Jagadhatri Serial Today Episode: నిషికకు ఫోన్ రావడంతో పైకి వెళ్తుంది. దీంతో కేదార్ ఫోన్ రాగానే నిషిక పైకి వెళ్తుంది. వెనకే ధాత్రి వెళ్తుంది. ఆఫీసు నుంచి రమ్య ఫోన్ చేసి నిషికకు కంపెనీకి మీరే సీఈవో అయ్యారని రేపు ఆఫీసులో మీరే సీఈవో అని అనౌన్స్ చేయబోతున్నారు. ఎల్లుండి మన పేపర్ ఫ్రంట్ పేజీలో వేయబోతున్నారు అని చెప్పడంతో నిషిక సంతోషంగా ఎగిరిగంతేస్తుంది. నిషికను చూసి ధాత్రి ఆలోచిస్తుంటే.. నిషిక చూసి దగ్గరకు పిలిచి ఏం వింటున్నావు అని అడుగుతుంది. ఏం లేదని రాత్రికి ఏం తింటావని అడగడానికి వచ్చానని చెప్తుంది. దీంతో ధాత్రిని తిట్టి పంపిచేస్తుంది. కిందకు వెళ్తున్న ధాత్రికి కింద ఉన్న యువరాజ్, అత్తయ్య, కాచిలను ఇక్కడకు రమ్మను అని చెప్తుంది. ధాత్రి వెళ్లి చెప్తుంది. వైజయంతి వాళ్లు పైకి వెళ్తారు.
వైజయంతి: ఏమైందమ్మీ ఇంత సంతోషంగా ఉన్నావు.
నిషిక: అత్తయ్యా నేను సీఈవో అయ్యాను అత్తయ్యా..
వైజయంతి: ఓసి నీ సంబరం సల్లగుండ ఇంకా తిరిగితే కళ్లు తిరిగేలా ఉంది అమ్మీ.
యువరాజ్: ఏంటి నిషి నువ్వు చెప్పేది.
కాచి: మా అక్కను దాటుకుని ఢీకొట్టి నువ్వు సీఈవో కుర్చీలో కూర్చోబోతున్నావా?
నిషిక: అవును రేపు నన్ను సీఈవోగా ప్రకటించబోతున్నారు. నన్ను ఆఫీసుకు రమ్మని చెప్పారు.
వైజయంతి: అమ్మో నా కొడలు బంగారం కొన్నేళ్లుగా ఎవ్వరూ చేయలేనిది చేశావు.
కాచి: అయినా అక్కమీద గెలిచావంటే నమ్మలేకపోతున్నాను నిషి.
నిషిక: ఇకనుంచి ఎప్పుడూ చూడనివి కలలో కూడా జరగుతాయని అనుకోనివి చాలా జరుగుతాయి. వదినను కంట్రల్ లోపెడతా.. మొత్తానికి ఈ నిషిక పెత్తనం ఎలా ఉంటుందో చూపిస్తా
అంటూ నిషిక హ్యాపీగా చెప్తుంది. మరోవైపు గార్డెన్ లో కూర్చున్న ధాత్రి ఆలోచిస్తుంది. కేదార్, మీనన్ గురించి మాట్లాడుతుంటే పలకదు. దీంతో ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావేంటి అని కేదార్ అడుగుతాడు. దీంతో నిషిక ఫోన్ మాట్లాడిన విషయం చెప్తుంది ధాత్రి. అసలు ఆఫీసులో ఏం జరుగుతుందో కనిపెట్టాలని ధాత్రి చెప్పాగానే
కేదార్: ధాత్రి అక్కకు ఏ విషయం కూడా తెలియకుండా చూసుకోవాలి. లేదంటే అనవసరంగా అక్క స్రెస్ తీసుకుంటుంది.
ధాత్రి: సమస్యకు సొల్యూషన్ దొరికాకే అప్పుడు వదినకు చెబుదాం.
కౌషికి: అఫీసులో ఏం జరుగుతుంది జగధాత్రి
అనుకుంటూ కౌషికి వస్తుంది.
కౌషికి: చెప్పండి ఆఫీసులో ఏం జరుగుతుంది. ఏదీ జరగలేదని మాత్రం చెప్పకండి. ఏదో జరగుతుందని మీ భయం వల్ల నాకు తెలిసిపోతుంది. మీ కంగారే నాకు చెప్తుంది. చెప్పండి.
కేదార్: అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకు టూ మంత్స్ టైం ఇవ్వరేమోనని అనుకుంటున్నాము.
దీంతో మన కంపెనీ అసమర్థుల చేతిలోకి వెళ్లకూడదు. ఎంత కష్టం వచ్చినా కంపెనీని వదులుకోలేదు. ఎవరి కోసమూ వదులుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అంటుంది కౌషికి. దీంతో మేము ఉండగా కంపెనీకి ఏం కాదని చెప్తుంది జగధాత్రి. ఆ సీటులో మీరు తప్పా ఇంకెవర్ని కూర్చోనివ్వం అంటుంది. ధాత్రి. మరోవైపు తన డెన్ కు వెళ్లిన మీనన్, ధాత్రి గురించి ఆలోచిస్తుంటాడు. నేను వెళ్లాలనుకున్న ప్రతిచోటికి జేడీ ముందే ఎలా వెళ్తుంది. అనుకుంటూ దేవాను పిలిచి మనలో ఎవడో పోలీసొడు ఉన్నాడు అని చెప్తాడు. మరోవైపు కంపెనీకి వెళ్తుంది నిషిక.
రాఘవరావు: అందరూ మీకోసం ఎదురుచూస్తున్నారు మేడం.
బూచి: జాక్ పాట్ కొట్టేశావు సిస్టర్.
కాచి: అనుకున్నది సాధించావు నిషి.
వైజయంతి: నువ్వు వజ్రపాటి వంశానికి, ఈ కంపెనీకి మకుఠం లేని మహారాణివి అమ్మి. అందరూ నీ కాళ్ల దగ్గరకు రావాల్సిందే అమ్మీ. ఇప్పుడిక నువ్వు సీఈవో అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు అమ్మీ.
అని చెప్తుండగానే ఆఫీసుకు ధాత్రి, కేదార్ వస్తారు. వాళ్లను చూసిన వైజయంతి, నిషిక ఇరిటేటింగ్ గా ఫీలవుతారు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.