Jagadhatri Serial Today Episode: కేదార్, ధాత్రిలను కీర్తి ఫోటోలు తీస్తుంటుంది. ఇంతలో దివ్యాంక, సురేష్ వస్తారు. సురేష్‌ను చూసిన కీర్తి పరుగెత్తుకుంటూ పోతుంది. అయితే సురేష్‌ను దివ్యాంక ఆపుతుంది. కీర్తి బాధపడుతుంది. సురేష్ కూడా బాధపడతాడు. ఇంతలో కౌషికి వచ్చి కీర్తిని తీసుకెళ్తుంటే..
దివ్యాంక: చిన్నపిల్ల నీ కోపాన్ని నీ కక్ష్యని తనకెందుకు నూరిపోస్తావు. చిన్నపిల్లలను ప్రేమతో పెంచాలి ఇలా పగ నేర్పిస్తూ కాదు.
కౌషికి: నా కూతురును ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి కీర్తి విషయంలో కలగజేసుకుంటే... నీ మంచికే చెప్తున్నాను కలగజేసుకోకు దివ్యాంక.
దివ్యాంక: ఎలా పెంచాలో నాక్కూడా చెప్పు కౌషికి. ఎందుకంటే త్వరలోనే కీర్తి కూడా నా కూతురే అవుతుంది కదా?
కౌషికి: ఏమన్నావు ఇంకోసారి కీర్తికి నీకు సంబంధం ఉంది అన్నావంటే.. ఇంటికి అతిథివి అని కూడా చూడను.
దివ్యాంక: కౌషికి నీకీ మధ్య ఆవేశం ఎక్కువైపోయి ఆలోచన తగ్గిపోతుంది. సురేష్ కీర్తికి తండ్రి అయినప్పుడు నేను కూడా అమ్మనే కదా?
కౌషికి: బాధ్యత లేని తండ్రి, అతనికి తలాతోక లేని భార్య వీళ్లతో నా కూతురుకి ఏ సంబంధం ఉండదు ఉండనివ్వను.
అంటూ కౌషికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంతలో నిషిక వచ్చి ఈ రోజు కూడా ఎందుకు గొడవ అనగానే దివ్యాంక నిషికను పొగుడుతుంది. నీ కాపురాన్ని పణంగా పెట్టి నా ఫంక్షన్ జరిపిస్తున్నావని తెలిసింది అనగానే నీకన్నా నా చెల్లి త్యాగం గొప్పదేం కాదు అంటూ ధాత్రి వస్తుంది. నిషిక లాంటి దాన్నే గుప్పిట్లో పెట్టుకున్నావంటే నువ్వు ఎంత గొప్పదానివి అంటూనే మా వదిన అనాథలకు చాలా సాయం చేస్తుంటుంది. ఇప్పుడు నీ ఫంక్షన్ కూడా అలాగే ఒప్పుకుంది సో ఆమె గొప్పదనం కూడా ఉంది. అనగానే దివ్యాంక కోపంగా ఈ ధాత్రి, కౌషికి మీద ఒక్క మాట కూడా పడనివ్వదు అని మనసులో అనుకుంటుంది.
నిషిక: నీకు పొగరు బాగా ఎక్కువైందే.. మన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కిన పేనులా పడి ఉండే దానివి. ఇప్పుడేందే ఎగిరెగిరి పడుతున్నావు.
ధాత్రి: అప్పుడు నువ్వు నన్ను బాధపెట్టాలని మాట్లాడేదానివి నిషి కానీ ఇప్పుడు అవమానించాలనుకుంటున్నావు. అది కూడా ఇలాంటి వాళ్ల ముందు.
అనగానే నిషిక ధాత్రికి పనిచెప్తుంది. నువ్వు ఎంత చెప్పినా నేను ఏ పనిచెయ్యను అంటూ చెప్పి ధాత్రి వెల్లిపోతుంది. తర్వాత వైజయంతి జూస్ తీసుకుని కేదార్ దగ్గరకు వెళ్లి జ్యూస్ ఇచ్చి బయట ఆటోలో సామాను ఉంది తీసుకురా అని చెప్తుంది. దీంతో కేదార్ సామాన్లు తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. కేదార్ సామాన్లు తీసుకొస్తుంటే బూచి వెళ్లి ధాత్రికి చెప్తాడు. ధాత్రి కోపంగా బయటకు వస్తుంది.
ధాత్రి: కేదార్ ఏం చేస్తున్నావు..?
కేదార్: అది సామాన్లు..
ధాత్రి: ముందు కింద పెట్టు.... కింద పెట్టు
అంటూ సామాన్లు కింద పెడుతుంది. ఎందుకు సామాన్లు నువ్వు తీసుకొస్తున్నావు అని ధాత్రి అడగ్గానే వైజయంతి వచ్చి జ్యూస్ ఇచ్చి చెప్పిన మాటలు చెప్తాడు కేదార్. మనోడు అనుకున్నందుకే నాకు పనులు చెప్పారు. అనగానే మనోడు అనుకోలేదు పనోడు అనుకున్నారు అని చెప్తుంది ధాత్రి. అయినా వినకుండా కేదార్ సామాన్లు తీసుకెళ్తుంటే.. ధాత్రి కూడా సాయం చేస్తుంది. ఇంతలో కౌషికి వచ్చి మీరెందుకు ఈ పనులు చేస్తున్నారు అని అడగ్గానే దివ్యాంక, నిషిక, వైజయంతి వచ్చి ధాత్రి, కేదార్‌లను అవమానిస్తారు.
కేదార్: ధాత్రి వాళ్లు కావాలనే నీకు కోపం తెప్పించేలా మాట్లాడుతున్నారు నువ్వేమీ పట్టించుకోకు.
అనగానే నిషిక, ధాత్రిని తిడుతుంది దీంతో ధాత్రి కోపంగా నిషిక నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అంటుంది. వెంటనే వైజయంతి భయంగా ధాత్రి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని ధాత్రిని బయటకు తీసుకెళ్లమని కేదార్‌కు చెప్తుంది. కేదార్, ధాత్రిని బయటకు తీసుకెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: పాకిస్థాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి - వీడియోలతో లక్షల్లో సంపాదన