Jagadhatri  Serial Today Episode: ధాత్రి, కేదార్‌ మీద ఒట్టు వేసి నిజం చెప్పలేక.. అలా అని నిజం తెలిస్తే జరిగే పరిణామాలను తలుచుకుని బాధపడుతుంది. కౌషికి నిజం చెప్పమని లేదంటే మీరు నిజంగానే మోసం చేసినట్టు అవుతుందని చెప్తుంది. దీంతో ధాత్రి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇంతలో కేదార్‌ తన తల మీద ఉన్న ధాత్రి చేయ్యి తీస్తాడు.

కౌషికి: కేదార్‌ ఎందుకు చెయ్యి తీశావు. ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని భయమా? అనుకున్నది జరగక ముందే ఎక్కడ మీ నాటకానికి తెర పడిపోతుందేమోనని భయమా?

నిషిక: నీకు ఇప్పకైనా మనవాళ్లు ఎవరు? మంచివాళ్లు ఎవరు? అర్థమైందా వదిన. దీన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న. ఇది ఎంత మాయలాడో.. టెక్కులాడో.. నాకు బాగా తెలుసు. లోపల ఇంత పెట్టుకుని బయటకు నాలుగు మంచి మాటలు చెప్పగానే ఇంత నమ్ముతారా?

కేదార్‌: ఏంటి అప్పుడే సైలెంట్‌ అయిపోయారు. ఇంకా మమ్మల్ని అనాల్సిన మాటలు, వేయాల్సిన నిందలు లేవా? జగధాత్రి నేను తాళి కట్టిన నా భార్య. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. చచ్చేదాకా కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం. ఒట్టు వేసైనా వేయకుండానైనా ఇదే చెప్తా.. చెప్పు అక్కా మేము మీ అందరికీ అబద్దం చెప్పి ఈ ఇంట్లో అడుగుపెట్టడం వల్ల మాకేంటి?

ధాత్రి: అవును వదిన మాకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు.

బూచి: మరి నాన్నమ్మ గారు అలా ఎందుకు చెప్తారు సిస్టర్‌.

కాచి: అవును అమ్మమ్మ అంత కచ్చితంగా చెప్తుంది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. కదా?

ధాత్రి: ఆవిడ ఎందుకు చెప్పిందో నాకు తెలియదు కానీ మేము మాత్రం బార్యాభర్తలమే..

 అని చెప్పగానే నిషిక లేదు మీరు అబద్దం చెప్తున్నారు అంటూ కోప్పడుతుంది. ఇంతలో నువ్వు తాళి మెడలో వేసుకోవడం నేను చూశాను అంటూ పిన్ని కరాకండిగా చెప్పడంతో మీరు ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నారో మేము అలా చేయలేదని కేదార్‌ చెప్తాడు. అయితే ఆ రోజు స్వామి వారి కళ్యాణం జరిగిందని అది మాకు తెలిసిన పిల్లొడే వీడియో తీశాడని ఆ వీడియో తీసుకొచ్చి చూపిస్తానని పిన్ని చెప్పగానే మీరు ఏదైనా తీసుకురండి కానీ మేము బార్యాభర్తలం అంటూ ధాత్రిని తీసుకుని పైకి వెళ్తాడు కేదార్‌.  పైకి వెళ్లిన కేదార్‌ కింద చాలా ధైర్యంగా మాట్లాడాను కానీ ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటూ భయపడతాడు. నిజం తెలిస్తే నేను ఈ ఇంటికి శాశ్వతంగా దూరమవ్వాల్సి వస్తుంది. అని ఇకపై మనం ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్‌ అవుతారు. మరోవైపు ఇంట్లో వాళ్లందరూ ధాత్రి కేదార్‌ ల గురించి మాట్లాడుకుంటుంటారు. పిన్ని వీడియో తీసుకొచ్చి అసలైన నిజం అందరికి తెలిసేలా చేస్తానని చెప్తుంది. దీంతో వాళ్ల నిజం తెలిసి వెంటనే బయటకు పంపిచేస్తానని కౌషికి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు పోలీస్‌ స్టేషన్‌లో చరణ్‌ను ఇన్‌స్పెక్టర్‌ ఇంటరాగేషన్‌ పేరుతో కొట్టబోతుంటే కేదార్‌, ధాత్రి వస్తారు.

ధాత్రి: ఇన్వెస్టిగేషన్‌కు ముద్దాయిని ఇలా కూర్చోబెట్టి అసభ్యకరంగా ఇలా మాట్లాడమని చట్టం మీకు చెప్పలేదు.

ఇన్‌స్పెక్టర్‌: నా స్టేషన్‌ కు వచ్చి నాకే ఇన్వెస్టిగేషన్‌ గురించి నేర్పిస్తారా?

ధాత్రి: ఇన్‌స్పెక్టర్‌ గారు మీరు తప్పు ప్రశ్న వేస్తున్నారు కాబట్టి మీకు తప్పు సమాధానమే వస్తుంది. పది నిమిషాల టైం ఇవ్వండి అసలు నిజం నేను నిరూపిస్తాను.

అనగానే ఇన్‌స్పెక్టర్‌ సరేనని చెప్పడంతో ధాత్రి, కేదార్‌లు ఇద్దరూ చరణ్‌ను ఇన్వెస్టిగేషన్‌ చేస్తారు. దీంతో అసలు నిజం చెప్తాడు చరణ్‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: భార్యతో థాయ్‌లాండ్‌ వెకేషన్‌లో ఆది పినిశెట్టి - ఫోటోలు వైరల్‌