Jagadhatri Serial Today Episode: కేదార్‌ను కేసులో ఇరికించే మంచి ఛాన్స్‌ మిస్సయ్యిందని కమలాకర్‌ బాధపడుతుంటే...మనుషులను పెట్టి బయట లేపించేద్దామని యువరాజు అంటాడు. దీనికి నిషిక చాలా కోప్పపడుతుంది. వాడిని లోపల వేయించాలని చూసి నువ్వు శాశ్వతంగా  లోపల ఉండపోయేలా చేయకని అరుస్తుంది. దీనికి కమలాకర్‌ కూడా వద్దని అంటాడు. ఈ టైంలో మనం ఏంచేసినా అది మన మెడకు చుట్టుకుంటుందని అంటాడు. వాళ్లకు ఆధారాలు దొరక్కుండా ఉండాలని కోరుకోవడమే మనం ఇప్పుడు చేయాల్సిన పని అని చెప్పి వారిస్తాడు.                    రంగా పరిటాలలో ఉన్నాడని తెలుసుకుని జేడీ, కేడీ అక్కడికి బయలుదేరతారు.అటు పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ ఇచ్చిన సమచారంతో దేవా కూడా వాడికోసం వస్తాడు. కస్తూర్బా బాలికల హాస్టల్‌ వద్దకు చేరుకున్న జేడీ...రంగా గురించి వాకబు చేస్తంది.అలాంటి వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని చెబుతారు. ఫొటో చూపించగానే  ఇతని పేరు రాములని...మూడురోజుల క్రితమే పనిలో చేరాడని చెబుతాడు. అతను ఎక్కడ ఉన్నాడని అడగ్గా...చూపిస్తారు. పోలీసులను చూడగానే అతను పరుగెత్తుతాడు.జేడీ, కేడీ పట్టుకుని ధైర్యం చెబుతాడు.ఆరోజు కేదార్‌ బాబు మహల్‌లోకి రాగానే....మారువేషంలోఉన్న తాత సూరిబాబే..కమలాకర్‌ను పొడిచి చంపేశాడని చెబుతాడు. ఈ విషయం జగధాత్రికి చెబుదామని అనుకున్నా నా ఫోన్‌ పోవడం వల్ల చెప్పలేకపోయానని, భయంతో ఇక్కడికి వచ్చి దాక్కున్నానని అంటాడు. అయితే ఈ విషయం కోర్టులో చెప్పగలవా అని అంటే చెబుతానని అంటాడు.  రంగాను తీసుకుని వెళ్తుండగా దేవా తన మనుషులతో వచ్చి అడ్డుకుంటాడు. జేడీ, కేడీ వాళ్లందరినీ తన్ని రంగాను తీసుకుని వెళ్లిపోతారు.                             దేవా ఈ విషయం మీనన్‌కు చెప్పగా...బాగా తిడతాడు. వెంటనే హోంమంత్రికి ఫోన్‌చేసి విషయం చెబుతాడు.మన సూరిబాబు కమలాకర్‌ను చంపుతుండగా వాచ్‌మెన్ చూశాడని...ఇప్పుడు వాడు జేడీ కంట్రోల్‌లో ఉన్నాడని చెబుతాడు.  ఆ సూరిబాబ బయటకు వచ్చాడంటే నీకే ప్రమాదమని హెచ్చరిస్తాడు. వాడు మాఇంట్లోనే నా దగ్గరే ఉన్నాడని హోంమంత్రి చెబుతుంది. ఇంతలో జేడీ,కేడీ సాదూసార్‌ను కలిసి అసలు విషయం చెబుతారు. రంగాను పట్టుకున్నంత మాత్రానా మనం ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేమని...ఖచ్చితంగా సూరిబాబు దొరకాలని అంటాడు. వాడు హోంమంత్రి సంరక్షణలో ఉన్నాడని  అందుకే ఆమెకు చెందిన అన్ని గోదాములు, ఫ్యాక్టరీల్లో మన మనుషులు సెర్చ్ చేశారని....కానీ ఆమె వాడిని ఇంట్లోపెట్టుకుందని కాబట్టి హోంమంత్రి తాయర్ ఇల్లు సెర్చ్‌ చేయడానికి వారెంట్ కావాలని అడుగుతారు. మేజిస్ట్రేట్ ఎట్టిపరిస్థితుల్లోనూ వారెంట్ ఇవ్వరని....సాధూ  చెబుతాడు. హోంమంత్రికి వాడిని కాపాడటం కన్నా చంపడం చాలా ఈజీ అని...కాబట్టి ఆ పని చేసేలోగా మనం సూరిబాబును అరెస్ట్ చేయాలని జేడీ అంటుంది. నువ్వు చెప్పేది నిజమే అయినా మనం హోంమంత్రి ఇల్లు సెర్చ్‌ చేయలేమని చెబుతాడు. ఆ ధైర్యంతోనే  తాయర్‌ వాడిని ఇంట్లోనే పెట్టుకుందని అంటాడు. అయితే వాడు ఇంట్లోనే ఉన్నాడన్న  రుజువు చూపిస్తే....మేజిస్ట్రేట్‌ అనుమతి ఇస్తాడు కదా అని అంటుంది. తప్పకుండా సెర్చ్ వారెంట్ దొరుకుతుందని చెప్పడంతో....అయితే వాడు  ఇంట్లోనే ఉన్నాడన్న ఆధారాలు తీసుకొస్తాతనని బయటకు వస్తుంది.   సూరిబాబ హోంమంత్రి ఇంట్లోనే ఉన్నాడని ఆధారాలు మనం ఎక్కడి నుంచి తీసుకురాగలమని అనగా....తాయర్ ఇంటికి పిజ్జా ఆర్డర్‌ పెడుతుంది. ఆ పిజ్జా తీసుకుని వచ్చిన బాయ్‌ను అక్కడే ఉండమని చెప్పి....ఆ పిజ్జా తీసుకుని జేడీ ఇంట్లోకి వెళ్తుంది. ఆ పిజ్జా పెట్టెకు సీక్రెట్ కెమెరా పెడుతుంది. అదంతా రికార్డు చేస్తుంటుంది. ఆ పిజ్జా తీసుకెళ్లి అబికి ఇస్తుంది.