Jagadhatri Serial Today Episode: పిజ్జా బాక్స్‌లో  కెమెరా పెట్టి అభికి ఇచ్చిన జేడీ....అది మీ అక్క ఆర్డర్‌ పెట్టిందని అబద్ధం చెబుతుంది. దీంతో పిజ్జా బాక్స్‌ తీసుకుని అభి నేరుగా సూరిబాబు అన్న రూమ్‌కు వెళ్తాడు. అక్కడ కేదార్ తాత వేషంలో ఉన్న సూరిబాబును వాళ్లు కెమెరా ద్వారా చూస్తారు. ఇదే విషయాన్ని సాధూ కడా చూస్తుంటాడు. అబి, సూరిబాబు ఇద్దరూ కలిసి ఇష్టంగా పిజ్జా తింటుంటారు. వెంటనే సాధూ సార్ జేడీకి ఫోన్‌ చేసి ఈ ఆధారం చాలు వెంటనే  మేజిస్ట్రేట్‌ను కలిసి  హోంమంత్రి ఇల్లు తనిఖీ చేసేందుకు సెర్చ్ వారెంట్ తీసుకుంటానని చెబుతాడు. మీరు ఏం కంగారు పడొద్దుసార్‌ మనం అసలు తాయర్ ఇల్లు తనిఖీ చేయకుండానే సూరిబాబు వాడంతట వాడే స్టేషన్‌కు వచ్చేస్తాడని చెబుతుంది. అలా ఎలావస్తాడని అడిగితే నాకు  ఒక అరగంట టైం ఇవ్వండి చాలు అని జేడీ చెబుతుంది. దీంతో సాధుసార్‌ సరేనంటాడు.               సాధు సార్‌ ఫోన్‌ పెట్టేసిన తర్వాత జేడీ ఆఫీసు మొబైల్‌ తీసుకుని హోంమంత్రి తాయర్‌కు ఫోన్‌చేస్తుంది.నేను కమిషనర్‌ దగ్గర ఉండే కానిస్టేబుల్‌ను మాట్లాడుతున్నానని....మీ ఇంట్లోనే సూరిబాబు ఉన్నాడన్న సంగతి ఆ జేడీ,కేడీలకు తెలిసిపోయిందని..వారు ఇప్పుడు మీ ఇంటికే వస్తున్నారని ఈసంగతి మీకు చెప్పమని మా కమిషనర్‌ సార్‌ చెప్పారని చెబుతుంది. ఆ మాటలు నమ్మని హోంమంత్రి....అసలు నువ్వు ఎవరు,మా ఇంట్లో ఎవరూ లేరని దబాయిస్తుంది.అయితే మీ ఇంటికి పిజ్జా బాక్సు వచ్చిందా అని అడుగుతుంది...అప్పుడే అబి పిజ్జా తింటూ వస్తాడు.ఎక్కడిదిరా  పిజ్జా అని అడిగితే...నువ్వే ఆర్డర్ పెట్టావని పిజ్జా డెలివరీ అమ్మాయి చెప్పిందని చెబుతాడు.  ఆ పిజ్జాబాక్స్‌లో కెమెరా ఉంది చూడండని ఫోన్‌లోఅవతలి నుంచి చెప్పగానే...వాళ్లిద్దరూ చూసి తల బాదుకుంటారు. వెంటనే మీఇంట్లోఉన్న  సూరిబాబును సేఫ్‌ ప్లేస్‌కు పంపించేయండని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దీంతో కంగారుపడిన తాయర్‌....వాడిని వెంటనే మన గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లమని అబికి చెబుతుంది.                              అబి వెంటనే సూరిబాబును తీసుకుని కారులో గెస్ట్‌హౌస్‌కు బయలుదేరతాడు. ఇంటిముందు ఉన్న కానిస్టేబుల్‌ ఆ కారునే ఫాలో అవుతూ  జేడీకి చెబుతాడు. అభి వెళ్లాల్సిన రూట్‌లో రోడ్డు రిపేర్‌లో ఉందంటూ  జేడీ డైవర్ట్‌ చేస్తుంది.ఎటు వెళ్లిన అక్కడ రూట్‌ రిపేర్ బోర్డులు కనిపిస్తాయి. చివరకు తిరిగి తిరిగి అభి పోలీసుస్టేషన్‌ ముందుకు వచ్చి ఆగుతాడు.అక్కడ జేడీ, కేడీ ఇద్దరూ ఉంటారు. వాళ్లను చూడగానే అభికి భయం వేస్తుంది.ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తుండగా...నువ్వు రాలేదు మేం రప్పించామని జేడీ చెబుతుంది. వెంటనే రమ్య సూరిబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో పెడుతుంది. అప్పుడే తాయర్‌ అభికి ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు వెళ్లడానికి ఇంత టైం పట్టింది ఎందుకని నిలదీస్తుంది. వెంటనే ఫోన్ అందుకున్న జేడీ తాయర్‌కు వార్నింగ్ ఇస్తుంది. నీ అంతట నువ్వే నిందితుడిని పోలీసు స్టేషన్‌కు పంపేలా చేశానని చెబుతుంది. వాడికి నాకు ఏం సంబంధం లేదని చెప్పగా... మీరే ఇతన్ని కేదార్ తాతలో మహల్‌కు పంపారని, అక్కడ కమలాకర్‌పై హత్యాయత్నం చేసి ఆకేసు కేదార్‌ మీద పడేలా చేశారన్న సంగతి కూడా మాకు తెలుసని చెప్పడంతో హోంమంత్రి అదిరిపడుతుంది. త్వరలోనే నిన్ను  జైలుపాలు చేయడం ఖాయమని హెచ్చరిస్తుంది.                          సాధుసార్‌ ఏమైందంటూ మరోసారి జేడీకి ఫోన్‌చేసి అడగ్గా....నిందితుండు వాడంతట వాడే వచ్చి స్టేషన్‌కు చిక్కాడని చెబుతుంది. అయితే వెంటనే ప్రెస్‌ను పిలిచి హోంమంత్రి తాయర్‌ పేరు కూడా యాడ్‌ చేసి కాపీ రిలీజ్‌ చేయండని చెబుతాడు. నేను డీజీపీతో మాట్లాడతానని అంటాడు. సాధూ చెప్పినట్లే జేడీ చేస్తుంది.ఇంతలో ఇంట్లో వార్తలు వింటున్న కౌషికి చాలా సంతోషపడుతుంది. కమలాకర్‌పై హత్యాయత్నం కేసులో కేదార్ పాత్ర ఏమీలేదని పోలీసులు తేల్చారని....సూరిబాబు ఈ పని చేశాడని చెప్పడంతో ఆమె ఎంతో సంతోషిస్తుంది.సుధాకర్‌ వెంటనే జగధాత్రి, కేదార్‌కు ఫోన్ చేసి  ఇంటికి పిలవమని చెబుతాడు.

Continues below advertisement

 

Continues below advertisement