Jagadhatri Serial Today Episode :మీనన్‌ కాల్పుల్లో గాయపడిన జేడీకి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది.ఆమె చేతిలో నుంచి బుల్లెట్ బయటకు తీసి కట్టుగడతారు.అప్పుడే అక్కడికి వచ్చిన సాధు....జేడీకి ధైర్యం చెబుతాడు.ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ పూర్తయ్యిందని చెప్పడంతో సాధూతోపాటు జేడీకూడా లోపలికి వెళ్లి జగధాత్రిని పలకరిస్తారు.ఇప్పుడు ఎలా ఉందని అడిగితే బాగానే ఉందని చెబుతుంది. మీనన్‌ చనిపోయాడని...ఇక మనకు ఎలాంటి భయం అవసరం లేదని చెబుతాడు సాధుసార్‌...మీనన్ చనిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదని జేడీ అంటుంది. మా కళ్లతో మేం చూశామని...ఇప్పుడు అంత్యక్రియలు కూడా చేస్తున్నారని చెబుతాడు. 25 ఏళ్ల క్రితం వాడిని మీ అమ్మ రోడ్డుపై ఉరికించి కొట్టిందని...ఆమె చనిపోయిన తర్వాత వాడిని టచ్‌చేసే పోలీసు లేకుండా పోయాడని...మళ్లీ ఇన్నాళ్లు ఆమె కూతురిగా నువ్వు వాడిని మట్టుబెట్టావని సాధుసార్‌ అంటాడు. మీ అమ్మ ఏ లోకంలో ఉన్నా  ఇది చూసి చాలా సంతోషిస్తుందని అంటాడు. దురదృష్టవశాత్తు మన డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇద్దరు చనిపోయారని చెబుతాడు.ఇప్పుడు నేను అక్కడేకి అంత్యక్రియలు కోసం వెళ్తున్నానని అంటాడు. నేను కూడా  వస్తానని జేడీఅంటే...రెస్ట్‌ తీసుకోమని చెబుతాడు. లేదు నేను వస్తానని ఆమె అంటుంది. సరే నువ్వు రెడీ అవ్వు ప్రెస్‌మీట్‌కి రావాలని చెప్పి బయటకు వెళ్లిపోతాడు.                    జేడీ,కేడీఇద్దరే ఆరూమ్‌లో ఉండి మాట్లాడుకుంటుండగా....కౌషికి, సురేష్‌ జేడీని చూడటానికి ఆస్పత్రికి వస్తారు. వాళ్లు రావడం కొద్దిదూరంలోనే చూసిన జేడీ...వదిన వస్తోందని చెప్పడంతో కేధార్ వెంటనే రెండు మాస్కులు తీసుకొచ్చి జేడీకి  ఒకటి ఇచ్చి తాను  ఒకటి పెట్టుకుంటాడు.  ఇంతలో లోపలికి వచ్చిన కౌషికి జేడీకి కృతజ్ఞతలు చెబుతుంది. తాను ఆపదలోఉన్న ప్రతిసారీ నువ్వు దేవతలా ఉంచి ఆదుకుంటున్నావని అంటుంది. నీకు ఏం కావాలో చెప్పు అని అంటుంది. నాకు  ఏం వద్దని జేడీ బదులిస్తుంది. నువ్వు అలాంటిదానివి కాదని తెలిసినా...నా సంతృప్తి కోసమైనా ఏదో ఒకటి కోరుకోమని చెబుతుంది. నిజంగా నాకు అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతానని జేడీ చెప్పడంతో...కౌషికి ఆమె చేతిలో చేయి వేసి హామీ ఇస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితులో ఏదీ అడిగినా ఇవ్వడానికి నేను రెడీ అని హామీ ఇస్తుంది. పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పి  కౌషికి, సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.                             మీనన్ చనిపోయాడని ఇక అతని ఫైల్‌ క్లోజ్ అయిపోయినట్లేనని జేడీ ప్రెస్‌మీట్‌లో చెప్పి....చనిపోయిన పోలీసుల అంత్యక్రియలు చూడటానికి వెళ్తుంది.అక్కడ ఇద్దరి పోలీసులతోపాటు మీనన్ అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేస్తారు. పోలీసులిద్దిరికీ నివాళులు అర్పించిన అనంతరం మీనన్‌ మృతదేహం వద్దకు వెళ్లి జేడీ పరిశీలిస్తుంది. కేదార్‌కు అనుమానం వచ్చి ఏమైందని అంటాడు. మీనన్ చనిపోయాడంటే  ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని  అంటుంది. నీ చేతులతో నువ్వు కదా కాల్చి చంపావని జేడీ  అన్నా కూడా....25 ఏళ్లుగా ఎన్నో తిప్పలు పెట్టిన మీనన్‌ ఇలా  ఒక్క బుల్లెట్‌కే పోతాడంటే మాత్రం అస్సలు ఊహించలేకపోతున్నానని అంటుంది.నాకే ఈ నిజం జీర్ణించుకోవడానికి సమయం పడుతుందనుకుంటా అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అటు యువరాజు మాత్రం మీనన్ చనిపోయాడంటే  అస్సలు నమ్మడు.  దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుకుంటాడు. మీనన్ ఇంత ఈజీగా చనిపోయేరకం కాదని అనుకుంటాడు. అతను అనుకున్నట్లు మీనన్ చనిపోడు. మూడు శవాలు కాలుతుంటే వాటి మధ్యలో నుంచి మీనన్ నవ్వుకుంటూ వస్తాడు.