Jagadhatri  Serial Today Episode:   హీరోయిన్‌ ఇంట్లో పనిమనిషి మంగను చంపాడని మినిస్టర్‌ బామ్మర్ది అభిని అరెస్ట్  చేయడానికి వెళ్తారు జేడీ, కేడీ. దీంతో మినిష్టర్‌ అడ్డుపడతాడు. ఇంతలో అభి నేను ఎవరిని షూట్‌ చేయలేదు అంటాడు. దీంతో కేదార్‌ షూట్‌ చేసి చంపారని మేము చెప్పలేదే అంటాడు. మంగను చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నాము అంటూ ధాత్రి అరెస్ట్‌ చేయడానికి వెళ్తుంటే..

మంత్రి: వాడు నా మనిషి వాణ్ని తీసుకెళ్లాలంటే నన్ను దాటి వెళ్లాలి.

ధాత్రి: మిమ్మల్ని, మీ పదవిని, మీ పవర్‌ని అన్నింటినీ దాటి అయినా సరే తప్పు చేసిన వాణ్ని అరెస్ట్‌ చేసి తీసుకెళ్తాను సార్‌. అది మీరైనా.. మీ మనిషైనా..?

మంత్రి: అభియే మర్డర్‌ చేశాడు అనడానికి సాక్ష్యాలేవీ.. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్‌ ఉందా..?

అని మంత్రి అడగ్గానే.. ధాత్రి తన ఫోన్‌లో అభి మర్డర్‌ చేస్తున్న టైంలో సీసీటీవీ పుటేజీ చూపిస్తుంది ధాత్రి. దీంతో మంత్రి షాక్‌ అవుతాడు.

కేదార్‌: ఇది వారెంట్‌ సార్‌..

ధాత్రి: అభి మర్డర్‌ జరిగిన టైంకి అదే ఏరియాలో ఉన్నట్టు తన ఫోన్‌ సిగ్నల్స్‌ చెప్తున్నాయి. అభి తన కారులో మంగ ఇంటికి వచ్చినట్టు సిటీలో చాలా కెమెరాల్లో రికార్డు అయింది.  

మంత్రి: కానీ తను షూట్‌ చేసిన బుల్లెట్‌ వలనే మంగ చనిపోయిందని ఆధారాలు లేవు కదా..? అసలు అభి మంగను చంపడానికి కారణం ఏంటి..? మర్డర్‌ వెపన్‌ ఎక్కడ..?

ధాత్రి: 24 గంటల్లో మీరు అడిగిన అన్నింటికీ సమాధానాలు చెప్తాము సార్‌.

కేదార్‌: అంత టైం కూడా అవసరం లేదు జేడీ.. అభి చాలా మంచోడు.. ఒక్క రౌండ్‌కే అన్ని నిజాలు చెప్పేస్తాడు. ఏం అభి. 

అభి: బావ కొడతారేమో..?

మంత్రి: తప్పు చేస్తున్నావు జేడీ..

జేడీ: ఆల్‌రెడీ తప్పు జరిగింది సార్‌. దాని మూలం కనుక్కుని అంతం చేయడానికే ప్రయత్నిస్తున్నాం సార్‌. అభిని అరెస్ట్‌ చేస్తున్నాం. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పండి. కేడీ అరెస్ట్‌ చేయ్‌..

అభి: బావ ఫ్లీజ్‌  బావా నన్ను కాపాడు బావ.. నన్ను తీసుకెళ్తున్నారు బావ ఏదో ఒకటి చేయ్‌ బావ.

ధాత్రి: ఒక పోలీస్‌ ను తన డ్యూటీ చేయకుండా అడ్డుకోవడం చట్టరిత్యా నేరం. రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సార్‌ హోం మినిస్టర్‌ అయిన మీకు కూడా అది వర్తిస్తుంది. మేము ఇక్కడి నుంచి అభిని మాత్రమే తీసుకుని వెళ్లాలా..? మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్లాలా అనేది మీ ఇష్టం.

అని చెప్పగానే మంత్రి పక్కకు జరుగుతాడు. అభిని తీసుకుని జేడీ, కేడీ వెళ్లిపోతారు. మంత్రి కోపంగా జేడీ, కేడీ మిమ్మల్ని మాత్రం వదలను అని తిట్టుకుంటూ మీనన్‌కు ఫోన్‌ చేస్తాడు.

మంత్రి: హలో మీనన్‌ నేను ఆదికేశవులును మాట్లాడుతున్నాను.

మీనన్‌: ఓ హోమంత్రి గారికి పాత స్నేహాలు, పాత మిత్రులు ఇంకా గుర్తు ఉన్నారన్న మాట.

మంత్రి: సారీ మీనన్‌ నేను  కార్పోరేటర్‌ గా ఉన్నప్పుడు నువ్వు నాకు చాలా సాయం చేశావు. కానీ నా రాజకీయానికి నీ రౌడీయిజం అడ్డుపడుతుందని నిన్ను దూరం పెట్టక తప్పలేదు.

మీనన్‌: మామూలుగా దూరం పెట్టలేదు మిత్రమా.. 20ఏళ్లు దూరం పెట్టావు. ఇన్నేళ్ల తర్వాత నేను గుర్తుకు వచ్చానంటే పనేంటి హోంమినిస్టర్‌.

మంత్రి: నా బామ్మర్దిని ఒక మర్డర్‌ కేసులో జేడీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. ఇప్పుడు కానీ వాడు స్టేషన్‌కు వెళ్లి నోరు తెరిస్తే.. నా నేర చరిత్ర మొత్తం బయటపడుతుంది. నా పదవి, నా పవర్‌ అన్ని పోతాయి.

మీనన్‌: నీ ప్రాబ్లం నాకు అర్థం అయింది హోంమినిస్టర్‌. ఆ జేడీ చాలా డేంజరస్‌. నా దందాకే అడుగడుగునా అడ్డు పడుతుంది. అలాంటిది అభిని స్టేషన్‌కు తీసుకెళితే గంటలో వాడి నుంచి నిజాలు బయటపెట్టించి.. నిన్ను అరెస్ట్‌ చేస్తుంది. 

మంత్రి: ఓకే మీనన్‌ ఇన్నాళ్ల తర్వాత రిస్క్‌ అని తెలిసినా…? నీకే ఫోన్‌ చేశాను. జేడీ కస్టడీ నుంచి అభిని ఎవరైనా తీసుకురాగలరు అంటే అది నువ్వే.. మీనన్‌.. జేడీ అభిని దాటి నా దాకా రాకూడదు.

మీనన్‌: సరే మినిస్టర్‌.. పని అయ్యాక ఫోన్‌ చేస్తాను. వచ్చి నీ బామ్మర్దిని తీసుకెళ్లు..

మంత్రి: థాంక్యూ మీనన్‌..

అభిని అరెస్ట్‌ చేసి కారులో తీసుకుని వెళ్తుంటారు ధాత్రి, కేదార్‌. ఇంతలో సాధు ఫోన్‌ చేస్తాడు. మీ మీద సాధు అటాక్‌ చేయబోతున్నాడని సమాచారం వచ్చింది. అభిని కాపాడమని మీనన్‌కు సుపారీ వచ్చిందట. మీనన్‌ తన మనుషులతో మీకోసం బయలుదేరాడని చెప్తాడు. దీంతో ధాత్రి, కేదార్‌  ఆలోచిస్తారు. వీణ్ని అరెస్ట్‌ చేస్తే మీనన్‌ ఎందుకు రంగంలోకి దిగుతాడు. అంటే వీడి వెనక ఏదో గూడుపుఠాణి ఉందన్నమాట అనుకుంటారు.  మరోవైపు జేడీ, కేడీ కోసం దారిలో వెయిట్‌ చేస్తుంటాడు మీనన్‌.  ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!