Jagadhatri Serial Today Episode: డ్రైవర్ ధాత్రి, కేదార్ లను తోసేసి పారిపోతుంటాడు. కొద్ది దూరం పరిగెత్తగానే కారులో ఎవరో వచ్చి ఆ డ్రైవర్ గొంతు కోసి వెళ్లిపోతారు. వెనకే వచ్చిన ధాత్రి, కేదార్.. అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్తారు. హాస్పిటల్ లో డాక్టర్ అతనికి ట్రీట్‌మెంట్ చేస్తుంటాడు. ధాత్రి, కేదార్ ఆలోచిస్తూ.. మీనన్ మనుషులు ఎవరైనా అటాక్ చేశారా? అని అనుమానిస్తుంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి అతడిది యాక్సిడెంట్ కాదు.. మర్డర్ అటెంప్ట్.. ఎవరో కత్తితో పొడిచారని చెప్పి అతడు ఎంత రోజులు బతుకుతాడో డౌటేనని అంటాడు. అతన్ని చూడటానికి లోపలికి వెళ్తారు ధాత్రి, కేదార్.
ధాత్రి: సార్ ఎలా ఉంది మీకు..
డ్రైవర్: నా భార్య..
కేదార్: మీ భార్యకు ఏం కాదు.. మీకు ఏం కాదు. మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారు. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పండి.
ధాత్రి: చూడండి మీరు ఇన్వాల్వ్ అయింది. దేవుడి విషయంలో ఒక వేళ మనుషులు మిమ్మల్ని శిక్షించలేకపోయినా.. ఆ దేవుడి నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు. ఇప్పటికైనా ఈ కేసు వెనక ఎవరెవరు ఉన్నారో చెప్పండి. మీరు నిజం చెప్తే ఆ దేవుడి మిమ్మల్ని కాస్తైన క్షమిస్తాడు.
డ్రైవర్: ప్రొఫెసర్ గారి చావుకు నేను కూడా ఒక కారణం.
ధాత్రి: ప్రొఫెసర్ ను చంపింది. మీరా..?
డ్రైవర్: చంపింది నేను కాదు మేడం. కానీ నేను అబద్దం చెప్పి తీసుకెళ్లడం వల్లే ఆయన చంపబడ్డాడు.
ధాత్రి: అసలు మీరేం అబద్దం చెప్పారు. ఆయన్ని ఎవరు చంపారు కాస్త వివరంగా చెప్పండి.
అని ధాత్రి అడగ్గానే డ్రైవర్ నిజం చెప్తాడు. తమ ఊరి గుడిలో బయట పడిన బంగారు నిధి విషయం గురించి మొత్తం చెప్తాడు. నిధికి కాపలాగా ఉన్న కావ్య గురించి నిధి గురించి అందులో ఉన్న ఇత్తడి, రాగి రేకుల గురించి తెలుసుకున్న మీనన్ గురించి చెప్తాడు. నిధి ఎత్తుకుపోయిన మీనన్ ప్లాన్ గురించి అప్పుడు జరిగిన కావ్య మెడకు చుట్టుకున్న నిధి దొంగతనం గురించి చెప్తాడు. అప్పుడు తాను మీనన్ దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నానని నేనే వెళ్లి ప్రొఫెసర్ ను అబద్దం చెప్పి మీనన్ దగ్గరకు తీసుకొచ్చానని చెప్తాడు.
డ్రైవర్: అక్కడ మీనన్ తో పాటు ఇంకా ఎవరో ఉన్నారని నాకు అనిపించింది. ఎవరున్నారో చూద్దామని ప్రయత్నించాను.
ధాత్రి: మీనన్‌తో ఇంకెవరున్నారో చూశారా?
డ్రైవర్: నన్ను గమనించిన ఆ మీనన్ నేను దగ్గరకు వెళ్లినప్పుడల్లా.. కోపంగా సైగలతో నన్ను బయటకు వెళ్లమని చెప్పాడు. దాంతో చేసేది ఏం లేక నేను బయటకు వెళ్లిపోయాను. కానీ ఆ మీనన్ వాలకం చూస్తే మాత్రం లోపల ఎవరో పెద్దమనిషే ఉన్నాడనిపించింది.
ధాత్రి: మీరు అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు.
డ్రైవర్: చెప్పగలను మీనన్‌తో పాటు ఎవరో ప్రముఖ వ్యక్తి అయితే కచ్చితంగా ఉన్నాడు.
అని చెప్తాడు. తర్వాత లోపలికి వెళ్లిన ప్రొఫెసర్ బయటకు వచ్చి వెళ్లిపోతుంటే మీనన్ వచ్చి నన్ను ఆ ప్రొఫెసర్ ను ఫాలో అవ్వమని చెప్పతాడు. నేను ఆయన్ని ఫాలో అవ్వగానే ఆయన వెళ్లి ఒక జర్నలిస్టును కలిసి.. తాళపత్ర గ్రంథాలను రాగిరేకును ఆ జర్నలిస్టుకు ఇచ్చాడు. అదంతా నేను మీనన్‌కు ఫోన్ చేసి చెప్పాను. మీనన్ ప్రొఫెసర్ ను చంపేద్దామని బయలుదేరాడు. అని చెప్తాడు డ్రైవర్. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!