Jagadhatri Serial Today Episode : సీఎంను చంపేందుకు మీనన్ తప్పకుండా ఎటాక్ చేస్తాడని ఊహించిన జేడీ, కేడీ....ఛానెల్ బయట సెక్యూరిటీ బాగా టైట్‌ చేస్తారు. తమ అనుమాతి లేకుండా ఎవరినీ లోపలికి పంపించొద్దని చెబుతారు. స్టాఫ్‌ను కూడా బాగా తనిఖీ చేసిన తర్వాతే పంపించమని చెబుతుంది. దీంతో మీనన్‌  ఆ ఛానెల్‌ మేనేజర్‌ భార్యాబిడ్డలను కిడ్నాప్‌ చేసి వాళ్లను చంపుతామని బెదిరిస్తాడు. తన మనిషి టీనాను లోపలికి తీసుకెళ్లాలని ఆదేశిస్తాడు. అప్పుడే టీనాను మీనన్ ఛానెల్‌ కార్యాలయం వద్దకు తీసుకొస్తాడు.మెయిన్  ఎంట్రన్స్‌లో ఉన్న జేడీ,కేడీని చూసి ఆగుతాడు. టీనా నేరుగా ఆఫీసులోకి వెళ్లబోతుండగా....జేడీ ఆపి వివరాలు అడుగుతుంది.ఐడీకార్డు ఎక్కడ అని అడిగితే తీసి మెడలో వేసుకుంటుంది. ఈ దారిలో సీఎంగారు వెళ్తారని అందుకే స్టాఫ్‌ను రెండో గేట్ నుంచి వెళ్లాలని చెప్పామని చెబుతుంది. దీంతో టీనా కంగారుపడుతుంది. తనకు రెండోగేట్ తెలియదు కదా ఎలా అని అనుకుంటుంది.  రోజూ ఆఫీసుకు వచ్చే నీకు రెండో గేట్‌ తెలియకపోవడం ఏంటని ధాత్రి ప్రశ్నిస్తుంది. తాను కొత్తగా వచ్చానని అందుకే తెలియదని చెబుతుంది. అయితే హెచ్‌ఆర్‌ నుంచి ఎవరైనా వచ్చి చెబితేనే పంపిస్తామని చెబుతుంది.ఇంతలో మేనేజర్ రావు అక్కడికి వచ్చి ఈ అమ్మాయి మా ఆఫీసు అమ్మాయేనని లోపలికి పంంపించమని చెబుతాడు. కానీ అతని ముఖంలో కంగారు చూసి ధాత్రికి అనుమానం వస్తుంది. వెంటనే టీనాను తీసుకుని రావు లోపలికి వెళ్లిపోతాడు. సీఎం ప్రోగ్రాం జరుగుతున్న ఫ్లోర్‌లో ఉంచుతాడు. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు టీనా ఫోన్‌లో మీనన్‌కు చెబుతుంటుంది.                  మేనేజర్‌ రావు వ్యవహారంపై అనుమానం వచ్చిన జగధాత్రి అతను ఎక్కడ ఉన్నాడో చూడమని జేడీని పంపుతుంది. జేడీ లోపలకి వెళ్లి రావు, ఆయనతోపాటు వచ్చిన అమ్మాయి కూడా కనిపించడం లేదని చెప్పడంతో ...ధాత్రి వెంటనే టెర్రస్‌మీదకు చేరుకుంటుంది.అక్కడ మేనేజర్ రావు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉండటం చూసి ధాత్రి అతనికి నచ్చజెబుతుంది.  ఇప్పుడు నేను ఏం చేయలేనని...నా ఫ్యామిలీ చాలా కష్టంలో ఉందని చెబుతాడు. అతను ఎంత చెప్పినా వినకపోవడంతో  ధాత్రి కేదార్‌కు ఫోన్‌చేసి పైకి రమ్మనిచెబుతుంది.ధాత్రి మేనేజర్‌ను మాటల్లో పెట్టగా....కేడీ వెంటనే అతన్ని గోడమీద నుంచి కిందకు లాగేస్తుంది.  అప్పుడు వాళ్లిద్దరూ కలిసి మేనేజర్‌ను అడగ్గా....సీఎం మాట్లాడుతున్న మైక్‌కు  కరెంట్‌ షాక్‌ వచ్చేలా సెట్‌ చేశారని చెబుతాడు.  అలాగే  ఆ తర్వాత రెండు బాంబులు పేల్చేలా ప్లాన్ చేశారని వివరిస్తాడు. ఇంతలో కౌషికి సీఎంను ఇంటర్వూ  చేస్తూ....మీనన్‌ జడ్జిని చంపే వీడియో నేను తీశానని కావాలంటే ఇప్పుడు ప్రదర్శిస్తానని చెబుతుంది. సీఎం సరేనంటూ  మైక్‌ పట్టుకోగానే షాక్‌తగిలి కిందపడిపోతాడు. ఇంతలోజేడీ,కేడీ ఇద్దరూ  కలిసి ఆఫీసులో బాంబు పెట్టారని అందరూ వెళ్లిపోవాలని చెప్పి స్టాఫ్‌ మొత్తాన్ని బాయటకు పంపిస్తారు. దీంతో టీనా  కూడా బయటకు పరుగెత్తుతూ ఉంటే జేడీ కంట్లోపడుతుంది. వెంటనే ఆమెను కొట్టి అదుపులోకి తీసుకుంటుంది. అంతకు ముందే జేడీ తనను  చూసి గుర్తుపట్టేసిందని  టీనా మీనన్‌కు చెబుతుంది.  జేడీ నిన్ను చూసిందంటే...మన ప్లాన్ తెలిసిపోయిందన్న మాట అంటాడు.ఎట్టి పరిస్థితుల్లోనూ  ఆ బాంబులు పేలాల్సిందేనని నేను  నేరుగా రంగంలోకి దిగుతానంటూ  మీనన్ రావడానికి ట్రై చేస్తాడు.