Jagadhatri Serial Today Episode: కౌషికిని డైవర్ట్ చేయడానికి ఆఫీసు నుంచి ఫైల్ వచ్చిందని తీసుకొచ్చి ఇస్తాడు యువరాజ్. కౌషికి ఫైల్ తీసుకుని చెక్ చేస్తుంటే.. నేను చెక్ చేశానని అంతా కరెక్టుగా ఉందని నువ్వు సంతకం పెడితే చాలని చెప్పగానే కౌషికి సంతకం పెడుతుంది. దీంతో ధాత్రి ఫైల్ చూడకుండా సంతకం పెట్టడం కరెక్టు కాదని చెప్పగానే కౌషికి మళ్లీ ఫైల్ ఓపెన్ చేయబోతుంటే యువరాజ్, కమలాకర్ ఏదో చెప్పి కౌషికిని మళ్లీ డైవర్ట్ చేయాలని చూస్తారు. దీంతో కౌషికి ఫైల్ చూడకుండానే కమలాకర్‌కు ఇచ్చేస్తుంది. కేదార్, జగధాత్రిలను తీసుకుని గదిలోకి వెళ్దాం పద అని వెళ్లబోతుంటే వైజయంతి, నిషిక అడ్డుపడతారు. మరోవైపు యువరాజ్ ఎస్సైకి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే అక్కతో సంతకం చేయించాను అని చెప్పగానే సరే మీరు అది స్టేషన్‌కు పంపించండి నేను వెళ్లి ఆమెను అరెస్ట్ చేస్తాను అని చెప్తాడు. మరోవైపు వైజయంతికి కౌషికి సమాధానం చెప్తుంది.
కౌషికి: కేదార్ అమ్మా నాన్నలకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ నాన్నగారి గదిలో ఉందట పిన్ని. మనం గడువు ఇచ్చింది కూడా ఆ ఆధారాల కోసమే కదా..? అందుకే ఆ ఆధారాలు ఇంట్లో ఉన్నాయని తెలిసి వెతకడానికి వెళ్తున్నాం.
నిషిక: ఏమంటున్నారు వదిన. కేదార్ అమ్మ గారి మ్యారేజ్ సర్టిఫికెట్ ను పెద్ద మామయ్య గారి గదిలో ఎందుకు పెట్టి ఉంటారు.
ధాత్రి: అలా అంటావేంటి నిషి. కేదార్ అమ్మగారికి సంబంధించిన లాకెట్ ఇన్మఫర్మేషన్ కూడా పెద్ద మామయ్య గదిలోనే దొరికిందట.
కౌషికి: పిన్ని మనం అడ్డుకుంటే తప్పు మనం చేసిన వాళ్లం అవుతాం. అసలు ఆధారాలు ఉన్నాయో లేదో చూద్దాం.
అని లోపలికి వెళ్లిపోతారు. యువరాజ్, నిషికకు ఫోన్ చేసి మన ప్లాన్ సక్సెస్ అయిందని చెప్తాడు. దీంతో నేను దివ్యాంకకు ఫోన్ చేస్తాను అని నిషిక ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు ధాత్రి, కేదార్ లను రూంలోకి తీసుకెళ్లిన కౌషికి వెతకండని చెప్తుంది. ముగ్గురు కలిసి ఫైల్స్ వెతుకుతుంటారు. కమలాకర్ గన్ తీసుకుని కేదార్ ను కాల్చడానికి రెడీ ఉంటాడు. లోపల వెతికిన కేదార్ డల్లుగా కూర్చుని ఉంటాడు.
ధాత్రి: ఏమైంది కేదార్.
కేదార్: ఇన్ని ఫైల్స్ లో లేని సాక్ష్యం ఈ మిగిలిన ఫైల్స్ లో ఉంటుందంటావా..? ధాత్రి.
ధాత్రి: ఇన్నేళ్లలో దొరకని సాక్ష్యం ఇప్పుడు దొరికింది కదా కేదార్. ఏమో పెద్ద మామయ్య గారు దాచిని సాక్ష్యం ఈ ఫైల్స్ లోనే ఉందేమో..?
కేదార్: ఏమో నాకు భయంగా ఉంది ధాత్రి.
ధాత్రి: అయితే ఉండు నేను చూస్తాను.
అని వెతుకుంటే.. ఇంతలో కమలాకర్ రూం లోపలికి వచ్చి కౌషికి మీ అత్తయ్య ఆదిలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూస్ టీవీలో వస్తుంది వెళ్లి చూడు అంటూ చెప్పగానే రూంలోంచి ముగ్గురు బయటకు వస్తారు. బయటకు వచ్చిన కౌషికి అత్తయ్య గారి మీద నేను కేసు పెట్టడం ఏంటి..? అంటూ బాధపడుతుంది. ఇంతలో వైజయంతి పైకి రూంలోకి వెళ్తుంది. ఫైల్ కోసం వెతుకుతుంది. కింద కౌషికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అత్తయ్యను విడిపించుకు వస్తాను. అనగానే కమలాకర్ అడ్డుపడతాడు. పైన వైజయంతికి సుహాసిని, సుధాకర్ ల మ్యారేజ్ సర్టిఫికెట్ దొరుకుతుంది. ఆ సర్టిఫికెట్ తీసుకుని కిందకు వస్తుంది. ఇంతలో సురేష్ వచ్చి కౌషికిని తిట్టి మా అమ్మను నేను విడిపించుకోగలను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో నిషిక, వైజయంతి, కమలాకర్ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!