Jagadhatri  Serial Today Episode:  కేదార్‌, సుహాసిని కొడుకే అని నమ్మకం ఏంటని అడుగుతుంది నిషిక. దీంతో ధాత్రి కోపంగా నిషి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అంటుంది. ఇప్పుడే చాలా కరెక్టుగా మాట్లాడుతుందని వైజయంతి అంటుంది. బావ నువ్వు ఎప్పుడైనా కేదార్‌ను చిన్నతనంలో చూశావా అని అడుగుతుంది.

కేదార్‌: అయినా మా అమ్మ గురించి తప్పు చెప్పాల్సిన అవసరం నాకేంటి పిన్ని.

ధాత్రి: అవును అత్తయ్యా.. అయినా నిషి, కేదార్‌.. సుహాసిని అత్తయ్య  కొడుకని నీకు కూడా తెలుసు కదా..? ఎన్నిసార్లు కేదార్‌ వాళ్ల ఇంట్లో ఆ ఫోటో చూశాము మనం.

నిషిక: ఇప్పుడు నేను కూడా అమెరికా ప్రెసిడెంట్‌ కూతురిని అని ఫోటో తయారు చేసుకుంటాను. అంతమాత్రం చేత నేను అమెరికా ప్రెసిడెంట్‌ కూతురిని అయిపోతానా..?

కేదార్‌: నిషి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు.

వైజయంతి: మీరు చేయాలనుకున్న మోసాన్ని కనిపెట్టి మాట్లాడతాఉంది. ఏమమ్మా కౌషికి మీ చిన్నాన్న గతం తెలుసుకుని వీళ్లు అబద్దం చెప్తా ఉండారని గ్యారంటీ ఉందా..?

కౌషికి: కానీ పిన్ని ఆ అవసరం..

వైజయంతి: అవసరం అత్యవసరం కాదు. సాక్ష్యం ఉందా..?

యువరాజ్‌: అది కేదార్‌ విషయం. నువ్వు సుహాసిని కొడుకువి అని నిరూపించే సాక్ష్యం ఏమైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి మా నాన్న మీ నాన్న అని పిలువు. అప్పటి దాకా నువ్వు పరాయివాడివే.. అనాథవే..

నిషిక: ఎవరి పాపిష్టి కన్ను మన మీద పడిందో ఏమో..? ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి.

కాచి: అవును నిషి.. పంతులు గారిని అడిగి మనకు అంటుకున్న దరిద్రం పోయే పూజ ఏమైనా ఉందేమో అడుగుదాం.

అని చెప్తుండగానే.. యువరాజ్‌ బలవంతంగా సుధాకర్‌ను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. సుధాకర్‌ బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కేదార్‌ బాధపడుతుంటాడు.

కేదార్‌: చేతిదాకా వచ్చింది ఏదీ చేతికి చిక్కకుండా పోతుందేంటీ ధాత్రి..

ధాత్రి: పాతికేళ్ల దూరం కదా కేదార్‌.. దగ్గర అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వెయిట్‌ చేద్దాం.. అప్పటిదాకా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడదాం.

దూరం నుంచి బూచి వాయిస్‌ వినిపిస్తుంది. ఎవరినో కొంచెం రైటుకు బేబీ కారు మీద చేయి వేసి నిలబడు అంటుంటాడు.

ధాత్రి: ఈ వాయిస్‌..

కేదార్‌: బావ వాయిస్‌ లా ఉందేంటి.?

ధాత్రి: అన్నయ్యా ఫ్రెండ్‌ బర్తుడే పార్టీ ఉంది సాయంత్రం వరకు రానన్నాడు కదా..?

బూచి: బేబీ అలా రైటుకు జరుగు..

ధాత్రి: కేదార్‌ అదిగో అన్నయ్యా..

బూచి: బేబీ కారు మీద చేయి వేసి అలా స్టైల్‌గా నిల్చో.. బేబీ ఆగు నేను వస్తున్నా.. ఇలా రా రైటుకు.. ఇప్పుడు ముద్దుగా ఉన్నావు.

ధాత్రి: అన్నయ్య ఎవరితో అంత క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నాడు.

కేదార్‌: చాట్‌ చేసిన అమ్మాయి అనుకుంటా..?

అమ్మాయి: బేబీ నువ్వు రా ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం..బేబీ నా ఫోన్‌లో తీయోచ్చు కదా..?

అని చెప్పగానే బూచి దగ్గరకు వెళ్లి ఫోటో దిగుతుంటే.. అమ్మాయి కిస్‌ ఇస్తుంది. ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. దగ్గరకు వెళ్తారు. వాళ్లను చూసిన బూచి షాక్ అవుతాడు. ఏదేదో చెప్తుంటాడు. ధాత్రి, కేదార్‌ వెళ్లిపోతారు. తర్వాత ఇంటికి వెళ్లిన ధాత్రి, కేదార్‌లను ఎందుకొచ్చారు ఆస్తి కోసం వచ్చారా? అని నిషిక అడుగుతుంది. కౌషికి మాత్రం కేదార్‌ పేరు మీద ఆస్తి రాస్తానని చెప్తుంది. దీంతో గొడవ జరుగుతుంది. ఇంతలో యువరాజ్‌ కూల్‌గా ఆస్థి రాయడానికి ఒప్పుకుంటాడు. లాయర్‌ వచ్చి వీలునామా తీసుకురమ్మని చెప్తాడు. కౌషికి వీలునామా కోసం లోపలికి వెళ్తుంది. యువరాజ్‌ ఒప్పుకున్నాడంటే వదినకు ఏమైనా హానీ చేస్తారా..? అని ధాత్రి, కేదార్‌తో అంటుంది. ఇంతలో లోపలి నుంచి కౌషికి కేకలు వినిపిస్తాయి. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!