Jagadhatri  Serial Today Episode: యువరాజ్‌ను తనకు చూపించాలని లేదంటే తాను సూసైడ్‌ చేసుకుంటానని సాధు ఆఫీసుకు వచ్చి నిషిక బెదిరిస్తుంది. దీంతో జేడీ కోప్పడుతుంది. ఇంతలో బయటకు పరుగెత్తుకెళ్లిన నిషిక కారు డిక్కిలో పెట్రోల్‌ తీసి తనపై పోసుకుని సూసైడ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. జగధాత్రి, కేదార్‌ వెళ్లి సేవ్‌ చేస్తారు. అలాగే సూసైడ్‌ నేరం కింద నిషికను ధాత్రి అరెస్ట్‌ చేస్తుంది. అడ్డొచ్చిన వైజయంతి, కమలాకర్‌, కౌషికికి వార్నింగ్‌ ఇస్తుంది.


కౌషికి: అసలు డ్యూటీలో కూడా లేని నువ్వు నా మరదలిని ఎలా అరెస్ట్‌ చేస్తావు. సస్పెషన్‌ లో ఉన్న నువ్వు నిషిక మీద కేసు ఎలా ఫైల్‌ చేయగలుగుతావు.


ధాత్రి: ఇందాకా మా సస్పెషన్స్‌ తీసేశారు మేడం. జేడీ మళ్లీ డ్యూటీ ఎక్కింది. అందరి ఆటలు కట్టించి నిజం బయటపెడతాం.


కౌషికి: నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్‌ చేసి కిడ్నాప్‌ చేసి ఎక్కడో దాచి ఇప్పుడు నా మరదల్ని కూడా అరెస్ట్‌ చేస్తావా? నిన్ను వదలను జేడీ


ధాత్రి: నేను కూడా వదలను. యువరాజ్‌ ను యువరాజ్‌ వెనకాల ఉన్న వాళ్లని అందర్ని న్యాయస్థానంలో నిలబెట్టి తీరతాను. మీ తమ్ముడు సూరి అనే వ్యక్తిని చంపాడు. దాన్నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు.


   అంటూ నిషికను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే కమలాకర్‌ అడ్డు పడతాడు. వైజయంతి తిడుతుంది. నా కొడుకును నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నా కోడలిని కూడా అరెస్ట్ చేస్తావా? అంటూ నిలదీస్తుంది. కౌసికి కూడా ధాత్రిని తిడుతుంది. ఒక మీడియా పర్సన్‌గా నిషిక చేసింది తప్పు కాదు అనిపిస్తే మీరే నిషికను తీసుకెళ్లండి కౌసికి గారు  అంటాడు కేదార్‌. దీంతో కౌషికి, నిషిక చేసింది తప్పేనని కౌషికి జేడీకి సారీ చెప్తుంది. అయితే మీరు కాదు నిషిక సారీ చెప్పాలని జేడీ చెప్తుంది. అయిష్టంగానే నిషిక సారీ చెప్తుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.  తర్వాత ఇంటికి వెళ్లిన అందరూ జేడీ మాటలు గుర్తు చేసుకుని ఉక్రోషంగా ఫీలవుతుంటారు.


నిషిక: ఆ జేడీ ప్రతిసారి మనల్ని ఏదో ఒక విధంగా అవమానిస్తూనే ఉంది వదిన.


వైజయంతి: అవునమ్మీ నిషికను కొట్టి అరెస్ట్‌ చేయబోయింది. అఖరికి క్షమాపణ చెప్పించుకునే పంపించింది. ఆ జేడీ అంతు చూడాలమ్మీ.


సురేష్‌: నిషిక ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికే నిషిక మీద చెయ్యి చేసుకుంది కదా అత్తయ్యా.. జేడీకి నిషిక మీద ఎందుకు కోపం ఉంటుంది.


కౌషికి: కోపం కాదు సురేష్‌. అధికారం, అహంకారం. పవర్‌ చేతిలో ఉంది ఏం చేసినా చెల్లుతుందనే గర్వం. సస్పెషన్ తీశారని తెగ ఆనందపడిపోతుంది. ఆ అహంకారాన్ని అణచివేస్తాను. 


ఇంతలో జగధాత్రి, కేదార్‌ వస్తారు.


నిషిక: ఇటు రావే దత్తత ఆగిపోయినప్పటి నుంచి మీరు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లారే


కేదార్‌: స్కూల్‌ లో పని ఉంటే వెళ్లాము నిషిక


వైజయంతి: మిట్ట మధ్యాహ్నం అడిగినా అర్దరాత్రి అడిగినా ఎప్పుడు చూసినా స్కూల్‌ లో పని అంటారు. అయినా ఇంతగా పనిచేసే టీచర్స్‌ ని నేను ఎక్కడ చూడలేదమ్మా?


కౌషికి: అవును ఇవాళ సండే కదా స్కూల్‌ ఎందుకు ఉంటుంది.


 అంటూ కౌషికి అడగ్గానే ధాత్రి.. ఎగ్జామ్స్‌ వస్తున్నాయి కదా అందుకే ప్రిన్సిపాల్ రమ్మన్నారు అని చెప్పగానే కమలాకర్‌ మీరు టీచర్సేనా లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనగానే మీ స్కూల్‌ వాళ్లకు ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడు అని నిషిక అంటుంది. దీంతో ప్రిన్సిపాల్‌కు ధాత్రి ఫోన్‌ చేయగానే రమ్య అక్కడకి వెళ్లి ప్రిన్సిపాల్‌ లాగా మాట్లాడి సేవ్‌ చేస్తుంది. ఇంతలో రేపు కేదార్‌, ధాత్రికి పదహారు రోజుల పండుగ చేద్దామని అంటుంది కౌషికి. నిషిక వద్దని తిడుతుంది. జరిగి తీరుతుందని కరాకండిగా చెప్పి వెళ్లిపోతుంది కౌషికి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: గురు పౌర్ణమి రోజు తిరుమలలో చాతుర్మాస దీక్ష స్వీకరించనున్న పెద్దజీయర్‌స్వామి!