Jagadhatri  Serial Today Episode:  కౌషికిని రెస్ట్‌ తీసుకోమని నేను  నిషికి ఆఫీసుకు వెళ్తామని  చెప్తుంది వైజయంతి. అయితే  మీతో పాటు జగధాత్రిని కూడా తీసుకుపోండి పిన్ని అని చెప్తుంది కౌషికి.  అక్కడ వాళ్లతో ఓపికగా మాట్లాడాలి. అది నిషిక చేయలేదని చెప్తుంది. యువరాజ్‌ మాత్రం ఇదే మంచి టైం అనుకుని వాళ్లందరూ బయటకు వెళ్లాక విగ్రహాన్ని మార్చాలనుకుంటాడు. నిషిక ధాత్రి ఎందుకు అని అడగ్గానే యువరాజ్‌ కూడా ధాత్రిని తీసుకెళ్లు అక్క చెప్పినట్టు విను అంటాడు. ఆఫీసులో అందరూ నిన్ను బాస్‌ లా చూస్తుంటే వాళ్లను పనోళ్లుగా చూస్తారు అని చెప్తాడు. దీంతో నిషిక సరే అంటుంది. అందరూ కలిసి ఆఫీసుకు వెళ్తారు. ధాత్రి ముందు నడుస్తుంటే..


నిషిక: ఏయ్‌ ఆగవే.. నువ్వు నడవాల్సింది నా వెనకాల..ముందు నడుస్తున్నావేంటి?


ధాత్రి: నీ కళ్లు ఎప్పుడూ నెత్తి మీదే ఉంటాయి కదా నిషి. చూసుకోకుండా ముందుకు నడుస్తూ కింద పడిపోతావేమోనని నేను ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తున్నాను.


కేదార్‌: నీ  ప్రశ్నకు ఆన్సర్‌ దొరికింది అంటే  మేము  లోపలికి వెళ్తాం నిషి. అందరూ వెయిట్‌ చేస్తూ ఉంటారు.


ధాత్రి: రా కేదార్ వెళ్దాం.


వైజయంతి: ఆగు  నిషి మనం ఇప్పుడు కయ్యానికి రాలేదు. నిన్ను సీఈవోను చేయడానికి వచ్చుండాము.


నిషిక: సరే అత్తయ్యా ఇంటికి వెళ్లాక దీని పని చెప్తాను. అవును  అత్తయ్యా కాచి వాళ్లు రెడీగా ఉన్నారా?


వైజయంతి: ఇద్దరూ రెడీగా ఉన్నారు.


 అని ఇద్దరూ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన ధాత్రి, కేదార్‌ లను బోర్డు మెంబర్స్ అందరూ విష్‌ చేస్తుంటారు. బయటి నుంచి చూస్తున్న నిషిక కుళ్లుకుంటుంది. నిషిక లోపలికి వచ్చి మమ్మల్ని ఏమైనా పరిచయం చేసేది ఉందా? అంటూ రాఘవరావును అడగ్గానే  ధాత్రిని సుధాకర్‌ గారి పెద్దకోడలని.. నిషికను చిన్న కోడలని పరిచయం చేస్తాడు. దీంతో వైజయంతి, నిషిక షాక్‌ అవుతారు.  


నిషిక: అది మా ఇంటి పెద్ద కోడలు అని మీకు ఎవరు చెప్పారు.


రాఘవరావు: కౌషికి గారండి.


నిషిక: దీనికి వజ్రపాటి వంశానికి ఏ సంబంధం లేకపోయినా ఒకమాటను పట్టుకుని నలుగురిలో సంస్కారం లేని మాటలు మాట్లాడే అలవాటు మీకు ఉందేమో కానీ విని ఊరుకునే సంస్కారం మాది కాదు.


ధాత్రి: నిషి పక్కకు  రా నీతో మాట్లాడాలి.


నిషిక: నీతో మట్లాడాల్సిన అవసరం నాకు లేదు. చెప్పండి రాఘవరావు గారు. మీరు  దీన్ని మా ఇంటి పెద్ద కోడలుగా ఎలా పరిచయం చేస్తారు.


రాఘవరావు: అంటే కౌషికి గారు జగధాత్రి గారు మీ అక్క అని చెప్పారు. మీ అక్క అంటే పెద్దకోడలు లాంటిదే కదా? అందుకే అలా అన్నాను మేడం.


 అనగానే వైజయంతి ఏదో సర్ది చెప్తుంది. ఇంతలో బోర్డు మెంబర్స్‌ మీటింగ్‌ స్టార్ట్‌ చేద్దాం అంటారు. ఇంతలో నిషిక సీఈవో సీట్లో కూర్చుంటుంటే ధాత్రి చైర్‌ పక్కకు లాగుతుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. తర్వాత బోర్డు మెంబర్స్‌ తో ధాత్రి కౌషికి గురించి మాట్లాడుతుంది. కంపెనీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది. ఇంతలో నిషిక మీరు కంపెనీ టెంపరర్రీ సీఈవోను అపాయింట్‌  చేసినా  బాగుంటుంది అని చెప్తుంది నిషిక. దీంతో బోర్డు మెంబర్స్‌ అందరూ ఆలోచనలో పడిపోతారు. నిషికి చెప్పింది మాకు  కరెక్టే అనిపిస్తుంది అని చెప్తారు.


వైజయంతి: వయసు  తక్కువున్నా.. అనుభం లేకపోయినా నిషిక సామర్థ్యం ఉన్న అమ్మాయి. కంపెనీనీ కౌషికిలాగా ముందుకు తీసుకెళ్లే అమ్మాయి. నిషికకు ఒక్క అవకాశం ఇవ్వండి.


ధాత్రి: అత్తయ్యా గారు మీరు  పక్కకు రండి మీతో మాట్లాడాలి.


కేదార్‌: పిన్ని మనం వచ్చింది ఇది చేయడానికి కాదు కదా? పిన్ని.


 అంటూ ఇద్దరూ కలిసి వైజయంతిని పక్కకు  తీసుకెళ్తారు. నిషిక బూచికి గో హెడ్‌ అని మెసేజ్‌ పెడుతుంది. దీంతో సుధాకర్‌  రూంలోకి వెళ్లిన బూచి సుధాకర్‌ ఫోన్‌ నుంచి, కాచి, కౌషికి ఫోన్‌ నుంచి బోర్డు మెంబర్స్ కు మెసేజ్‌ చేస్తారు. మెస్సేజ్‌ చూసుకున్న బోర్డు మెంబర్స్‌ ఆలోచిస్తుంటారు. కాచి, బూచి మళ్లీ మెసేజ్‌ లు డిలీట్‌ చేస్తారు. మరోవైపు నిషిక రమ్యను ఆఫీసులో సెట్  చేస్తుంది.  అందరూ నన్నే సీఈవోగా ఎన్నుకునేలా చేయాలని చెప్తుంది. సరే అంటుంది రమ్య. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.