Jagadhatri  Serial Today Episode:  పరంధామయ్య మర్డర్‌ కేసులో కౌషికిని పోలీసుల అరెస్ట్‌ చేస్తారు. దీంతో కౌషికి ఆస్థులు పంచుకోవాలని ప్లాన్‌ వేస్తుంటారు వైజయంతి, కమలాకర్‌. అయితే అక్కను ఈ పరిస్థితుల్లో చూస్తూ మనం ఆస్థులు పంచుకోవడం ఏంటని యువరాజ్‌ ప్రశ్నిస్తాడు. ఇంతలో బూచి వచ్చి కేదార్‌, జగధాత్రి లాయర్‌తో మాట్లాడి కౌషికికి బెయిల్‌ తీసుకురావడానికి వెళ్తున్నారట అని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. మనం చెప్పకుండా ఎలా వెళ్తారో చూద్దామని బయటకు వచ్చి ధాత్రిని లాయర్‌ దగ్గరకు వెళ్లొద్దని హుకుం జారీ చేస్తుంది. దీంతో ధాత్రి కోప్పడుతుంది. మా వదిన ఏ తప్ప చేయదు అని కౌషికిని వెనకేసుకొస్తుంది. సురేష్‌ కూడా కౌషికిని సమర్థిస్తాడు. ఎవరెన్ని చెప్పినా వదినను కాపాడి తీరుతాను అని ధాత్రి వెళ్లిపోతుంది. మరోవైపు జైలులో ఉన్న కౌషికి రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో ధాత్రి, కేదార్‌, సురేష్‌ లాయర్‌ తో కలిసి స్టేషన్‌కు వస్తారు.


ధాత్రి: భాగ్య నువ్విక్కడేం చేస్తున్నావు.


భాగ్య: వదిన ఇక్కడ ఒక్కతే ఉంది కదా? పైగా కడుపుతో కూడా ఉంది. మీరు వచ్చే వరకు వదినకు ఏమైనా అవసరం ఉంటుందేమోనని వచ్చాను.


కేదార్‌: థాంక్స్‌ భాగ్య.


సురేష్‌: లాయర్‌ గారు కౌషికికి బెయిల్‌ పేపర్స్‌ తీసుకొచ్చారు బయటకు వచ్చేస్తుంది. ఏం కాదు.


లాయర్‌: హలో సార్‌ కౌషికి గారికి బెయిల్‌ పేపర్స్‌ తీసుకొచ్చాము.


పోలీస్‌: కానిస్టేబుల్ వెళ్లి కౌషికి గారిని తీసుకురండి.


ధాత్రి: ఏంటి వదిన చిన్న పిల్లలా ఏడుస్తున్నారు.


కౌషికి: నేను మామయ్యగారిని చంపలేదు జగధాత్రి.


కేదార్‌: అది నువ్వు మాకు మాటల్లో చెప్పాలా? అక్కా.. మాకు తెలియదా?


సురేష్‌: అవును కౌషికి నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. అందుకే బెయిల్‌ తీసుకొచ్చాం.. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పద.


భాగ్య: అవును వదిన నీ స్థానం ఇది కాదు. నువ్వు ఉండాల్సింది కూడా ఇక్కడ కాదు. పద ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం.


పోలీస్: కౌషికి గారు మీకు వచ్చింది కండిషనల్‌ బెయిల్‌. ప్రతి రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి సంతకం చేయాలి. మాకు చెప్పకుండా స్టేట్‌ కానీ కంట్రీ కానీ దాటకూడదు. ఇక్కడ సంతకం చేయండి.   


   అని చెప్పగానే కౌషికి సంతకం చేశాక అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అందరూ పోలీస్‌ స్టేషన్‌ బయట నిలబడి రాత్రి ఏం జరిగిందో మనం కనుక్కోవాలని డిసైడ్‌ అవుతారు. దీంతో ధాత్రి, భాగ్య, సురేష్‌ను మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అని అడుతుంది. దీంతో భాగ్య భూపతి పెద్దనాన్న  చేసి ఉండొచ్చు కదా అంటుంది. దీంతో ముందు రోజు జరిగిన గొడవ గుర్తు చేసుకుంటారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ధాత్రి అడగ్గానే ఇంకెవరు లేరని చెప్తారు.  మరోవైపు యువరాజ్‌కు మీనన్‌ ఫోన్‌ చేస్తాడు.


కమలాకర్‌: ఏమైంది యువరాజ్‌ భాయ్‌ కోప్పడుతున్నాడా?


యువరాజ్: అవును బాబాయ్‌.. ఆ ఫంక్షన్‌ రోజు ఆ పరంధామయ్య కొంచెం లేటుగా వచ్చినా మన పని అయిపోయేది బాబాయ్‌.


కమలాకర్‌: ముందు గన్స్‌ , తర్వాత ఫేక్‌ కరెన్సీ. ఇప్పుడు ఇది. ఎం చేసినా ఏదో ఒక అడ్డంకి. ఏం చేసినా ఎవరో మనల్ని ఆపుతున్నట్లు ఉంది యువరాజ్‌.


యువరాజ్: ఏవరు ఆపుతున్నారో తెలియదు కానీ వాళ్లను మనం ఆపకుంటే భాయ్‌ మనల్ని బతకనివ్వడు బాబాయ్‌.


 అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. తర్వాత కౌషికిని తీసుకుని కేదార్‌, ధాత్రి ఇంటికి వస్తారు.  వాళ్లను చూసిన నిషిక, వైజయంతి కిందకు వస్తారు. ధాత్రి ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తుంది. నిషిక, వైజయంతి తమ మాటలతో కౌషికిని ఇబ్బంది పెడతారు. సుధాకర్‌, కేదార్‌ వాళ్లను తిడతారు. ఇంతలో బోర్డు మెంబర్స్‌ వస్తారు. నువ్వు కేసులో ఇరుక్కున్నావు కదా అందుకే నీ స్థానంలో ఎవరిని నియమిస్తావో చెప్పాలని అడుగుతారు. దీంతో కేదార్‌, ధాత్రి అడ్డుపడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   


ALSO READ: కూతురు క్లింకారాకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ - ఆ బహుమతికి ‘మగధీర’తో లింక్ ఉంది, ఏంటో చెప్పుకోండి!