్నాడు కాబట్టి...మీరు ఇంకా నేరస్తులేనని అంటుంది. వెంటనే కల్పించుకున్న ధాత్రి...మీరు చెబుతున్నది నిజమే అయితే అప్పుడు మేమే నేరస్థులమని ఒప్పుకుంటామని అంటుంది. నేనే స్వయంగా వెళ్లి కమలాకర్‌ మామయ్యను తీసుకుని వస్తానంటూ ఆయన రూమ్‌లోకి వెళ్తుంది.                    జగధాత్రిని చూడగానే కమలాకర్‌ కోపంతో రగిలిపోతాడు. మీరు పోలీసుల నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేరని అంటాడు. మీరు నిజం చెప్పండి మామయ్య ఎందుకు అబద్దం చెబుతున్నారని ధాత్రి నిలదీస్తుంది. మిమ్మల్ని సూరిబాబు కత్తి పొడిస్తే...కేదార్ పేరు ఎందుకు చెబుతున్నారని అంటాడు. నన్ను ఎవరు పొడిచినా...నేను మాత్రం కోర్టులో కేదార్‌ పేరే చెబుతానని అంటాడు. వాడిని శాశ్వతంగా జైలుకు పంపించే వరకు నిద్రపోనని అంటాడు. అయితే కేదార్‌తో పాటు మీరు కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండండని జగధాత్రి బెదిరిస్తుంది. కేదార్ తాత వేషంలో వచ్చినవాడు నిజం కాకపోవచ్చు, అతను చెప్పింది నిజం కాకపోవచ్చు...కానీ పాతికేళ్ల క్రితం కేదార్ వాళ్ల అమ్మ హత్య కేసులో మీరు ఉన్నారన్నది మాత్రం నిజమేకదా అని అంటుంది. ఆమె మాటలకు కమలాకర్‌ షాక్‌కు గురవుతాడు. నన్ను బెదిరించి భయపెట్టలేవని అంటాడు. నేను భయపెట్టాల్సిన పనిలేదని....మీకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేకపోయి ఉంటే ఇంత కంగారుపడేవాళ్లు కాదని..ఇంట్లో ఎవరికి చెప్పకుండా భయంతో మహల్‌ వరకు ఒక్కరే వెళ్లరని, అక్కడ కేదార్ వాళ్ల తాతయ్యను చంపడానికి ప్రయత్నించే వారు కాదని అంటుంది. మీ భయమే మిమ్మల్ని పట్టిస్తుందని అంటుంది. మీకు  ఆమె హత్య కేసుతో సంబంధం ఉన్నా లేకపోయినా....నేను మాత్రం సంబంధం ఉందనే పోలీసులకు ఆ డైరీ అందజేస్తానని అంటుంది. అప్పుడు 25 ఏళ్ల క్రితం మూసివేసిన కేసును వాళ్లు మళ్లి తిరగతోడతారని అంటుంది. ఆ మాటలకు కమలాకర్‌ ఉలిక్కిపడతాడు. మర్యాదగా మీరు కిందకు వచ్చి నిజం చెప్పకపోతే నేను అదే పని చేస్తానని అంటుంది. అప్పుడు కేదార్‌ కన్నా మీరే ముందు జైలుకు వెళ్లల్సి ఉంటుందని బెదిరిస్తుంది. దీంతో కమలాకర్‌ అందరి ముందుకు వచ్చి నిజం చెబుతాడు. కేదార్‌ మీద ఉన్న కోపంతోనే తాను అబద్ధం చెప్పానని...కేదార్ తనను కత్తితో పొడవలేదని అంటాడు. దీంతో కౌషికి, సుధాకర్‌ అందరికీ వినపడింది కదా అని అంటారు. మరోసారి కేదార్‌, జగధాత్రిని ఏమైనా అంటే సహించేది లేదని చెబుతారు.                    అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వాళ్లంతా కమలాకర్‌పై మండిపడతారు. జగధాత్రి బెదిరిస్తే మీరు ఎందుకు బెదిరిపోయారని అంటారు. అయినా కేదార్ వాళ్ల అమ్మ హత్యతో మీకు ఎలాంటి సంబంధం లేదు కదా మరి ఎందుకు భయపడుతున్నారని నిషిక నిలదీస్తుంది. ఇప్పుడు కేసు తిరగతోడారంటే ముందు నా దగ్గర నుంచే విచారణ ప్రారంభిస్తారని....వాళ్లను జైలులో వేయడం కోసం మనం జైలుపాలవ్వలేం కదా అని అంటాడు. దీంతో వాళ్లంతా నోరుమూసుకుని ఉంటారు. మంత్రి హత్య కేసులో మీనన్ అనుచరుడు దేవా ఉన్నాడని ఆధారాలు దొరకడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతుంటాడు.

Continues below advertisement

 

Continues below advertisement