Jagadhatri Serial Today Feb 24th: కౌషికి గదిలోకి వచ్చి బెదిరించిన మీనన్...చనిపోయిన మీనన్ బతికి వచ్చాడంటే నమ్మని కుటుంబ సభ్యులు
Jagadhatri Serial Today Episode February 24th: కౌషికి గదిలోకి వచ్చి బెదిరించిన మీనన్...చనిపోయిన మీనన్ బతికి వచ్చాడంటే నమ్మని కుటుంబ సభ్యులు

Jagadhatri Serial Today Episode : జగధాత్రి చేయి గురించి ఇంట్లో వాళ్లు మళ్లీ అడగకుండా ఉండేందుకు ధాత్రి, కేదార్ కలిసి ఓ ప్లాన్ వేస్తారు. శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్ కోసం సరకులు రాగా వాటిని సుధాకర్ లోపల పెట్టమని చెబుతాడు. దీంతో జగధాత్రి, కేదార్ కలిసి లోపల పెట్టేందుకు ప్రయత్నిస్తారు.ఆ టైంలో ధాత్రి కావాలనే ఓ బాక్సు కిందపడేస్తుంది. చేయిజారి పడిపోయిందని చెప్పినా వినకుండా కేదార్ ఆమెపై గట్టిగా అరుస్తాడు.అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని మండిపడతాడు. కేదార్ ఎప్పుడూ అలా మాట్లాడటం చూడని నిషిక, వైజయంతితోపాటు కౌషికి కూడా ఆశ్చర్యపోతుంది. సుధాకర్ సర్దిచెబుతున్నా వినకుండా మళ్లీ తిట్టడంతో ధాత్రి అలిగిలోపలికి వెళ్లిపోతుంది. వీళ్లేంటి మళ్లీ ఏదో కొత్తనాటకం మొదలుపెట్టారని నిషిక,వైజయంతి అనుకుంటారు. అటు కౌషికి కూడా వీళ్ల ప్రవర్తనపై అనుమానం వస్తుంది. వీళ్లిద్దరూ తనవద్ద ఎదో దాస్తున్నారని ఆమె అనుకుంటుంది. ఇంతలో లోపలికి వచ్చిన కేదార్...ధాత్రికి సారీ చెబుతాడు. ఉట్టి సారీ చెబితే సరిపోదాని...నా కోపం తగ్గే వరకు నేను ఏ పనులు చేయనని నువ్వే నా పనులన్నీ చేయాలని చెబుతుంది. దీనికి కేదార్ సరేనంటాడు. ఈ ఐడియా బాగుందని జగధాత్రి అనుకుంటుంది.తన చేయికి తగిలిన బుల్లెట్ గాయం తగ్గే వరకు ఇక ఇంట్లో ఎవరూ నన్ను క్వచ్ఛన్ చేయరని అనుకుంటుంది.
కౌషికి తన రూమ్‌లోకి వెళ్లగానే అక్కడ ఛైర్‌లో మీనన్ కూర్చుని ఉంటాడు. మీనన్‌ను చూసి కౌషికి షాక్‌కు గురవుతుంది.చచ్చిపోయినవాడివి ఎలా బతికి వచ్చావని అడుగుతుంది.మీనన్‌కు చావే ఉండదని చెబితే మీరు నమ్మలేదు కదా అని అంటాడు. నేనుచెప్పినట్లు వినకుండా నువ్వు నీ ప్రాణాలతో పాటు ఇంట్లో వాళ్ల ప్రాణాలమీదుకు తెచ్చుకున్నావని అంటాడు. పెళ్లి పనుల్లో చాలా హాడావుడిగా, సంతోషంగా ఉన్నారు కదా ఇక మీకు ఆ ఆనందం లేకుండా చేస్తానని అంటాడు.నేను చెప్పినట్లు ఆ పెన్‌డ్రైవ్ నాకు ఇచ్చేసి ఉన్నట్లయితే నేను మీ జోలికి వచ్చేవాడినే కాదని అంటాడు. రేపే మీ ఇంట్లో ఒకరిని చంపుతానని నీ కళ్లముందే ఆ హత్య చేస్తానని ఎలా కాపాడుకుంటావో చూస్కోమని హెచ్చరిస్తాడు. ఇలా ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్తానని అంటాడు. దీంతో ఆమె పరుగెత్తి తలుపు తీసేందుకు ప్రయత్నించగా...గన్ గురిపెట్టి కదిలితే కాల్చివేస్తానని అంటాడు. ఆమె మెడపట్టుకుని పైకి ఎత్తి బెదిరిస్తాడు. ఆ తర్వాత గన్‌తో ఆమె తలపై కొట్టి కిందపడేస్తాడు. కౌషికి స్పృహతప్పి పడిపోగానే....మీనన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తల్లి గదిలో పడిపోయిన సంగతి చూసిన కీర్తి...వెళ్లి అందరినీ పిలుచుకుని వస్తుంది. జగధాత్రి, కేదార్ వచ్చి కౌషికిని లేపి కుర్చీలో కూర్చోబెడతారు.అసలు ఏం జరిగిందని అడిగితే మీనన్ నా రూమ్‌లోకి వచ్చాడని...నన్ను బెదిరించాడని అంటుంది. దీంతో నిషిక మీకు పిచ్చి ఏమైనా పట్టిందా అని హేళన చేస్తుంది.చచ్చిపోయిన మీనన్ రావడం ఏంటని అంటుంది. కేదార్ కూడా కౌషికిని నిలదీస్తాడు. నీ కళ్లముందే మీనన్ చనిపోవడం చూశావు కదా అక్క..అని అంటాడు.జగధాత్రి కూడా మీనన్ చనిపోయాడని చెప్పడంతో కౌషికి చాలా అసహనం వ్యక్తం చేస్తుంది.వాడు వచ్చాడని నా మెడపట్టుకుని చంపేస్తానని బెదిరించాడని చెబుతుంది.ఇంట్లో అందరినీ చంపేస్తానని హెచ్చరించాడని అంటుంది. దీన్ని ఇంట్లో వాళ్లు ఎవరూ నమ్మరు. ఒకవేళ మీనన్ వస్తే ఇంట్లో అతను తాగిన సిగరెట్లు గానీ, యాష్‌గానీ ఉంటుందని యువరాజు అంటాడు. కానీ మీనన్ చాలా తెలివిగా తాగిపడేసిన సిగరెట్లు తీసుకుని వెళ్లిపోతూ...ఇంట్లో రూమ్ స్ప్రే కొడతాడు. అక్కడ ఎంత వెతికినా ఏం కనిపించకపోయినా...ఇంట్లో రూమ్ స్ప్రే వాసన వస్తోందని ధాత్రి అంటుంది.అంటే ఈ గదిలోకి ఎవరో వచ్చారని అనుమానిస్తుంది. అయితే వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ చూద్దామని వెళ్లగా...అక్కడ అన్ని కెమెరాలకు బెలూన్లు అడ్డుగా ఉండటం చూసి జగధాత్రి అనుమానం మరింత రెట్టింపవుతుంది.























